Professor-Student Marriage Controversy: విద్యార్థిని క్లాస్‌లోనే పెళ్లి చేసుకున్న లేడి టీచర్, అయితే అది నిజం పెళ్లి కాదని తెలిపిన ప్రొఫెసర్, వీడియో మాత్రం వైరల్
పశ్చిమ బెంగాల్‌లోని హరిన్‌ఘటలో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (MAKAUT) సైకాలజీ విభాగంలోని క్లాస్ రూమ్లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులు, లేడీ ప్రొఫెసర్ కు దగ్గరుండి పెళ్లి చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని హరిన్‌ఘటలో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (MAKAUT) సైకాలజీ విభాగంలోని క్లాస్ రూమ్లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులు, లేడీ ప్రొఫెసర్ కు దగ్గరుండి పెళ్లి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో యూనివర్సిటీ యాజమాన్యం విచారణ చేపట్టింది. ఈ ఘటనపై యూనివర్సిటీ ముగ్గురు సభ్యుల విచారణ ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, ప్రొఫెసర్ నుండి వివరణ కోరింది. అయితే ఇది క్లాస్‌లో సైకో డ్రామా అని ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఇది అకడమిక్ ప్రాజెక్ట్‌లో భాగమని, అసలు పెళ్లి కాదని తేల్చి చెప్పారు.
సైకాలజీ డిపార్డ్ మెంట్ ప్రతిష్టనే దిగజార్చడానికి కొందరు వీడియోలను లీక్ చేశారని ప్రొఫెసర్ మండిపడ్దారు.వధువులా దుస్తులు ధరించిన ప్రొఫెసర్ మరియు మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి 'సిందూర్ దాన్' మరియు 'మాలా బోడోల్'తో సహా హిందూ బెంగాలీ వివాహానికి సంబంధించిన వివిధ ఆచారాలను క్లాస్‌రూమ్‌లో చేస్తున్నట్లు వీడియోలు చూపించాయి.అయితే విచారణ ముగిసే వరకు సెలవుపై వెళ్లాల్సిందిగా ప్రొఫెసర్‌ను కోరినట్లు అధికారులు తెలిపారు. ఇతర విభాగాలకు చెందిన ముగ్గురు మహిళా అధ్యాపకులతో కూడిన కమిటీ విచారణ జరుపుతోందని వారు తెలిపారు.
Professor-Student Marriage Controversy:
A student was tried of going to college every day
He married to that teacher so that he can learn from home #westbengal pic.twitter.com/dWEIycklFb
— Mr. Roy (@iamroysunny) January 29, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 29, 2025 09:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

