ఫెంగల్‌ తుపాన్‌ తమిళనాడును వణికిస్తోంది. కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. సోమవారం మధ్యాహ్నం తిరువణ్ణామలైలో దేవాలయం వద్ద ఉన్న నివాసంపై కొండచరియలు విరిగిపడ్డాయి.ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.వర్షాల కారణంగా ఇప్పటికే తమిళనాడులో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడటంతో అందులో కొందరు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పలు చోట్ల వరదల ధాటికి బస్సులు, కార్లు కొట్టుకుపోతున్నాయి. ఇప్పటికీ పలు జిల్లాలకు రెడ్‌, ఆరెంజ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది.

వీడియోలు ఇవిగో, తమిళనాడులో ఇళ్లపై విరిగిపడ్డ కొండచరియలు, ఏడుగురు గల్లంతు, ఆరు గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

7 Including 5 Children Killed After Huge Rock Falls on Their House in Tamil Nadu

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)