అస్సాం (Assam) రాష్ట్రంలోని కాజీరంగ్ నేషనల్ పార్క్‌లో ఖడ్గమృగం మంద నడుమ టూరిస్టుల జీపులు తిరుగుతూ కనిపించాయి. మూడు జీపులు ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉన్న చోటుకు దగ్గరగా రైడ్‌కు వెళ్లాయి. ఈ క్రమంలో రెండు వెహికల్స్ రైట్ తీసుకుంటుండగా.. ఓ జీపులోని తల్లీ కూతురు ఒక్కసారిగా రోడ్డుపైకి ఎగిరి పడ్డారు. ఖడ్గమృగం ముందు పడిపోయారు.
ఇంతలో వారికి సమీపంలో ఉన్న మరో రినో మూడో జీపువైపుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ తల్లీ కూతురు తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. జీపు నుంచి కిందపడిన ఆ తల్లీ తన కూతురిని అదిమి పట్టుకుని నేలపై పడుకునిపోయింది. రక్షించమంటూ గట్టిగా అరుస్తూ వేడుకుంది. ఈలోపు.. ముందుకు వెళ్లిన జీపు నెమ్మదిగా వాళ్ల దగ్గరకు చేరుకుంది.క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ బిడ్డతో తల్లి వాహనం ఎక్కేసింది. దీంతో ఖడ్గమృగం దాడి నుంచి వారు తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
డాక్టర్ నిర్లక్ష్యం.. నాలుగురోజుల పసికందు మృతి.. వికారాబాద్ లో దారుణం (వీడియోతో)
Woman and Daughter Fall off Safari Gypsy in Front of Rhinos
Mother & Daughter Fell Near Rhino
A mother and daughter fell off a safari vehicle in Kaziranga National Park, landing near rhinos. The incident, caught on a tourist's camera, ended safely as both escaped unscathed.#Assam #kaziranga #Safari #Rhinoceros #viral . pic.twitter.com/3lyGiuAngp
— Info Bazzar Net (@infobazzarnet) January 6, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)