అమృత్ సర్ కతిహార్ ఎక్స్ ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు రైల్వే కోచ్ అటెండెంట్లుకి లంచం ఇచ్చి తన సీటులోనే మద్యం సేవించాడు.అనంతరం తోటి మహిళా ప్రయాణికులతో అతను అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో అతన్ని రైల్వే టీటీఈ చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

అయితే ఈ కథలు అనేక ట్విస్టులు కూడా ఉన్నాయి. అవేంటంటే.. రైల్వే కోచ్ అటెండెంట్లు విక్రమ్ చౌహాన్, సోను మహతో లకు లంచం ఇచ్చిన తాజుద్దీన్ అనే ప్రయాణికుడు వారితోనే మద్యం సేవించాడు. అనంతరం అసభ్యకర ప్రవర్తనకు దిగాడు. మహిళా ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో మద్యం సేవించిన రైల్వే అటెండెంట్ చౌహాన్ రైల్వే టీటీఈ రాజేశ్ కుమార్ ను పిలిచాడు.

కర్ణాటకలో దారుణం..కుక్కపై కారును పొనిచ్చి చంపేసిన ఓ వ్యక్తి..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు

ఇక ప్రయాణికుడు తాజుద్దీన్ టీటీఈ రాజేశ్ కుమార్ తో గొడవపడి చెంపదెబ్బ కొట్టాడు. దీంతో రెచ్చిపోయిన రాజేశ్ కుమార్.. తాజుద్దీన్ ను డోర్ వద్దకు లాక్కుని వెళ్లి చౌహాన్ సాయంతో కిందపడేసి వీపుపై కూర్చోగా.. చౌహాన్ బెల్ట్ తో చితకబాదాడు. తాజుద్దీన్ వీపుపై రాజేశ్ కుమార్ ఎగిరి దూకడం వీడియోలో కనిపించింది. ప్రయాణికులు సమాచారం అందించడంతో తర్వాతి స్టేషన్ లో రైల్వే పోలీసులు టీటీఈని అదుపులోకి తీసుకున్నారు. ఇక మద్యం సేవించిన చౌహాన్, మహతోలు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.

Passenger being brutally beaten by a TTE and an attendant

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)