కర్నాటక పోలీసు డిపార్ట్‌మెంట్‌ను కంగుతినిపిస్తూ సదరు అధికారి చర్యలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ ఘటన కర్ణాటక హోంమంత్రి జిపిరామేశ్వర్ సొంత జిల్లా తుమకూరులో చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న వీడియో న్యూస్ ప్రకారం.. కర్నాటక లోని మధుగిరి డివైఎస్పీ రామచంద్రప్పకు కంప్లైంట్ ఇచ్చేందుకు ఓ మహిళ కార్యాలయానికి వచ్చింది. అయితే ఆ మహిళ పట్ల ఆ అధికారి అనుచితంగా ప్రవర్తించాడు. భూమి వివాదానికి సంబంధించి ఆ మహిళ పావగడ నుంచి కార్యాలయానికి వచ్చింది. అధికారి ఆమెను ఓ ప్రైవేట్ గదికి తీసుకెళ్లి ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడని, ఆమెతో పాటు వచ్చిన అనిల్ అనే వ్యక్తి రికార్డు చేసిన వీడియో వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది. వీడియో సర్క్యులేషన్ తరువాత రామచంద్రప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

కోనసీమ జిల్లాలో రేవ్ పార్టీ కలకలం.. యువతులతో అసభ్య నృత్య ప్రదర్శనలు.. కేసు నమోదు చేసిన పోలీసులు (వీడియో)

ఈ సంఘటన పట్ల ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన దురదృష్టకరం అని పేర్కొంటూ తుమకూరు ఎస్పీ అశోక్ మాట్లాడుతూ.. ఇది తీవ్రమైన విషయం. సీనియర్‌ అధికారులకు సమాచారం అందించామని, సమగ్ర దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు.మహిళలపై ఎలాంటి వేధింపులు లేదా హింసను సహించబోమని, పోలీసులపై ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

DYSP Ramachandrappa caught on camera with a woman involved in inappropriate behaviour 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)