గోషామహల్‌‌‌‌‌‌‌‌ పోలీస్ స్టేడియంలో సోమవారం ‘పోలీస్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌ మీట్–2025’ మొదలైంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, డిజి సివి ఆనంద్ హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో జరిగిన క్రికెట్ ఆడారు. హైదరాబాద్ సిటీ పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 సందర్భంగా ఆయన క్రికెట్ (CV Anand Played Cricket Video) ఆడారు. ఆయన బౌలింగ్ చేస్తుంటే కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కీపింగ్ చేశారు. కాగా సీవీ ఆనంద్ భారత జాతీయ అండర్-19లో క్రికెట్ ఆడారు. మంచి క్రికెట్ ప్రేమికుడు. పోలీస్ కాక ముందు తాను బెస్ట్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ మెన్‌‌‌‌‌‌‌‌ని అని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. క్రికెట్​లో బ్యాటింగ్ కు దిగితే సెంచరీ కొట్టాల్సిందేనన్నారు. వంద మీటర్ల రన్నింగ్ ​రేస్​లో గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్ కొట్టాలనే పట్టుదలతో బరిలోకి దిగుతానన్నారు. ఆటల్లో ఓడిపోతే ఆ రాత్రి నిద్ర పట్టదని తెలిపారు.

టీ-20ల్లో అరుదైన రికార్డ్ సృష్టించిన అర్షదీప్‌ సింగ్, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర

సీపీ మాట్లాడుతూ.. నాలుగు రోజుల పాటు సాగే యాన్యువల్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్ అండ్‌‌‌‌‌‌‌‌ గేమ్స్ మీట్ లో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొంటున్నారని, మొత్తం 24 రకాల ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. స్పోర్ట్స్ మీట్‌‌‌‌‌‌‌‌లో 14 జట్లు పాల్గొనడం ఇదే మొదటిసారి అన్నారు.

CV Anand Played Cricket Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)