ఏపీలో బాపట్ల శివారు నల్లమడ వాగులో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాపట్ల శివారు నల్లమడ వాగులో ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం పర్యటక కేంద్రం సూర్యలంక బీచ్‌కు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో నల్లమడ వాగులో స్నానానికి దిగారు. తొలుత ప్రవాహ ఉద్ధృతికి ఒకరు కొట్టుకుని పోయారు. అతడిని రక్షించే క్రమంలో మిగతా ముగ్గురు గల్లంతైనట్లు తెలిపారు.వారంతా కూకట్‌పల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన సన్నీ ,కిరణ్ , నందులుగా గుర్తించారు. రెండు మృతదేహాలు లభించగా, గల్లంతైన మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు.  వీడియోలు ఇవిగో, ఉప్పాడలో ఇంకా అల్లకల్లోలంగానే సముద్రం, ఇళ్లలోకి దూసుకువచ్చిన సముద్రపు నీరు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)