ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్‌ను లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం (Eluru Road Accident) జరిగింది.ప్రమాదం ధాటికి బస్సు తీవ్రంగా దెబ్బతింది.క్షతగాత్రులను ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పరామర్శించారు. ఆమె ఆస్పత్రికి వెళ్లి బాధితులకు అందుతున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
మరో ఘటనలో వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని మద్దిమడుగు ఘాట్ పైన బుధవారం మధ్యాహ్నం లారీ లోయలోకి పడిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. చేపల మేత లోడుతో బెంగళూరు నుంచి ఏలూరుకు వెళ్తున్న లారీ మద్దిమడుగు ఘాట్ పైన నాలుగో మలుపు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి 50 అడుగులున్న లోయలోకి పడిపోయింది.లారీలోని డ్రైవర్ సాంబయ్య, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా.. చక్రాయపేట మండలం కప్పకుంటపల్లెకు చెందిన కె.వివేకానందరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Eluru Road Accident
Three persons were killed and 20 others were injured when Ramana Travels bus, on its way to #Kakinada from #Hyderabad , overturned after rammed into a cement-laden truck on the highway near #Chodimella , in #Eluru dist today.#EluruBusAccident #BusAccident #RoadAccident… pic.twitter.com/x3wWKA9XR9
— Surya Reddy (@jsuryareddy) March 6, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)