woman Ran Along Chandrababu's Convoy Video: కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు రాగా కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారు లోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి....ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చాను అని చెప్పింది. వీడియో ఇదిగో, జగన్..నీవల్లే వైసీపీ ఘోరంగా ఓడిపోయింది, అధినేతపై విరుచుకుపడిన తిరువూరు వైసీపీ మాజీ ఎమ్యెల్యే రక్షణ నిధి
తనను చూసి ఎమోషనల్ అయి ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. మా కష్టం ఫలించి....మా కోరిక మేరకు మీరు సిఎం అయ్యారు సార్....ఒక్క సారి మీ కాళ్లు మొక్కుతాను అంటూ ఆ మహిళ అనగా... చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడడాలని వచ్చాను అని నందిని చెప్పగా...ముందు ఆసుపత్రికి వెళ్లు అంటూ సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని.... అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు.
Here's Video
A woman was running behind the Convoy of #TDP chief and CM designate N Chandrababu Naidu.
He stopped his car and talked with her. She said that her name is Nadini, from Madanapalle and came to see him as she is a big fan of #ChandrababuNaidu .#NaraChandrababuNaidu #Amaravati pic.twitter.com/RCixrFHezg
— Surya Reddy (@jsuryareddy) June 11, 2024
బాబును చూడాలి అంటూ కాన్వాయ్ వెంట మహిళ పరుగులు....కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు
విజయవాడ - కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు రాగా కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ… pic.twitter.com/Et1bcBSfAJ
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)