న్యూ ఇయర్ వేళ హైదరాబాద్‌లో డ్రగ్స్(Drugs) కలకలం రేపింది. గచ్చిబౌలిలోని క్వాక్ అరెనా పబ్‌(Kwak Arena Pub)లో డ్రగ్స్ వాడుతున్నారని వచ్చినా పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం నార్కోటిక్ పోలీసులు(Narcotics Bureau) తనిఖీలు నిర్వహించారు. పబ్‌కు వచ్చిన కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం టెస్టులు చేయగా.. 8 మందికి పాజిటివ్ వచ్చింది. అనంతరం తనిఖీల సమయంలో డ్రగ్స్ పట్టుబడితే అప్పుడు తామేంటో చూపిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే తప్పకుండా పోలీసులకు తెలియజేయాలని కోరారు.

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల కోసం టాప్ 10 ఈవెంట్లు ఇవిగో, ధర కూడా రూ.299 నుంచి ప్రారంభం

8 Customers test positive for Drugs 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)