తెలంగాలోని నిజామాబాద్ జిల్లాలో గల బోధన్ మండలం పెగడపల్లిలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. పొలంలో కరెంట్ తీగలు తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జిల్లాలోని షాటాపూర్‌కి చెందిన గంగారాంకి పెగడపల్లిలో కొంత వ్యవసాయ భూమి ఉంది.
అయితే అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు కరెంట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో.. భార్య, కొడుకుతో కలిసి పొలానికి వెళ్లాడు. కరెంట్ తీగలు పెడుతున్న టైంలో బోర్ మోటార్ కరెంట్ వైర్లు బయటకు వచ్చాయి. దీంతో ఆ కుటుంబ సభ్యులకు కరెంట్ షాక్ తగిలింది. ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
Three of a family electrocuted to death in Nizamabad
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)