తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి.ఈ సారి రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ఎండలు పెరుగుతూ ఉండగా మరోవైపు వర్షాలు పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నుంచి ఆదివారం దాకా పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది.
గురు, శుక్రవారాల్లో మూడు, నాలుగు జిల్లాల్లో, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఉంటుందని తెలిపింది.అదే సమయంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం నిజామాబాద్, నిర్మల్, నాగర్కర్నూల్, ఆదిలాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నిజామాబాద్ లోని జక్రాన్ పల్లిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రెండు మూడు రోజుల్లో మరిన్ని జిల్లాల్లో ఎండ 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)