భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ యూకే పర్యటనలో భారీ భద్రతా లోపం చోటుచేసుకుంది. ఆయనపై ఖలిస్థానీ అనుచరులు దాడికి యత్నించడం కలకలం రేపింది. లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో అధికారిక సమావేశాల్లో పాల్గొన్న అనంతరం బయటకు వచ్చిన సమయంలో ఖలిస్థానీ అనుకూల కార్యకర్తలు ఆయన కారువైపు దూసుకొచ్చారు.కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఖలిస్థానీ జెండాలను ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఆ గుంపులోని ఓ వ్యక్తి భారత జాతీయ జెండాను అవమానించేలా ప్రవర్తిస్తూ, మంత్రి వాహనానికి అత్యంత సమీపానికి చేరుకున్నాడు. అప్రమత్తమైన లండన్‌ పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని, కారువైపు దూసుకొచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

జైశంకర్‌ మార్చి 4న ఐదు రోజుల పర్యటనలో భాగంగా యూకేకు వెళ్లారు. ఈ నెల 9వ తేదీ వరకు అక్కడే ఉండి పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.భద్రతా విఫలంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం దీనిపై అధికారికంగా స్పందించనప్పటికీ, లండన్‌ పోలీసులు చర్యలు తీసుకోవడం విశేషం.

S Jaishankar Security Scare: 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)