తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఆమె తల్లిపై యువకుడు హత్యాయత్నం చేశాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు రాజ్‌కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని వెంట పడ్డాడు.ఈ విషయం తెలిసిన యువతి తల్లి.. కుమార్తెకు వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చింది. దీంతో ఆగ్రహించిన నిందితుడు యువతి తల్లిపై అమానుషంగా దాడికి పాల్పడ్డాడు. ఆమె గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఆమెను దుండగుడి నుంచి రక్షించారు. పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
కరెంట్ తీగలపై ప్రమాదకర స్టంట్.. పుషప్స్ తీస్తు ఓ వ్యక్తి హల్ చల్, వైరల్‌గా మారిన వీడియో
Young man Attack on girlfriend mother for refusing to marry
పెళ్లికి నిరాకరించిందని యువతి తల్లిపై యువకుడు దాడి
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారానికి చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని వెంట పడ్డాడు. విషయం తెలిసిన యువతి తల్లి... కుమార్తెకు వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చింది. ఆగ్రహించిన రాజ్ కుమార్… pic.twitter.com/pzb96I8iIN
— ChotaNews App (@ChotaNewsApp) March 2, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)