మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది(Madhya Pradesh Viral Video). యజమాని ప్రాణాలను కాపాడటం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది ఓ కుక్క(Heart Touching Video). మధ్యప్రదేశ్‌లోని బంధవగఢ్ నేషనల్ పార్క్ సమీపంలోని భరహుట్ గ్రామంలో ఓ పులి పొలంలోకి ప్రవేశించి రైతు శివమ్ బర్గాయియాపై దాడి చేసింది.

అయితే అతని పెంపుడు కుక్క 'బెంతో' తన యజమానిని రక్షించేందుకు పులితో కొట్లాడి(Tiger Attack ) అసమాన ధైర్యం ప్రదర్శించి యజమాని ప్రాణాలు కాపాడింది. అయితే తన ప్రాణాలు కొల్పోయింది కుక్క. పులి దాడి నేపథ్యంలో యజమాని శివమ్ భయంతో వణికిపోగా, అతని కుక్క బెంతో మాత్రం ధైర్యంగా వ్యవహరించింది.

రోడ్డు దాటుతున్న చిరుతను ఢీకొట్టిన బైకర్‌.. గాయపడ్డ చిరుత, కాసేపటి తర్వాత చెట్ల పొదల్లోకి వెళ్లగా వైరల్‌గా మారిన వీడియో

ఏ మాత్రం సందేహించకుండా బెంతో పులిని ఎదుర్కొంది. అయితే తన పంజాతో గాయపరిచింది పులి.తన దంతాలతో బెంతోను పట్టుకుని గ్రామం బయటికి ఈడ్చుకెళ్లింది. రక్తస్రావంతో బెంతో కింద పడగా పులి అక్కడి నుండి వెళ్లిపోయింది. తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందిన కొన్ని గంటలకే బెంతో మరణించింది. ఈ ఘటన గ్రామస్తులను, శివమ్ కుటుంబాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఫిబ్రవరి 26న జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు నీరాజనం పలుకుతున్నారు.

Pet Dog Dies Saving Owner-Farmer From Tiger Attack

વાઘના હુમલાથી માલિકને બચાવવા જર્મન શેફર્ડે આપ્યું જીવનું બલિદાન; મધ્યપ્રદેશનો હૃદયદ્રાવક કિસ્સો #Madhyapradesh #tigerattack #GermanShepherd #gujaratsamachar pic.twitter.com/wkzOIwSDny

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)