పంట పొలాల్లో నకిలీ నోట్ల కట్టలు దర్శనమిచ్చిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో పొలానికి వెళ్లిన ఓ రైతుకు తన పొలంలో రూ.20 లక్షల విలువైన 500 నోట్ల కట్టలు కనిపించాయి. అయితే.. నోట్లపై చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉండటంతో ఇది దొంగ నోట్లు ముద్రించే వారి పనే అయి ఉంటుందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో నకిలీ నోట్లు ముద్రించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

మరో ఘటనలో తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత అన్నను ఇద్దరు చెల్లెళ్లు మట్టుబెట్టిన ఘటన పోచమ్మవాడలో జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో అన్నపై ఇద్దరు చెల్లెళ్లు.. దాడి చేసి, హత్య చేశారు. అన్న జంగిలి శ్రీనివాస్‌పై ఇద్దరు చెల్లెళ్లు శారదా, వరలక్ష్మి కర్రలతో విచక్షిణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన ఇద్దరు నిందితురాళ్లు.

హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం.. కన్నతండ్రిని దారుణంగా హత్య చేసిన కొడుకు, 15 సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా హతమార్చిన వైనం, వీడియో

Farmer found bundles of Rs. 20 lakh worth of 500 notes in His Field

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)