Sports

Ravindra Jadeja Injury: ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై బీసీసీఐ సీరియస్? కీలక సమయంలో మోకాలికి గాయం, టీ-20 వరల్డ్ కప్‌కు దూరంగా ఉండనున్న జడ్డూ, ఇంతకీ ఆ గాయం ఎలా అయ్యిందో తెలుసా?

Naresh. VNS

జడేజా తీరుపై బీసీసీఐ (BCCI) సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు ఆసియా కప్ జరుగుతుండగా, మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ఉండగా, అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ లో పాల్గొనేందుకు వెళ్లడం అవసరమా? అంటూ బోర్డు వర్గాలు అతడిపై మండిపడ్డాయి.

Neeraj Chopra Wins Diamond League Title: డైమెండ్ లీగ్ టైటిల్ గెలిచిన నీర‌జ్ చోప్రా, తొలి భార‌తీయుడిగా రికార్డు సృష్టించిన జావెలిన్ త్రోయ‌ర్

Hazarath Reddy

జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా ప్ర‌తిష్టాత్మ‌క డైమెండ్ లీగ్ టైటిల్ గెలిచిన తొలి భార‌తీయుడిగా ఘ‌న‌త సాధించాడు. తొలి త్రోను ఫౌల్‌గా ప్రారంభించినా.. ఆ త‌ర్వాత 88.44 మీట‌ర్ల దూరం జావెలిన్‌ను విసిరి డైమెండ్ లీగ్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు.

Nepal: ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ కామాంధుడు, నన్ను రూంకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడు, నేపాల్‌ జట్టు కెప్టెన్ సందీప్ లామిచ్చనేపై సంచలన ఆరోపణలు చేసిన మైనర్ బాలిక

Hazarath Reddy

నేపాల్‌ దేశ క్రికెట్ టీం కెప్టెన్ తనను బలాత్కరించాడని ఒక మైనర్ బాలిక ఫిర్యాదు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నేపాల్ రాజధాని ఖాట్మండులో చోటు చేసుకుంది.నేపాల్ జట్టు సారధి అయిన సందీప్ లామిచ్చనే (Nepal cricket captain Sandeep Lamichhane) తనపై మూడు వారాల క్రితం అత్యాచారం చేశాడని ఒక 17 ఏళ్ల మైనర్ యువతి కేసు పెట్టింది.

India Vs Afg: 1020 రోజుల నిరీక్షణ ముగిసింది.. తన 71వ సెంచరీని నమోదు చేసిన కోహ్లీ.. పరుగుల వరదను ఎవరికి అంకితం ఇచ్చాడంటే?

Jai K

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ] చాన్నాళ్ల తర్వాత మునపటి ఫామ్ అందుకున్నాడు. ఆసియా కప్(Asia Cup) సూపర్ 4లో (Super 4) భాగంగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ పై విరాట్ 61 బంతుల్లో 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ప్రత్యేక శతకాన్ని విరాట్ తన భార్య అనుష్క శర్మ (Anushka Sharma), ముద్దుల కూతురు వామికా (Vamika)కు అంకితం (Dedicate) చేశాడు.

Advertisement

Asia Cup 2022: కోహ్లి పరుగుల వరద.. టోర్నీలోనే అత్యధిక స్కోరు నమోదు.. ఆఫ్ఘాన్ పై భారత్ విజయ దుందుభి

Jai K

ఆసియా కప్ ను భారత్ విజయంతో ముగించింది. సూపర్-4లోని ఆఖరి పోరులో ఆఫ్ఘనిస్తాన్ పై 101 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. కొంతకాలంగా ఫాంలో లేని విరాట్.. ఈ మ్యాచ్ లో తన సత్తా చాటాడు. 61 బంతుల్లో 122 (నాటౌట్) పరుగులు చేసి రాణించాడు.

Dubai: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అగ్నిప్రమాదం, స్డేడియం ఎంట్రన్స్ వద్ద ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు

Hazarath Reddy

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్డేడియం ఎంట్రన్స్ వద్ద ఈ మంటలు చెలరేగడంతో అక్కడ ఆందోళన నెలకొంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Asia Cup 2022: షాకింగ్ వీడియో, పాకిస్తాన్ అభిమానులను తరిమి తరిమికొట్టిన ఆఫ్ఘన్లు, షార్జా స్టేడియంలో రచ్చ రచ్చ, కొద్ది నిమిషాల పాటు స్టేడియంలో వీరంగం

Hazarath Reddy

ఆసియా కప్‌ సూపర్‌-4 దశలో పాకిస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ వికెట్‌ తేడాతో పరాజయం పాలై, టీమిండియాతో పాటు టోర్నీ నుంచి నిష్క్రమించింది.అయితే, జట్టు ఓటమిని జీర్ణించుకోలేని ఆఫ్ఘన్‌ అభిమానులు మ్యాచ్‌ అనంతరం షార్జా స్టేడియంలో రచ్చరచ్చ చేశారు.

Asia Cup 2022: వైరల్ వీడియో, ఆఫ్ఘాన్ బౌలర్‌ని బ్యాట్‌తో కొట్టబోయిన పాక్ ఆటగాడు ఆసిఫ్‌ అలీ, అతన్ని రెచ్చగొట్టిన ఆఫ్ఘన్‌ బౌలర్‌ ఫరీద్‌ అహ్మద్‌

Hazarath Reddy

19వ ఓవర్ నాలుగో బంతికి సిక్సర్‌ బాది జోరుమీదున్న పాక్‌ బ్యాటర్‌ ఆసిఫ్‌ అలీ.. ఆ తర్వాతి బంతికే ఔటయ్యానన్న కోపంతో ఆఫ్ఘన్‌ బౌలర్‌ ఫరీద్‌ అహ్మద్‌ను బ్యాట్‌తో కొట్టబోయాడు. ఇందులో ఫరీద్‌ తప్పు కూడా ఉంది.

Advertisement

Chappell-Hadlee Series: చెత్త చెత్తగా ఆడిన ఆస్ట్రేలియా, అంతకన్నా చెత్తగా ఆడిన న్యూజీలాండ్, 113 పరుగుల తేడాతో గెలిచి చాపెల్-హాడ్లీ సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆసీస్

Hazarath Reddy

కెయిర్న్స్‌లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 113 పరుగుల తేడాతో గెలిచి చాపెల్-హాడ్లీ సిరీస్‌ను (Chappell-Hadlee Series) కైవసం చేసుకుంది. అగ్రశ్రేణి న్యూజిలాండ్ (New Zealand) గురువారం ఆసీస్ బౌలర్ల అద్భుతమైన బౌలింగ్‌ ధాటికి 82 పరుగులకే కుప్పకూలింది.

Asia Cup India Vs Srilanka: ఉత్కంఠ రేపిన పోరులో టీమిండియాను ఓడించిన శ్రీలంక, వరుసగా రెండో మ్యాచులో భారత్ ఓటమిపాలు, 6 వికెట్ల తేడాతో గెలిచిన లంక...

Krishna

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20.0 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.

Suresh Raina Retires: అన్ని ఫార్మాట్ల‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సురేశ్ రైనా, ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు స్పష్టం, మ‌ద్ద‌తు ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెబుతూ ట్వీట్

Hazarath Reddy

క్రికెట‌ర్ సురేశ్ రైనా అన్ని ఫార్మాట్ల‌తో పాటు ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు అత‌ను స్ప‌ష్టం చేశారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌పున రైనా ఐపీఎల్ ఆడాడు. అయితే 2022 సీజ‌న్‌లో ఆ జ‌ట్టు అత‌న్ని ఎంపిక చేయ‌లేదు.

Asia Cup 2022 IND VS SL Super 4: శ్రీలంకతో కీలక పోరు నేడే.. ఉత్కంఠ పోరుకు భారత్‌ 'సై'..

Jai K

నేడు శ్రీలంకతో భారత్‌ తలపడనుంది. అనుభవం, రికార్డులపరంగా ప్రత్యర్థిపై అన్ని రకాలుగా భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... గత రెండు మ్యాచ్‌లలో లంక అనూహ్య విజయాలు చూస్తే అంత సులువు కాదని అనిపిస్తోంది.

Advertisement

Asia Cup 2022 - Ind Vs Pak: దినేష్ ని పక్కనబెట్టి మరీ నిన్ను తీసుకున్నందుకు.. ఇలా చేస్తావా? ఆ షాట్ ఏంటి?.. పంత్‌పై కోపంతో ఊగిపోయిన రోహిత్‌ శర్మ

Jai K

బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత్‌.. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమై పాక్ చేతిలో ఓటమి పాలైంది. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌.. నిర్లక్షమైన షాట్‌ ఆడి తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో నిర్లక్షమైన షాట్‌ ఆడి పెవిలియన్‌కు చేరిన పంత్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Asia Cup 2022: వైరల్ వీడియో, సింపుల్ క్యాచ్ విడిచిన హర్షదీప్‌, సహనం కోల్పోయిన కెప్టెన్ రోహిత్ శర్మ, భారీ మూల్యం చెల్లించుకున్న భారత్

Hazarath Reddy

నిన్న జరిగిన మ్యాచ్ లోని 18వ ఓవర్లో రవి బిష్ణోయి బౌలింగ్‌లో అర్ష్‌దీప్‌ జారవిడిచిన క్యాచ్‌ వల్ల రోహిత్‌ సేన భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.అర్ష్‌దీప్‌ తప్పిదంతో బతికిపోయిన పాక్‌ ఆటగాడు అసిఫ్‌ అలీ.. ఆ తర్వాతి ఓవర్లో భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో సిక్స్‌, ఫోర్‌ బాదాడు.

Asia Cup 2022: సమయం వచ్చినపుడు నిరూపించుకుంటాం, మాకిది గుణపాఠం, ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమని తెలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ

Hazarath Reddy

పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ పరాజయంపై (India and Pakistan)కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఒత్తిడి సహజమే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. రిజ్వాన్‌, నవాజ్‌ల జోడీని విడదీయలేకపోయాం.

Asia Cup 2022: భారత్ ఫైనల్‌కు చేరాలంటే, పాకిస్తాన్ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించాలి,అలాగే భారత్ మిగతా రెండు మ్యాచ్‌లు గెలివాలి, అది కూడా భారీ రన్ రేట్‌తో..

Hazarath Reddy

సూపర్ 4లో పాక్ చేతిలో ఓటమి పాలై ఫైనల్ అవకాశాలను భారత్ సంక్లిష్టం చేసుకుంది. అయినప్పటికీ, ఇప్పటికీ ఆసియాకప్ ఫైనల్స్ కు (Asia Cup 2022) చేరే అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నాయి.

Advertisement

India vs Pakistan: నరాలు తెగే ఉత్కంఠభరిత పోరు! ఒక బాల్ మిగిలి ఉండగానే విజయం సాధించిన పాకిస్తాన్, మహ్మద్ రిజ్వాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో పాక్‌ గెలుపు, ఆ ఒక్క క్యాచ్‌ మిస్సవ్వడంతోనే మ్యాచ్‌ పోయిందంటూ ఫ్యాన్స్ ఫైర్

Naresh. VNS

ఉత్కంఠభరిత పోరులో దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో ఒక బాల్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరకు విజేతగా నిలిచింది. భారత్‌ ఇచ్చిన టార్గెట్‌ను చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ ఫామ్‌లోకి రావడం మాత్రం భారత ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చింది.

India vs Pakistan: విరుచుకుపడ్డ విరాట్ కోహ్లీ, పాక్ ముందు భారీ లక్ష్యం, పాక్ బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపిస్తున్నఇండియన్ బౌలర్లు, ఈ సారి కూడా ఇంట్రస్టింగ్‌గా భారత్- పాక్‌ మ్యాచ్

Naresh. VNS

కొన్నాళ్లుగా పరుగుల దాహంతో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli).. పాక్ పై జూలు విదిల్చాడు. కీలక మ్యాచ్ లో దూకుడుగా ఆడి ఫిఫ్టీ సాధించాడు. అదీ ఓ సిక్స్ తో అర్ధసెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. మహ్మద్ హస్నైన్ వేసిన ఆ బంతి గంటకు 149 కిమీ వేగంతో దూసుకురాగా, కోహ్లీ బ్యాట్ ను తాకిన బౌండరీ అవతల పడింది. కోహ్లీ కేవలం 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు.

Asia Cup 2022: దాయాదుల పోరు రసవత్తరం.. భారత్, పాకిస్తాన్‌ మధ్య ‘సూపర్‌–4’ మ్యాచ్‌ నేడే

Jai K

భారత్, పాకిస్తాన్‌ మధ్య ‘సూపర్‌–4’ మ్యాచ్‌ నేడే. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో చివరి ఓవర్లో విజయంతో భారత్‌దే పైచేయి అయింది. రోహిత్‌ శర్మ సేన అదే జోరును కొనసాగిస్తుందా లేక బాబర్‌ ఆజమ్‌ కెప్టెన్సీలోని పాక్‌ బదులు తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరం. రాత్రి గం.7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానున్నది.

PAK Vs HK Asia Cup 2022: సూపర్‌-4కు పాకిస్తాన్‌.. హాంకాంగ్ పై 156 పరుగుల తేడాతో ఘన విజయం

Jai K

హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్‌లో 156 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ ఘన విజయం. హాంకాంగ్ బ్యాటర్లలో ఏ ఒక్కరి స్కోరు డబుల్ డిజిట్ కి చేరకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement