క్రీడలు

Jasprit Bumrah: ఇన్నింగ్స్‌లో తొలి బంతికే వికెట్ తీసిన తొలి భారత బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు, శ్రీలంక పాతుమ్ నిస్సాంకాను గోల్డెన్ డక్ గా పంపిన స్టార్ బౌలర్

Hazarath Reddy

బుమ్రా వేసిన తొలి ఓవర్‌లో మొదటి బంతికే నిస్సంక వికెట్ల ముందు దొరికిపోయాడు. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇన్నింగ్స్‌లో తొలి బంతికే వికెట్ తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. బుమ్రా గోల్డెన్ డక్ కోసం పాతుమ్ నిస్సాంకాను పెవిలియన్‌కు పంపాడు. బుమ్రా వేసిన డెలివరీ నిస్సాంక ప్యాడ్‌లకు తగిలింది.

World Cup 2023: శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న సిరాజ్, రెండు ఓవర్లలోనే మూడు వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బ తీసిన భారత స్టార్ బౌలర్

Hazarath Reddy

రెండో ఓవర్‌ వేసిన సిరాజ్‌.. లంకకు డబుల్‌ స్ట్రోక్‌ ఇచ్చాడు. తొలి బంతికే దిముత్‌ కరుణరత్నెను ఎల్బీగా వెనక్కి పంపిన సిరాజ్‌.. ఐదో బంతికి లంక కీలక బ్యాటర్‌ సధీర సమరవిక్రమను ఔట్‌ చేశాడు. ఇదే ఓవర్లో రెండో బంతికి రివ్యూ తీసుకుని బతికిపోయిన సమరవిక్రమ.. ఐదో బంతికి శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. నాలుగో ఓవర్‌ వేసిన సిరాజ్‌.. మరోసారి తొలి బంతికే లంకను దెబ్బతీశాడు.

Shreyas Iyer Six Video: శ్రేయస్‌ అయ్యర్‌ భారీ సిక్స్ వీడియో ఇదిగో, 106 మీటర్ల దూరం వెళ్లిన బంతి, వన్డే వరల్డ్‌కప్ 2023లో లాంగెస్ట్ సిక్స్ ఇదే..

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్ 2023లో భారీ సిక్స్ నమోదైంది. వాంఖడే వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌.. భారత ఇన్నింగ్స్‌ 36 ఓవర్‌లో రజిత వేసిన నాలుగో బంతిని లాంగాన్‌ మీదగా భారీ సిక్స్‌ర్‌ బాదాడు. అతను కొట్టిన షాట్‌కి బంతి 106 మీటర్ల దూరం వెళ్లింది

Virat Kohli: సెంచరీ మిస్, డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడ్చేసినంత పని చేసిన విరాట్ కోహ్లీ, నిరాశతో ఉన్న ఫోటోలు వైరల్

Hazarath Reddy

భారతదేశం vs శ్రీలంక ICC CWC 2023 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీని కోల్పోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో నిరాశ చెందాడు. దిల్షాన్ మధుశంక వేసిన అద్భుతమైన స్లోయర్ బాల్ కోహ్లీని మోసగించగా, అతను పాతుమ్ నిస్సాంకకు సులువుగా క్యాచ్ అందజేసాడు.

Advertisement

Shubman Gill Wicket Video: శుబ్‌మాన్‌ గిల్ ఔట్ వీడియో ఇదిగో, సారా టెండూల్కర్ రియాక్షన్ చూశారా, మధుశంక బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి కీపర్ కు క్యాచ్ ఇచ్చిన భారత ఓపెనర్

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా వాంఖడే వేదికగా భారత్‌-శ్రీలంక జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక కెప్టెన్‌ కుశాల్‌ మెండీస్‌ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. అయితే బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్‌ షాక్‌ తగిలింది.

Virat Kohli Wicket Video: విరాట్ కోహ్లీ ఔటైన వీడియో చూసి మళ్లీ అభిమానుల గుండె పగిలింది, ఈ సారి కూడా సచిన్ రికార్డును చేరుకోలేకపోయిన విరాట్

Hazarath Reddy

కోహ్లీ శతకానికి చేరువగా రావడంతో వాంఖెడేలో సచిన్‌ ఎదుట అతడి వన్డే సెంచరీల (49) రికార్డును కోహ్లీ సమం చేస్తాడని అంతా ఆశించారు. కానీ మధుశంక భారత అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. అతడు వేసిన 32వ ఓవర్లో మూడో స్లో బంతిని ముందు పుష్‌ చేయబోయిన కోహ్లీ.. షాట్‌ కవర్‌ వద్ద పతుమ్‌ నిస్సంకకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

World Cup 2023: శుబ్‌మన్‌ గిల్‌ ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా కొట్టిన షాట్‌కు విరాట్ కోహ్లీ రియాక్షన్ చూశారా, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Hazarath Reddy

భారత ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ వేసిన మధుశంక ఓవర్‌లో మూడో బంతిని గిల్‌ ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా అద్భుతమైన షాట్‌ ఆడాడు. గిల్‌ కొట్టిన బంతి కళ్లు మూసి తెరిచే లోపే బౌండరీకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కోహ్లి వావ్‌ అంటూ షాకింగ్‌ రియాక్షన్‌ ఇచ్చాడు.

World Cup 2023: శ్రీలంక జట్టులో భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీ, స్క్రీన్‌పై తప్పుగా చూపించిన బ్రాడ్‌కాస్టర్

Hazarath Reddy

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2023లో శ్రీలంకతో భారత్ ప్రస్తుతం హై-వోల్టేజ్ ఘర్షణలో నిమగ్నమై ఉంది. మ్యాచ్‌కు ముందు, బ్రాడ్‌కాస్టర్ రెండు జట్ల ప్లేయింగ్ XIలను స్క్రీన్‌పై ప్రదర్శిస్తుండగా, వారు ఏంజెలో మాథ్యూస్, దుష్మంత చమీరా స్థానంలో భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీల చిత్రాలను తప్పుగా చూపించారు. అభిమానులు వెంటనే దాన్ని గుర్తించి ఫోటోని వైరల్‌ చేశారు.

Advertisement

Virat Kohli Breaks Sachin Record: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు సాధించిన ఆటగాడిగా రికార్డు

Hazarath Reddy

అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా రన్‌ మిషన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా విరాట్‌ రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా శ్రీలంకపై 34 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కోహ్లి.. ఈ ఘనతను అందుకున్నాడు.

Rohit Sharma Wicket Video: రోహిత్‌ శర్మ క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, దిల్షాన్‌ బౌలింగ్‌లో రెండో బంతికే పెవిలియన్ బాట పట్టిన భారత కెప్టెన్

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా- శ్రీలంక మధ్య గురువారం మ్యాచ్ జరుగుతోంది. టాస్‌ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు రోహిత్‌ సేన తొలుత బ్యాటింగ్‌కు దిగింది భారత ఇన్నింగ్స్‌ రెండో బంతికే లంక శ్రీలంక పేసర్‌ దిల్షాన్‌ మధుషాంక ఊహించని షాకిచ్చాడు.

ODI World Cup 2023: టీమిండియాతో శ్రీలంక పోరు, బద్దలు అయ్యేందుకు రెడీగా ఉన్న రికార్డులు ఇవే, ఆసియా కప్‌ ఫైనల్‌ ఫలితం పునరావృతంతో పాటు సెమీస్‌ బెర్త్‌పై కన్నేసిన భారత్

Hazarath Reddy

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (నవంబర్‌ 2) శ్రీలంక.. టీమిండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ శ్రీలంకను ఓడించి, అధికారికంగా సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకోవాలని భావిస్తుంది.ఆసియా కప్‌-2023 ఫైనల్లో ఫలితాన్నే (సిరాజ్‌ (7-1-21-6) చెలరేగడంతో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది) ఈ మ్యాచ్‌లోనూ పునరావృతం చేయాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు.

Sachin Tendulkar Statue: స్ట్రెయిట్ డ్రైవ్‌ షాట్ రూపంలో సచిన్ టెండూల్కర్ విగ్రహం ఇదిగో, ఇది నా జీవితంలో ప్రత్యేకమైన రోజని తెలిపిన లిటిల్ మాస్టర్

Hazarath Reddy

దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహాన్ని వాంఖడే స్టేడియంలో మహారాష్ట్ర ముఖ్యమంతి ఏక్‌నాథ్‌ షిండే బుధవారం ఆవిష్కరించారు. కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమానికి సచిన్‌, అతడి భార్య అంజలి, కూతురు సారాతో హాజరయ్యాడు.

Advertisement

IND Vs SL: వరల్డ్ కప్ లో ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లంకతో భారత్ ఢీ, వాంఖడే స్టేడియంలో ధోనీ సాధించిన ఘనతను రోహిత్ సాధిస్తాడా? ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫాన్స్

VNS

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో (CWC 23) టీమిండియా హవా కొనసాగుతోంది. ఓటమి లేకుండా విజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడిన టీమిండియా (Team India) అన్నింటిలో విజయం సాధించింది. వరుస విజయాలతో భారత జట్టు దాదాపు సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టడం ఖాయమైంది.

SA vs NZ, World Cup 2023: దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘోర పరాజయం.. కివీస్‌పై 190 పరుగుల తేడాతో సౌతాఫ్రికా భారీ విజయం

ahana

దక్షిణాఫ్రికా 190 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. న్యూజిలాండ్‌కు 358 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించగా, కివీస్ జట్టు కేవలం 167 పరుగులకే ఆలౌటైంది.

World Cup 2023: దక్షిణాఫ్రికా చేతిలో 190 పరుగుల తేడాతో చిత్తయిన న్యూజీలాండ్, పాకిస్తాన్ సెమీస్ అవకాశాలను సజీవం చేసిన కివీస్

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా పుణే MCA Stadiumలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఓటమి పాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. ప్రోటీస్‌ బౌలర్ల ధాటికి 167 పరుగులకే కుప్పకూలింది.

World Cup 2023: అఫ్ఘానిస్థాన్‌ సెమీస్ చేరాలంటే దారులు ఇవే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలకు షాకిస్తే సంచలనమే మరి

Hazarath Reddy

పాకిస్థాన్‌లకు షాకిచ్చిన పసికూన అఫ్ఘానిస్థాన్‌...మాజీ చాంపియన్‌ శ్రీలంకను కూడా 7 వికెట్లతో చిత్తు చేసింది. తాజాగా ప్రపంచకప్ సెమీస్ రేసులో పోటీలోకి వచ్చేసింది.

Advertisement

Afg vs SL, World Cup 2023: పఠాన్ల సంచలనం, శ్రీలంకను ఓడించి ప్రపంచకప్‌లో దుమారం సృష్టించిన ఆఫ్ఘనిస్థాన్

ahana

అఫ్గానిస్థాన్ జట్టు మరోసారి తన భీకర ఫామ్‌ను కనబరిచింది. ఇప్పటికే ఇంగ్లండ్‌ను ఓడించి పెద్ద దుమారాన్ని సృష్టించిన పఠాన్లు. ఆ తర్వాత పాకిస్థాన్ ను సైతం చితక్కొట్టారు. ఇప్పుడు శ్రీలంకను కూడా ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది. ఈ జట్టు శ్రీలంకపై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. లంకను ఓడించి ఆఫ్ఘనిస్థాన్ ప్రపంచకప్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది.

Rohit Sharma in Elite List: రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డ్, ఎలైట్ లిస్ట్‌లో చోటు హిట్ మ్యాన్, భారత్ నుంచి లిస్ట్ లో చుతూ దక్కించుకున్న వాళ్ళు వీళ్ళే

VNS

భార‌త కెప్టెన్‌, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) ఎలైట్ లిస్ట్‌లో (Elite List) చోటు సంపాదించాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ల‌క్నో వేదిక‌గా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ (Rohit Sharma) ఈ ఘ‌న‌త సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 18 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. త‌ద్వారా ఈ ఘ‌న‌త సాధించిన ఐదో భార‌త క్రికెట‌ర్‌గా నిలిచాడు.

India Vs England: వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా విజ‌య యాత్ర‌, ఇంగ్లాండ్ పై 100 తేడాతో ఘనవిజయం, భారత్ సెమీస్ బెర్త్ ఖాయం

VNS

లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కాస్త తడబడ్డా మన బౌలర్ల సమిష్టి కృషితో భారత్‌.. ప్రపంచకప్‌లో (World Cup) సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. రోహిత్‌ సేన నిర్దేశించిన 230 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్‌.. 34.5 ఓవర్లలో 129 కే ఆలౌట్‌ అయింది. ఫలితంగా భారత్‌.. వంద పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

India vs England, World Cup 2023, Viral Video: 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, షమీ వికెట్లు ఎలా తీశాడో ఈ వీడియోల్లో చూడండి..

ahana

2023 ప్రపంచకప్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య లక్నోలో జరుగుతున్న వన్డే మ్యాచులో భారత్ బౌలింగ్ విభాగం పట్టు బిగించింది. ఇంగ్లాండ్ 10 ఓవర్లకే 40 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు బుమ్రా, షమి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Advertisement
Advertisement