Cricket

Virat Kohli Emotional: కన్నీరు పెట్టుకున్న విరాట్ కోహ్లీ, పాక్‌పై గెలుపు తర్వాత భావోద్వేగానికి గురైన విరాట్, టీమ్‌మేట్స్‌ను చూసి మోకాళ్లపై కూర్చొని ఎమోషనల్ అయిన కింగ్ కోహ్లీ.. వీడియో ఇదుగోండి!

Naresh. VNS

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat kohli) వీరోచిత ఇన్నింగ్స్‌ కారణంగా భారత్ ఈ విజయం దక్కించుకుంది. దీంతో భారత క్రీడాభిమానులంతా విరాట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మ్యాచ్ చివరి వరకు క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ.. గెలుపు అనంతరం తీవ్ర భావోద్వేగానికి (emotional ) గురయ్యాడు.

India Vs Pakistan: ఉత్కంఠభరితమైన భారత్ పాక్ వరల్డ్ కప్ తొలి మ్యాచులో, పాకిస్థాన్ ను చిత్తు చేసిన భారత్, విరాట్ విశ్వరూపం...

kanha

T20 ప్రపంచ కప్ 2022 తొలి మ్యాచ్‌లో, పాకిస్తాన్ పై భారత్‌ గెలిచింది. పాక్ గెలవడానికి 160 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వగా, రోహిత్ సేన ఛేదించింది.

T20 World Cup 2022: వైరల్ వీడియో, దాయాదులతో పోరుకు ముందు చిందేసిన భారత్- పాకిస్తాన్ అభిమానులు, మ్యాచ్ తరువాత వేడెక్కనున్న వాతావరణం

Hazarath Reddy

T20 ప్రపంచ కప్ 2022లో ఇరు జట్ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వెలుపల కొంత మంది భారతదేశం మరియు పాకిస్తాన్ అభిమానులు ఆనందిస్తూ మరియు నృత్యం చేస్తూ కనిపించారు

T20 World Cup: హై వోల్టేజ్ మ్యాచ్ నేడే.. పోరుకు సిద్ధమైన భారత్-పాకిస్థాన్.. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్.. రికార్డులు తిరగరాయాలని చూస్తున్న పాక్.. ఫలితం కంటే మజా కోసమే చూసే అభిమానులు.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమానంగా ఇరు జట్లు..

Jai K

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. మరికొన్ని గంటల్లో దాయాదుల మధ్య పోరు జరగనుంది. ఆసియాకప్ తర్వాత ఈ రెండు జట్లు తొలిసారి పోటీపడుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులందరూ అటెన్షన్‌లోకి వెళ్లిపోతారు.

Advertisement

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ శుభారంభం.. పెర్త్ లో ఇంగ్లండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. 5 వికెట్లు తీసిన ఇంగ్లండ్ పేసర్ శామ్ కరన్.. 112 పరుగులకు ఆఫ్ఘన్ ఆలౌట్.. 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్

Jai K

పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత బలమైన జట్టుగా ముద్రపడిన ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ లో శుభారంభం చేసింది. సూపర్-12 దశలో భాగంగా... పెర్త్ లో ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది.

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి సూపర్-12కు జింబాబ్వే.. ఆరేళ్లుగా ఒక్క ప్రధాన టోర్నీలోనూ ఆడని జింబాబ్వే.. స్కాంట్లాడ్‌పై అద్భుత విజయం సాధించి రెండో దశలోకి.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన క్రెయిగ్ ఇర్విన్

Jai K

ఐసీసీ టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచుల్లో పలు సంచలనాలు నమోదయ్యాయి. ఆరంభ మ్యాచ్‌లో ఆసియా కప్ విజేత శ్రీలంకకు నమీబియా షాక్ ఇవ్వగా, నిన్న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన విండీస్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. కాగా, నిన్న స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన జింబాబ్వే తొలిసారి టీ20 ప్రపంచకప్ సూపర్-12 రౌండ్‌లోకి ప్రవేశించింది.

T20 World Cup 2022: ఐసీసీ వరల్డ్‌కప్‌ టోర్నీల్లో యూఏఈ తొలి విజయం, నమీబియాపై ఏడు పరుగుల తేడాతో విక్టరీ, సూపర్‌ 12 రౌండ్‌లోకి నెదర్లాండ్స్‌

Hazarath Reddy

నేడు జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ గ్రూప్‌ ఏలో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై యూఏఈ ఏడు పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. నమీబియా ఓడిపోవడంతో.. గ్రూప్‌ ఏ నుంచి శ్రీలంకతో పాటు నెదర్లాండ్స్‌ సూపర్‌ 12 రౌండ్‌లోకి ప్రవేశించింది.

T20 World Cup 2022: సెమీస్‌కు వెళ్లే నాలుగు జట్లు ఇవే, భారత్ ప్రపంచకప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన సచిన్‌ టెండూల్కర్‌, జస్ప్రీత్‌ బుమ్రా లేకపోవడం పెద్ద లోటేనని వెల్లడి

Hazarath Reddy

ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ సమరం ఆరంభమైంది. గ్రూప్‌స్టేజ్‌ మ్యాచ్‌లు నేటి తో పూర్తికానుండగా.. ఈ నెల 22 నుంచి సూపర్‌-12 మ్యాచ్‌లు (T20 World Cup 2022)మొదలునున్నాయి.ఇందులో గెలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్‌కు వెళ్లనున్నాయి

Advertisement

T20 World Cup 2022: ఘోర పరాభవంతో ప్రపంచకప్ నుండి వైదొలిగిన వెస్టిండీస్‌, పసికూన ఐర్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన పూరన్‌ బృందం, సూపర్‌-12కు అర్హత సాధించిన ఐర్లాండ్

Hazarath Reddy

రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌కు టీ20 వరల్డ్‌కప్‌-2022లో ఘోర పరాభవం ఎదురైంది.గ్రూప్‌-బి క్వాలిఫైయర్స్‌లో భాగంగా ఐర్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన పూరన్‌ బృందం చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఐర్లాండ్‌ సూపర్‌-12కు అర్హత సాధించింది.

T20 World Cup: క్రికెట్ అభిమానులకు పిడుగులాంటి వార్త.. ఎల్లుండి మెల్బోర్న్ వేదికగా జరుగనున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు వాన గండం.. వర్షసూచన వెలువరించిన ఆస్ట్రేలియా వాతావరణ శాఖ

Jai K

భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులకు పండగే. వరల్డ్ కప్ సూపర్-12 దశలో భారత్, పాకిస్థాన్ జట్లు ఈ నెల 23న ఆడనున్నాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కు మెల్బోర్న్ ఆతిథ్యమిస్తోంది. అయితే అభిమానులకు నిరాశ కలిగించేలా ఆస్ట్రేలియా వాతావరణ శాఖ వర్షసూచన చేసింది.

Asia Cup 2023: భారత జట్టు పాకిస్తాన్ కు వెళ్లే ప్రసక్తే లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ కార్యదర్శి జై షా

Hazarath Reddy

పాకిస్తాన్‌ వేదికగా వచ్చే ఏడాది (2023) సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్‌ వన్డే టోర్నీలో (2023 Asia Cup) భారత్‌ పాల్గొనేది లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా 2023 ఆసియా కప్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం ఉన్న పాకిస్థాన్‌కు భారత్ వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి.

Asia Cup 2023: భారత జట్టు పాకిస్తాన్ వెళ్లేది లేనిది నిర్ణయించేది బీసీసీఐ కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపిన కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ

Hazarath Reddy

జై షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బిన్నీ ఓ ప్రకటన విడుదల చేశాడు.2023 ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లాలా వద్దా అనే దానిపై బీసీసీఐ తనంతట తానుగా కాల్ తీసుకోలేదని, అలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వంపై ఆధారపడుతుందని బోర్డు కొత్త అధ్యక్షుడు రోజరీ బిన్నీ గురువారం చెప్పారు.

Advertisement

T20 World Cup 2022: పొట్టలు వేలాడేసుకుని గ్రౌండ్‌లో ఎలా పరిగెడతారు, పాకిస్తాన్ ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ కోచ్‌ మిస్బా ఉ​ల్‌ హక్

Hazarath Reddy

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, మాజీ కోచ్‌ మిస్బా ఉ​ల్‌ హక్‌ (Misbah-Ul-Haq) తమ జట్టును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మా ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌పై పట్టింపు లేదని.. గ్రౌండ్‌లో పొట్టలు వేలాడటం అందరికీ కనిపిస్తోందంటూ దారుణంగా విమర్శలు గుప్పించాడు.

New BCCI President: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు 36వ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న మాజీ క్రికెటర్

Hazarath Reddy

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ నియమితులయ్యారు. సౌరవ్ గంగూలీ తర్వాత బిన్నీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు 36వ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి 67 ఏళ్ల ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.

T20 World Cup: పాకిస్థాన్ ను ఓడిస్తే టీ20 ప్రపంచ కప్ మనదే.. సురేశ్ రైనా వెల్లడి.. టీమిండియా అద్భుతమైన ఫామ్ లో ఉందన్న మాజీ బ్యాట్స్ మెన్.. ఈ నెల 23న భారత్, పాక్ ల మధ్య హై ఓల్డేజ్ మ్యాచ్

Jai K

ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఈ నెల 23వ తేదీపైనే ఉంది. ఆరోజు హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఇండియా-పాక్ లు తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ICC T20 World cup 2022: పాకిస్తాన్ బౌలర్‌కి సలహాలిచ్చిన భారత్ బౌలర్ షమీ, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Hazarath Reddy

నెట్స్ లో బౌలింగ్ సాధన చేస్తున్న టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ వద్దకు పాకిస్థాన్ ప్రధాన పేసర్ షహీన్ అఫ్రిదీ వచ్చాడు. దాయాది బౌలర్ ను షమీ ఉత్సాహంగా పలకరించాడు.

Advertisement

T20 World Cup: వైరల్ వీడియోలు, కోహ్లీ ఫీల్డింగ్ చూస్తే ఫిదా కావాల్సిందే, మెరుపువేగంతో త్రో వేసి రనౌట్, బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్

Hazarath Reddy

ఆస్ట్రేలియాతో వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లి స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో హర్షల్‌ పటేల్‌ వేసిన రెండో బంతిని జోష్‌ ఇంగ్లిస్‌ ఆన్‌సైడ్‌ దిశగా ఆడాడు. అయితే క్విక్‌ సింగిల్‌ కోసం ఇంగ్లిస్‌ ప్రయత్నించడంతో టిమ్‌ డేవిడ్‌ స్పందించాడు.

ICC T20 World Cup 2022: రెండుసార్లు ప్రపంచ కప్ విజేతకు షాకిచ్చిన పసికూన, 42 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించిన స్కాట్లాండ్

Hazarath Reddy

టీ20 ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదైంది. నిన్న మాజీ చాంపియన్ శ్రీలంకకు నమీబియా షాకిస్తే.. తాజాగా రెండుసార్లు ప్రపంచ కప్ విజేత వెస్టిండీస్ ను ఓడించి మరో పసికూన స్కాట్లాండ్ సంచలనం సృష్టించింది.

T20 World Cup 2022: ఆస్ట్రేలియాపై నిప్పులు చెరిగిన మహమ్మద్ షమీ, తొలి వార్మప్ మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.

T20 World Cup: క్వాలిఫయర్ మ్యాచ్‌లో పసికూన నమీబియా చేతిలో ఓడిన లంక.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన నమీబియా.. తమ పేరు గుర్తుపెట్టుకోమని నమీబియా సందేశమిచ్చిందన్న సచిన్.. ట్వీట్ వైరల్

Jai K

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆసియాకప్ విజేత శ్రీలంకతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో నమీబియా సంచలన విజయం సాధించింది. అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ‘తన పేరును గుర్తు పెట్టుకోమని నమీబియా క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్పింది’ అని సచిన్ ట్వీట్ చేశాడు.

Advertisement
Advertisement