Cricket
Mitchell Marsh Dismissal Video: కొత్త బంతితో నిప్పులు చెరిగిన మహమ్మద్ షమీ, తొలి ఓవర్లోనే ఓపెనర్ మిచెల్ మార్ష్‌ను సాగనంపిన వీడియో ఇదిగో...
Hazarath Reddyటీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. నేడు మొహాలీలో ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ జట్టు తొలి ఓవర్లోనే ఓపెనర్ మిచెల్ మార్ష్ (4) వికెట్ కోల్పోయింది. షమీ బంతిని ఆడబోయిన మార్ష్.. గిల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..
David Warner Completes 100 Sixes in ODI: డేవిడ్ వార్నర్ మరో రికార్డు, వన్డే క్రికెట్‌లో వంద సిక్సర్లు పూర్తి చేసిన 43వ ఆటగాడిగా రికార్డు
Hazarath Reddyఆస్ట్రేలియా వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వన్డే క్రికెట్‌లో వంద సిక్సర్లు పూర్తి చేశాడు. మొహాలీ వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్‌ 22) జరుగుతున్న తొలి వన్డేలో వార్నర్‌ ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదిన వార్నర్‌.. అంతర్జాతీయ వన్డేల్లో 100 సిక్సర్లు బాదిన 43వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
Pakistan Squad For World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు పాకిస్తాన్ జట్టు ఇదిగో, స్టార్‌ పేసర్‌ నసీం షా గాయం కారణంగా దూరం, ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ రీ ఎంట్రీ
Hazarath Reddyభారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.బాబర్‌ ఆజం సారథ్యంలో ప్రపంచ కప్ ఆడనుంది. వన్డేప్రపంచకప్‌కు ఆ జట్టు స్టార్‌ పేసర్‌ నసీం షా గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే ఆసియాకప్‌ మధ్యలో వైదొలిగిన స్టార్‌ పేసర్‌ హ్యారీస్‌ రవూఫ్‌ మాత్రం పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు.
Asian Games 2023: టీ20ల్లో అత్యంత చెత్త రికార్డు, మొన్న 15 పరుగులకే ఆలౌట్, నేడు 22 పరుగులకే కుప్పకూలింది, ఏషియన్‌ గేమ్స్‌-2023 నుంచి ఇంటిదారి పట్టిన మంగోలియా
Hazarath Reddyచైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్‌ గేమ్స్‌-2023లో మంగోలియా మహిళల క్రికెట్‌ జట్టు మరోసారి అత్యంత చెత్త ప్రదర్శన నమోదు చేసింది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన మంగోలియా.. టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది
MS Dhoni Celebrates Ganesh Chaturthi: వినాయక చవితి వేడుకల్లో మిస్టర్ కూల్ ధోనీ, గణేశుడికి పూలు సమర్పిస్తున్న వీడియో ఇదిగో..
Hazarath Reddyఎంఎస్ ధోని క్రికెట్‌కు సంబంధించినది అయినా కాకపోయినా సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్. ఇటీవల, CSK కెప్టెన్ ముంబైలో గణేష్ చతుర్థి 2023ని జరుపుకుంటున్నట్లు గుర్తించబడింది, అక్కడ అతను గణేశుడికి పూలు సమర్పించిన దానిని మనం చూడవచ్చు.
Asian Games 2023: ఏషియన్‌ గేమ్స్‌-2023లో సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా, సెప్టెంబర్‌ 24న పాకిస్తాన్‌తో తలపడే అవకాశం
Hazarath Reddyచైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్‌ గేమ్స్‌-2023 సెమీఫైనల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు అడుగుపెట్టింది. గురువారం భారత్‌-మలేషియా మధ్య జరగాల్సిన క్వార్టర్‌ ఫైనల్‌-1 వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరోపాయింట్‌ లభించింది.
India Team New Jersey: టిమిండియా కొత్త జెర్సీలో మార్పులు ఇవిగో, మూడు నక్షత్రాలను రెండు కుదించిన అడిడాస్, ఎందుకంటే..
Hazarath Reddyభారత క్రికెట్‌ జట్టు ఇటీవల అన్ని ఫార్మాట్లలో జెర్సీలను మార్చిన విషయం విదితమే. కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అడిడాస్‌ వచ్చాక భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టుకు కూడా మూడు ఫార్మాట్లలో వేర్వేరు జెర్సీలను రూపొందించింది. టీ20ల్లో కాలర్‌ లేకుండా డార్క్‌ బ్లూ కలర్‌ జెర్సీ, వన్డేల్లో కాలర్‌తో లైట్‌ బ్లూ కలర్‌ జెర్సీ, టెస్ట్‌ల్లో వైట్‌ కలర్‌ జెర్సీలను అడిడాస్‌ ప్రవేశపెట్టింది.
ICC ODI Bowlers Rankings: మళ్లీ నంబర్ వన్ స్థానానికి వచ్చేసిన సిరాజ్, ఏకంగా 8 స్థానాలు ఎగబాకి ఫస్ట్ ప్లేస్, ఐసీసీ తాజా వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌ ఇవిగో..
Hazarath Reddyటీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో మరోసారి ప్రపంచ నెంబర్‌ 1 బౌలర్‌గా అవతరించాడు. ఆసియా కప్‌-2023 ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో సంచలన రికార్డులు నమోదు చేయడంతో పాటు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకాడు.
ICC Men's T20 World Cup 2024: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌‌కి వేదికలు ఖరారు చేసిన ఐసీసీ, అమెరికాలోని మూడు మైదానాలు ఇవే..
Hazarath Reddyవచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) యూఎస్ఏ వేదికలను ఐసీసీ ఖరారు చేసింది. అమెరికాలోని మూడు మైదానాల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.డల్లాస్‌లోని గ్రాండ్‌ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ, న్యూయార్క్‌లోని నసౌ కౌంటీ స్టేడియాలను ఐసీసీ ఖరారు చేసింది
ODI World Cup 2023: ప్రపంచ కప్ 2023 అధికారిక థీమ్‌ సాంగ్ వచ్చేసింది, దిల్ జష్న్ బోలే అంటూ సాగే పాట వీడియో ఇదిగో..
Hazarath Reddyఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2023 ప్రపంచ కప్ అధికారిక థీమ్‌ను ప్రారంభించింది, ఎందుకంటే బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్, ప్రఖ్యాత సంగీత స్వరకర్త ప్రీతమ్ కూడా ఈ సాంగ్ కంపోజ్ చేశారు.
Yuvraj Singh Six Sixes Video: యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్ల వీడియో మళ్లీ మీకోసం, నేటితో ఈ విధ్వంసానికి 16 ఏళ్లు పూర్తి, ఆరు సిక్స‌ర్లు బాద‌డాన్ని ఇసుక‌తో బొమ్మ‌గా వేసిన అభిమాని
Hazarath Reddyద‌క్షిణాఫ్రికా వేదిక‌గా 2007లో జ‌రిగిన పొట్టి ప్ర‌పంచ క‌ప్‌(T20 World Cup 2007)లో భార‌త మాజీ క్రికెట‌ర్‌ యువ‌రాజ్ సింగ్(Yuvraj Singh) ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు బాది విధ్వంసం రేపిన సంగతి విదితమే. ఇంగ్లండ్ బౌల‌ర్ స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) బౌలింగ్‌లో ఆరు బంతుల‌కు ఆరు సిక్స్‌లు కొట్టాడు.
India vs Australia ODI Series: ఆస్ట్రేలియాతో పోరుకు భారత జట్టు ఇదిగో, తొలి రెండు వన్డేలకు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌, వైస్‌ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా
Hazarath Reddyవన్డే ప్రపంచకప్‌-2023కు ముందు మరో కీలకపోరుకు టీమిండియా రెడీ అయింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది.ఇందుకోసం ఇరు దేశాల క్రికెట్‌ బోర్డు ఇప్పటికే తమ జట్లను కూడా ప్రకటించాయి.
ICC ODI Rankings: ఆసియా కప్‌లో ఓడినా మళ్లీ పాకిస్తానే నంబర్ వన్, భారత్ రికార్డు స‌‌‌ృష్టించాలంటే అక్కడ కచ్చితంగా గెలవాల్సిందే, తాజా ICC పురుషుల ODI టీమ్ ర్యాంకింగ్‌లు ఇవిగో..
Hazarath Reddyఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం మూడు జట్ల మధ్య దోబూచులాడుతుంది. ఆసియా కప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైనప్పటికీ, పాకిస్తాన్ వన్డే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది.
Ishan Kishan Mimics Video: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీ వాకింగ్ స్టయిల్‌ను అనుకరించి అందరినీ నవ్వించిన ఇషాన్ కిషన్, కోహ్లీ రియాక్షన్ ఏంటంటే..
Hazarath Reddyఇషాన్ కిషన్ మొన్న వైరల్ అయిన కోహ్లీ బాడీ లాంగ్వేజీని ఫాలో అవుతూ మిమిక్స్ చేశాడు. అది చూసిన ఇతర క్రికెటర్లు పడీ పడీ నవ్వారు. అయితే కోహ్లీ మాత్రం "నా నడక అలా ఉండదు" అంటూ ఇషాన్ కిషన్ కు చెప్పగా, ఆ కుర్ర క్రికెటర్ మరోసారి కోహ్లీలా నడిచి వినోదం పంచాడు
Siraj Donates Prize Money: ఆసియాకప్‌ ఫైనల్ హీరో సిరాజ్‌ గొప్పమనసు, అతను చేసిన పనికి స్టేడియమంతా చప్పట్లు, ప్రైజ్‌మనీని వాళ్లకు ఇచ్చేశాడు
VNS. భార‌తీయ క‌రెన్సీలో రూ. 4 లక్ష‌లు అందుకున్నాడు. అనంతరం త‌న బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న గురించి మాట్లాడిన సిరాజ్ సంచ‌ల‌న నిర్ణ‌యంతో అంద‌ర్నీ షాక్‌కు గురి చేశాడు. ప్రైజ్‌మ‌నీగా అందుకున్న‌ రూ. 4 లక్ష‌లు మొత్తాన్ని ప్రేమ‌దాస స్టేడియం(Premadasa Stadium) సిబ్బందికి ఇస్తున్న‌ట్టు చెప్పాడు.
Asia cup 2023 Viral Video: ఆసియా కప్ ట్రోఫీ అందుకున్న తర్వాత రోహిత్ శర్మ చేసిన పనిని ఈ వీడియోలో చూస్తే..షాకవడం ఖాయం..
ahanaఎనిమిదోసారి ఆసియాకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత్‌ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డులను కూడా సృష్టించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆసియా కప్పును కెప్టెన్ రోహిత్ శర్మ ఒడిసిపట్టుకున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంది.
Virat Kohli Turns Water Boy: వీడియో ఇదిగో, వాటర్ బాయ్‌గా మారి డ్రింక్స్ మోసుకెళ్లిన విరాట్ కోహ్లీ, మైదానంలో ఫ‌న్నీగా ర‌న్ చేస్తూ ప్లేయర్స్‌కు డ్రింక్స్
Hazarath Reddyఆసియా కప్‌ 2023 సూప‌ర్ ఫోర్ స్టేజ్‌లో భాగంగా జ‌రుగుతున్న బంగ్లాదేశ్‌, ఇండియా మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వాటర్ బాయ్‌గా మారాడు.బంగ్లాదేశ్ ఇండియా మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.
Asia Cup Final 2023 Viral Video: ఆసియాకప్ ఫైనల్ మ్యాచులో గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ తో కలిసి ఏం చేశాడో చూడండి..
ahanaఎనిమిదోసారి ఆసియాకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత్‌ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డులను కూడా సృష్టించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ చాలా రిలాక్స్ మూడ్ లో కనిపించాడు. అంతేకాదు విరాట్, రాహుల్ ద్రావిడ్ కలిసి సంబరాలు చేసుకున్నారు.
Asia Cup Final 2023 Mohammed Siraj Video: మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసిన వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..
ahanaMohammed Siraj : ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో విధ్వంసం సృష్టించాడు. సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను భారత్ 15.2 ఓవర్లలో 50 పరుగులకు ఆలౌట్ చేసింది.
Asia Cup Final 2023 India vs Sri Lanka: ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన, ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న టీమిండియా
ahana2023 ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా శ్రీలంకను సులువుగా ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. భారత్‌ ఎనిమిదోసారి ఆసియా కప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు కేవలం 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది.