IND vs PAK: లక్‌తోనే భారత్ గెలిచిందంటూ పాక్ జర్నలిస్ట్ ట్వీట్, కొంచెం మూసుకోమంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు, స్వదేశం నుంచే జర్నలిస్ట్‌పై తీవ్ర విమర్శల దాడి

పాకిస్తాన్‌ జర్నలిస్టు భారత జట్టు విజయాన్ని అపహాస్యం చేసేలా ట్వీట్‌ చేసి ట్రోలింగ్‌ (Fans slam Pakistan journalist) బారిన పడ్డాడు.అర్ఫా ఫిరోజ్‌ జేక్‌ అనే జర్నలిస్టు.. ‘‘ఈరోజు ఇండియా కంటే లక్ గొప్పగా క్రికెట్‌ ఆడింది.

IND vs PAK: లక్‌తోనే భారత్ గెలిచిందంటూ పాక్ జర్నలిస్ట్ ట్వీట్, కొంచెం మూసుకోమంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు, స్వదేశం నుంచే జర్నలిస్ట్‌పై తీవ్ర విమర్శల దాడి
Team India (Image Credits: Twitter)

పాకిస్తాన్‌ జర్నలిస్టు భారత జట్టు విజయాన్ని అపహాస్యం చేసేలా ట్వీట్‌ చేసి ట్రోలింగ్‌ (Fans slam Pakistan journalist) బారిన పడ్డాడు.అర్ఫా ఫిరోజ్‌ జేక్‌ అనే జర్నలిస్టు.. ‘‘ఈరోజు ఇండియా కంటే లక్ గొప్పగా క్రికెట్‌ ఆడింది. ఒకవేళ లక్‌ ఫేవర్‌ చేసి ఉండకపోతే ఇండియా.. పాకిస్తాన్‌ మీద గెలిచేదే కాదు. ఈరోజు ఇండియా కంటే పాకిస్తాన్‌ గొప్ప ప్రదర్శన కనబరిచింది’’ అని ట్వీట్‌ (distasteful tweet after India’s win) చేశాడు. ఈ నేపథ్యంలో సొంత దేశ అభిమానుల నుంచి కూడా అతడు విమర్శలు ఎదుర్కొంటున్నాడు.  వైరల్ వీడియో.. దేశభక్తి అంటే ఇదేనా.. జాతీయ జెండా ఇస్తుంటే వద్దంటూ పక్కకు నెట్టేసిన అమిత్ షా కొడుకు, బీసీసీఐ సెక్రటరీ జై షాపై మండిపడుతున్న నెటిజన్లు

ముల్తాన్‌కు చెందిన వ్యక్తిగా పేర్కొన్న సోహైబ్‌ అనే ఓ ట్విటర్‌ యూజర్‌.. ‘‘ఈరోజు నుంచి బ్లాక్‌ చేస్తున్నా. నువ్వు స్పోర్ట్‌ జర్నలిజం వదిలేయడం బెటర్‌. ఏదో పిచ్చి స్ప్రిప్టులు రాసుకో’’ అంటూ ‍కౌంటర్‌ ఇచ్చాడు.జమీల్‌ ఖాన్‌ అనే మరో నెటిజన్‌.. ‘‘నువ్వు మాట్లాడేది పూర్తిగా తప్పు. ఈరోజు ఇండియా అద్భుతంగా ఆడింది’’ అని పేర్కొన్నాడు. టీ20లలో టీమిండియా పాకిస్తాన్‌ మీద సుమారుగా 8 మ్యాచ్‌లు గెలిచింది.

Here's Tweet

అయినా నువ్వు లక్‌ గురించి మాట్లాడుతున్నావా అంటూ మరో ట్విటర్‌ యూజర్‌ సదరు జర్నలిస్టుకు చురకలు అంటించారు. ఇక మరికొంత మంది.. ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని చాటుతుంటే నువ్వు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలతో ఏం సాధిద్దామని అనుకుంటున్నావు. అసలేం మాట్లాడుతున్నావో అర్థం అవుతోందా అని ఏకిపారేస్తున్నారు

(The above story first appeared on LatestLY on Aug 29, 2022 06:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).