Newdelhi, Dec 12: టీమిండియా (Team India), బంగ్లాదేశ్ (Bangladesh) మధ్య ఈ నెల 14 నుంచి రెండు టెస్టుల సిరీస్ (Two Test Series) జరగనుంది. అయితే, టీమిండియాలో పలువురు ఆటగాళ్లు గాయపడిన నేపథ్యంలో, బీసీసీఐ (BCCI) జట్టులో మార్పులు చేసింది. మహ్మద్ షమీ (Shami) , రవీంద్ర జడేజా గాయాలతో టెస్టు సిరీస్ కు ఇప్పటికే దూరం కాగా, బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో గాయపడిన రోహిత్ శర్మ కూడా తొలి టెస్టులో ఆడడంలేదు.
గాయపడిన ఆటగాళ్ల స్థానంలో అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, నవదీప్ సైనీలను బీసీసీఐ ఎంపిక చేసింది. అదనంగా లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ ను కూడా టెస్టు జట్టుకు ఎంపిక చేసింది.
Indian captain Rohit Sharma will not be available for the first Test against Bangladesh due to left thumb injury. The All-India Senior Selection Committee has named Abhimanyu Easwaran as his replacement for the first Test: BCCI pic.twitter.com/ojUbnVDsEX
— ANI (@ANI) December 11, 2022