ఐపీఎల్ 2023లో భాగంగా ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది.వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్‌లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఈ దూకుడుకు మహేంద్ర సింగ్ ధోనీ తన వ్యూహంతో కట్టడి చేశాడు. శుభమాన్ గిల్ ని అద్భుతమైన టైమింగ్ తో పెవిలియన్ కి పంపాడు. తన కీపింగ్ టైమింగ్ ఎంత ఫాస్ట్‌గా ఉంటుందో మరోసారి రుచి చూపించాడు. గిల్‌ను ధోని స్టంపౌట్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ జడేజా వేశాడు. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలో గిల్ మూడు పరుగుల వద్ద ఉన్నప్పుడు దీపక్ చహర్ క్యాచ్ వదిలేశాడు. దీంతో ఒక లైఫ్ లభించడంతో 39 పరుగులతో గిల్ ధాటిగా ఆడుతున్నాడు. జడ్డూ వేసిన ఆఖరి బంతిని షాట్ ఆడేందుకు ముందుకు వచ్చాడు.
మాములుగానే అలర్ట్‌గా ఉండే ధోని ఈసారి మరింత వేగంగాగా స్పందించాడు. అలా గిల్ క్రీజు దాటాడో లేదో.. ఇలా ధోని బంతిని అందుకొని టక్కున స్టంప్స్ ఎగురగొట్టాడు. అలా చహర్ క్యాచ్ వదిలేసి గిల్‌కు లైఫ్ ఇచ్చినా ధోని తన స్మార్ట్ స్టంపింగ్‌తో పెవిలియన్ పంపించాడు.
Video
Lightning fast MSD! ⚡️ ⚡️
How about that for a glovework 👌 👌
Big breakthrough for @ChennaiIPL as @imjadeja strikes! 👍 👍#GT lose Shubman Gill.
Follow the match ▶️ https://t.co/WsYLvLrRhp #TATAIPL | #Final | #CSKvGT | @msdhoni pic.twitter.com/iaaPHQFNsy
— IndianPremierLeague (@IPL) May 29, 2023
అయితే ధోని స్టంపౌట్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పటికి.. గిల్ మాత్రం డీఆర్‌ఎస్ కోరాడు. అయితే రివ్యూలో గిల్‌కు నిరాశే మిగిలింది. జడ్డూ బంతి వేయడమే ఆలస్యం.. గిల్ మిస్ చేసి ఫ్రంట్‌ఫుట్ దాటడం.. బంతి అందుకున్న ధోని గిల్ వెనక్కి వచ్చే లోపే సూపర్‌ఫాస్ట్‌గా బెయిల్స్ ఎగురగొట్టడం కనిపించింది. అంతే గిల్ ఔట్ అని బిగ్‌స్క్రీన్‌పై కనిపించింది.