Newdelhi, Nov 4: ప్రపంచకప్ 2023 (World Cup 2023) వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ (India) పై దాయాది దేశం పాకిస్థాన్ (Pakisthan) మాజీ క్రికెటర్ తన అక్కసును వెళ్లగక్కారు. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ 2023లో టీమిండియా బౌలర్లు ఉపయోగిస్తున్న బంతులపై దర్యాప్తు చేయాలని పాకిస్థాన్ మాజీ బ్యాట్స్ మెన్ హసన్ రజా డిమాండ్ చేశాడు. ఈ మేరకు పరిశీలన చేపట్టాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ని (ICC) కోరాడు. భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వారి బ్యాట్స్ మెన్ బాగా ఆడుతున్నారని, కానీ టీమిండియా బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇతర జట్లు ఇబ్బంది పడుతున్నాయని అనుమానం వ్యక్తం చేశాడు. ఇలా ఎలా జరుగుతుందో అర్థంకావడంలేదని ఆరోపించాడు. శ్రీలంకపై టీమిండియా పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేసి చిరస్మరణీయ విజయాన్ని అందించిన నేపథ్యంలో హసన్ రజా ఈ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చాడు. భారత బౌలర్ల నుంచి భిన్నమైన దూకుడుని చూశామని రజా అన్నాడు. పాకిస్థాన్‌లోని ఓ ఛానల్ చర్చలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో బంతి మారినట్లు కనిపిస్తోందని రజా అనుమానం వ్యక్తం చేశాడు.
Is it a serious cricket show? If not, please mention ‘satire’ ‘comedy’ in English somewhere. I mean…it might be written in Urdu already but unfortunately, I can’t read/understand it. 🙏🏽 https://t.co/BXnmCpgbXy
— Aakash Chopra (@cricketaakash) November 3, 2023
Ex-Pakistan star calls for probe on balls used by Team India. Aakash Chopra gives perfect response#ICCWorldCup2023 #CWC23 https://t.co/qeZf5crCCr
— CricketNDTV (@CricketNDTV) November 3, 2023
ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సౌదీ అరేబియా, 5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లుగా వార్తలు
వేరే బంతులత..
ఐసీసీ, అంపైర్ లేదా బీసీసీఐ భారత బౌలర్లకు వేరే బంతిని అందిస్తున్నాయని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. అందుకే బంతులను తనిఖీ చేయాలని తాను భావిస్తున్నట్టు సూచించాడు. వన్డే మ్యాచ్‌లో మూడు స్లిప్ లు పెట్టడం, కీపర్ కేఎల్ రాహుల్ కూడా బంతులను అందుకోవడానికి ఇబ్బంది పడుతున్న తీరు చూస్తే బంతుల్లో అదనపు ‘లక్క పూత’ ఉందనిపిస్తోందని సందేహం వ్యక్తం చేశాడు. రజాపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కౌంటర్ ఇచ్చాడు. అతని చేష్టలను ‘కామెడీ’గా అభివర్ణించాడు.