New Delhi, JAN 13: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ (Australia Test Series) కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. గాయం కారణంగా చాలాకాలంగా ఆటకు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు ఈ మధ్య చెలరేగి ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కూడా తొలి రెండు టెస్టుల్లో ఆడే టీమ్ లో చోటు సంపాదించాడు. ఇక రిషబ్ పంత్ యాక్సిడెంట్ కారణంగా దూరం అవ్వడంతో ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ లకు స్థానం దక్కింది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాకు ఈ జట్టులో ప్లేస్ దక్కలేదు. జయ్‌దేవ్ ఉన్కదత్ తన స్థానాన్ని కాపాడుకున్నాడు. తొలి రెండు టెస్టుల కోసం ప్రకటించిన జట్టుకు రోహిత్ శర్మ (Rohit sharma) కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, వికెట్ కీపర్ కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ఉన్కదత్, సూర్యకుమార్ యాదవ్ ల పేర్లను బీసీసీఐ ప్రకటించింది.
????: KL Rahul & Axar Patel were unavailable for the New Zealand Home series due to family commitments.#TeamIndia | #INDvNZ
— BCCI (@BCCI) January 13, 2023
అటు భారత్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్ కోసం కమిన్స్ సారథ్యంలోని 18 మంది సభ్యుల జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా (Australia) ప్రకటించింది. వచ్చే నెల 9 నుంచి మార్చి 13 వరకు భారత్‌తో ఆస్ట్రేలియా జట్టు పర్యటించనుంది. ఉపఖండ పిచ్‌లను దృష్టిలో ఉంచుకొని నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయగా.. ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీకి తొలిసారి జట్టులో చోటు దక్కింది. దాదాపు మూడేళ్ల తర్వాత పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌కు సెలెక్టర్ల నుంచి పిలుపు అందింది. గాయపడిన స్టార్క్, గ్రీన్‌కు కూడా జట్టులో చోటుదక్కింది.
ఆస్ట్రేలియా జట్టు: కమిన్స్ (కెప్టెన్), అగర్, బోలాండ్, క్యారీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్, ట్రావిస్ హెడ్, ఖవాజా, లబుషేన్, లియాన్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్‌షా, స్మిత్, స్టార్క్, మిచెల్ స్వెప్సన్, వార్నర్.