ISPL 2024 Opening Ceremony: Akshay Kumar, Suriya, Ram Charan, Sachin Tendulkar, and Boman Irani Set the Stage on Fire With Energetic Dance to ‘Naatu Naatu’ (Watch Viral Video Here)

లోకల్‌ టాలెంట్‌ను వెలికి తీయడమే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ టీ10 లీగ్‌ (ISPL) నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ లీగ్‌లో (Indian Street Premier League) మొత్తం ఆరు జట్లు పోటీపడనుండగా.. ఈ జట్లను టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు కొనుగోలు చేశారు. రామ్‌చరణ్‌ ఫాల్కన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టును కొనుగోలు చేశారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ మఝీ ముంబైను కొనుగోలు చేశారు.  నాటు నాటు పాటకు చిందేసిన సచిన్ టెండూల్కర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

అక్షయ్‌ కుమార్‌ శ్రీనగర్‌ వీర్‌ను కొనుగోలు చేయగా.. హృతిక్‌ రోషన్‌ బెంగళూరు స్ట్రయికర్స్‌ను.. సైఫ్‌ అలీ ఖాన్‌-కరీనా కపూర్‌ టైగర్స్‌ ఆఫ్‌ కోల్‌కతాను చేశారు. ఇక తమిళ సూపర్‌ స్టార్‌ సూర్య చెన్నై సింగమ్స్‌ జట్టును కొనుగోలు చేశారు. ఐఎస్‌పీఎల్‌ ప్రారంభానికి ముందు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌, సూర్య, అక్షయ్‌ కుమార్‌లతో కలిసి హైదరాబాద్‌ జట్టు ఓనర్‌ రామ్‌చరణ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ట్రిపుల్‌ ఆర్‌ ఫేమ్‌ నాటు నాటు పాటకు వీరంతా కలిసి డ్యాన్స్ వేశారు.

Here's Videos and Pics

సచిన్‌ సారథ్యంలోని టీమ్‌ మాస్టర్స్‌ ఎలెవెన్‌ జట్టు..  అక్షయ్‌ కుమార్‌ నేతృత్వంలోని టీమ్‌ ఖిలాడీతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో సచిన్‌.. అమిర్‌ హుసేన్‌ అనే  దివ్యాంగ క్రికెటర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. అక్షయ్‌ కుమార్‌ వేసిన తొలి ఓవర్‌లోనే సచిన్‌ భారీ సిక్సర్‌ బాదాడు.