New Delhi, AUG 13: క్రికెట్‌లో ఫుట్‌బాల్ తరహాలో రెడ్ కార్డ్ (Red card )నిబంధనను తీసుకువస్తున్నారు. ఒక జట్టు నిర్ణీత సమయంలోగా 20వ ఓవర్‌ను వేయకపోతే 11 మంది ఆటగాళ్లలోంచి ఒక ప్లేయర్ మైదానం వీడి వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు.. స్లో ఓవర్ రేటు(slow over rate)ను 18 ఓవర్‌ను నుంచి కౌంట్ చేస్తూ ఆ ఓవర్ నుంచే శిక్షలు విధించేలా కొత్త రూల్స్‌ను తెస్తున్నారు. అయితే.. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తీసుకురాలేదు. కరీబియన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) నిర్వాహకులు తీసుకువచ్చారు. ఆగస్టు 17 నుంచి కరీబియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ నుంచి స్లో ఓవర్‌పై నూతన రూల్స్ తీసుకువస్తున్నట్లు CPL యొక్క టోర్నమెంట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైఖేల్ హాల్ తెలిపారు. ప్రతీ సీజన్‌లో మ్యాచ్‌లు ముగిసేందుకు చాలా ఎక్కువ సమయం పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. స్లో ఓవర్ రేటును నివారించేందుకు కొత్త నిబంధనలు తీసుకువచ్చాము. ఈ సీజన్ నుంచే ఈ రూల్స్ అమలు అవుతాయని చెప్పారు.
CPL introduces a new rule to penalize slow over rates: A red card will send a player off the field if the 20th over is delayed
📷: CPL#Cricket #CPL #T20Cricket #RedCard #SportsTiger pic.twitter.com/rrQPdmzJML
— SportsTiger (@The_SportsTiger) August 13, 2023
సాధారణంగా టీ20ల్లో ఇన్నింగ్స్ మొదలైన 72 నిమిషాల 15 సెకన్లలోపు 17వ ఓవర్, 76 నిమిషాల 30 సెకన్లలోపు 18వ ఓవర్, 80 నిమిషాల 45 సెకన్లలోపు 19వ ఓవర్ వేయాలి. ఆఖరి ఓవర్‌ను 85 నిమిషాల్లోపే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. CPL తీసుకువచ్చిన రూల్స్ ప్రకారం ఫీల్డింగ్ టీమ్ కనుక 18వ ఓవర్‌ను సమయానికి మొదలు పెట్టలేదంటే.. థర్టీ యార్డ్ సర్కిల్ అవతల ఒక ఫీల్డర్‌ను తగ్గిస్తారు. సదరు ఫీల్డర్ థర్ యార్డ్ సర్కిల్‌లోకి రావాల్సి ఉంటుంది(అప్పుడు సర్కిల్‌లో ఐదుగురు ఫీల్లర్డు అవుతారు)
* 19 ఓవర్‌ను కూడా సమయానికి ప్రారంభం కాకపోతే.. ఇద్దరు ఫీల్డర్లు సర్కిల్ లోపలకు వచ్చేయాల్సి ఉంటుంది. అంటే ఆరుగురు ఫీల్డర్లు సర్కిల్ లోపల ఉంటారు.
* 20 ఓవర్‌ను సమయానికి ప్రారంభించకుంటే అప్పుడు జట్టుకు పెద్ద నష్టం జరుగుతుంది. ఓ ఆటగాడిని మైదానం నుంచి బయటకు పంపించి వేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా సర్కిల్‌లో ఆరుగురు ఫీల్డర్లు ఉండాలి. బయటకు పంపాల్సిన ఆటగాడిని కెప్టెన్ ఎంపిక చేయొచ్చు.
దీని వల్ల ఫీల్డింగ్ జట్టుకు నష్టమే జరుగుతుంది. కాబట్టి ఈ భయంతోనైనా మ్యాచ్‌ను సమయానికి ముగిస్తారని ఆశిస్తున్నట్లు మైఖేల్ హాల్ తెలిపారు. బౌలింగ్ టీమ్‌కే కాదు బ్యాటింగ్ చేసే టీమ్ కూడా పెనాల్టీలు ఉంటాయని చెప్పారు. కావాలని బ్యాటర్లు టైం వేస్ట్ చేస్తున్నట్లు అంపైర్లు బావిస్తే మొదట వారికి వార్నింగ్ ఇస్తారు. అయినా సరే బ్యాటింగ్ టీమ్ అలాగే చేస్తే.. మొత్తం స్కోరులో ఐదు పరుగులు పెనాల్టీ కింద తగ్గిస్తారు. ఇలా బ్యాటింగ్ టీమ్ ఎన్నిసార్లు సమయం వృథా చేస్తే అన్ని సార్లు ఐదు పరుగులు చొప్పున కోత పడుతుంది.