Cricket Stadium | Representational Image (Photo Credits: Pixabay)

Newdelhi, Aug 10: అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు క్రికెట్ వరల్డ్ కప్ (Cricket World Cup) జరగనుంది. భారత్ (India) వేదికగా ఈ మ్యాచ్ లు (Matches) జరుగనున్నాయి. అయితే, ఈ మెగా టోర్నీ షెడ్యూల్ లో (Schedule) ఐసీసీ మార్పులు చేసింది. 9 మ్యాచ్ ల తేదీలు, ప్రారంభ సమయాలను సవరించింది. ఈ మ్యాచ్ ల్లో అత్యంత ముఖ్యమైన భారత్-పాకిస్థాన్ సమరం కూడా ఉంది. దాయాదుల పోటీని అక్టోబరు 15 నుంచి 14వ తేదీకి మార్చింది. పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్ తేదీని అక్టోబరు 12 నుంచి 10వ తేదీకి మార్చింది.

Fernando Villavicencio: ఈక్వెడార్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఫెర్నడో విల్లావిసెన్సీయోను కాల్చిచంపిన గుర్తుతెలియని దుండగులు.. వీడియోతో

Shivling Order: అంతా ఆ శివయ్యే చేశాడా? భూవివాదం కేసులో అనూహ్య మలుపు.. శివలింగం తొలగించాలని న్యాయమూర్తి తీర్పు.. తీర్పు నమోదు చేసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు అకస్మాత్తుగా మూర్ఛ.. వెంటనే జడ్జి షాక్.. తీర్పు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటన

మిగతా మ్యాచ్ లలో మార్పులు ఇలా..

  • భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్ నవంబరు 12
  • ఇంగ్లండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ అక్టోబరు 10
  • ఆసీస్-శ్రీలంక మ్యాచ్ అక్టోబరు 12
  • న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ అక్టోబరు 13
  • ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ అక్టోబరు 15
  • ఆసీస్-బంగ్లాదేశ్ మ్యాచ్ నవంబరు 11
  • ఇంగ్లండ్-పాకిస్థాన్ మ్యాచ్ నవంబరు 11