Shardul-Mittali Marriage Date Out: ఫిబ్రవరిలో 27న పెళ్లి పీటలు ఎక్కబోతున్న టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్-మిథాలీ పారుల్కర్‌
Credits: Twitter

Newdelhi, Dec 18: టీమిండియా (Team India) ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఫిబ్రవరి 27న తన చిన్ననాటి స్నేహితురాలైన మిథాలీ పారుల్కర్‌ (Mittali Parulkar) మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరికీ గతేడాది నవంబరులో (November) నిశ్చితార్థం జరిగింది. తాజాగా పెళ్లి డేట్‌ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 24 వరకు షెడ్యూళ్లతో శార్దూల్ బిజీగా ఉండడంతో 27న ముహూర్తం నిర్ణయించారు.

అశ్విన్, కుంబ్లే రికార్డులను బద్దలుగొట్టి.. అతిపెద్ద రికార్డు సాధించిన కుల్దీప్ యాదవ్.. బంగ్లాదేశ్‌పై అత్యుత్తమ గణాంకాలు

25 నుంచే వివాహ వేడుకలు ప్రారంభమవుతాయని మిథాలీ తెలిపారు. ముంబై శివారులోని కర్జత్‌లో మహారాష్ట్ర సంప్రదాయంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరగనుంది. ఎంటర్‌ప్రెన్యూర్, మోడల్ అయిన మిథాలీ ప్రస్తుతం బేకింగ్ స్టార్టప్ నిర్వహిస్తున్నారు.