రాష్ట్రీయం

Hydra To Extend Districts: ఇకపై జిల్లాలకు హైడ్రా, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన..కాంగ్రెస్ నేతలు కబ్జా చేసిన వదలమని హెచ్చరిక

Arun Charagonda

హైడ్రా ఈ పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా హైడ్రా విస్తరణపై కీలక కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తాం అని...హైడ్రా ఆపితే హైదారాబాద్ మరో వయనాడ్ అవుతుందన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం.. మా కుటుంబసభ్యులు కబ్జా చేసినా కూల్చేయండన్నారు. కాంగ్రెస్ నేతలు ఆక్రమించిన వదిలిపెట్టమని తేల్చిచెప్పారు.

Youtuber Harshasai Case: యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు

Rudra

ముంబై కి చెందిన ఓ నటిపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్ తగిలింది. ఆయనపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

TTD Clarification On Centipede Row: శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రి వార్తలపై టీటీడీ స్పందన.. అవాస్తవమని స్పష్టీకరణ

Rudra

తిరుమల శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రి పడిందన్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది. ఓ భక్తుడు చేసిన ఈ ఆరోపణలు వాస్తవదూరం అని స్పష్టం చేసింది.

Big Blow to Jani Master: జానీ మాస్టర్‌ జాతీయ పురస్కారం రద్దు.. లైంగిక దాడి కేసు విచారణ నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేత.. సంచలన నిర్ణయం తీసుకున్న నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు సెల్‌.. అవార్డు కోసం ఢిల్లీ వెళ్ళాల్సిఉన్నదని ఇటీవలే కోర్టు నుంచి బెయిల్ తీసుకున్న జానీ

Rudra

లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ కు బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 8న ఆయన స్వీకరించాల్సి ఉన్న జాతీయ అవార్డును రద్దు చేశారు.

Advertisement

Lookout Notice Against Harsha Sai: హ‌ర్ష‌సాయి కేసులో బిగ్ ట్విస్ట్, లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సైబ‌రాబాద్ పోలీసులు, గాలింపు వేగ‌వంతం

VNS

యూ ట్యూబర్‌ హర్షసాయిపై (Harsha Sai) సైబరాబాద్‌ పోలీసులు శనివారం లుకౌట్‌ నోటీసు (Lookout Notice)లు జారీ చేశారు. ఓ నటిపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. హర్ష సాయి తనపై లైంగిక దాడికి చేయడంతో పాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని ముంబయికి చెందిన పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Telangana Governor Approves Hydraa Ordinance: హైడ్రాకు ఫుల్ ప‌వ‌ర్స్, ఆమోదం తెలిపిన గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌, ఇక దూకుడు పెంచ‌నున్న హైడ్రా

VNS

హైద‌రాబాద్ విపత్తు స్పంద‌న‌, ఆస్తుల ప‌ర్య‌వేక్ష‌ణ‌, ప‌రిర‌క్ష‌ణ ఏజెన్సీ(Hydraa)కు విస్తృత అధికారాలు క‌ల్పిస్తూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు (Hydraa Ordinance) రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదం తెలిపారు. ఈ మేర‌కు శ‌నివారం రాజ్‌భ‌వ‌న్ గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీంతో ఇక‌పై హైడ్రా చేప‌ట్ట‌బోయే అన్ని కార్య‌క‌లాపాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ల‌భించింది.

KTR On Konda Surekha Comments: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా, తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడమన్న కేటీఆర్

Arun Charagonda

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ స్పందించారు. నాపై ఇష్టం వచ్చినట్లు గబ్బు మాటలు ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్నారు...మంత్రిపై పరువు నష్టం దావా వేశాను, రేపోమాపో ముఖ్యమంత్రిపై కూడా వేస్తాను అని తెలిపారు కేటీఆర్. తప్పు చేయనప్పుడు మేమెందుకు భ‌య‌ప‌డుతాం?,మోదీ లాంటి వాడికే భయపడలేదు రేవంత్‌రెడ్డి ఎంత? అని ఎద్దేవా చేశారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మల్ గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్, స్వదేశానికి చేరుకునేలా చొరవ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పిన కుటుంబ సభ్యులు

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు నిర్మల్ జిల్లాకు చెందిన గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్. కువైట్ - సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా చిత్రహింసలకు గురి కాగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో స్వదేశానికి చేరుకున్నారు రాథోడ్ నాందేవ్.

Advertisement

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు, ఓయూ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడిన సీతక్క

Arun Charagonda

ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, యూనివర్సిటీ విద్యార్ధినులతో కలిసి బతుకమ్మ ఆడారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా సీతక్కను సన్మానించింది ఓయూ సిబ్బంది.

TTD On Reverse Tendering: టీటీడీ కీలక నిర్ణయం, రివర్స్ టెండరింగ్ విధానానికి పుల్ స్టాప్ పెట్టిన టీటీడీ

Arun Charagonda

ఇంజనీరింగ్ పనులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది టీటీడీ. రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రస్తుతం వివిధ ద‌శ‌ల్లో రూ.1750 కోట్ల ప‌నులు జరుగుతుండగా దీనికి స్వస్తి పలికింది టీటీడీ. గతంలో నెయ్యి కొనుగోలులోనూ రివర్స్ టెండరింగ్ విధానం అమల్లో ఉండగా ఈ విధానానికి స్వ‌స్తి ప‌లికింది టీటీడీ.

Heavy Rain Alert To Telugu States: రెయిన్ అలర్ట్..నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు బారీ వర్ష సూచన, ఐఎండీ హెచ్చరిక

Arun Charagonda

ఏపీ, తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం లో మరో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని వెల్లడించింది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.అల్పపీడనం ప్రభావం పశ్చిమ బెంగాల్‌ పై కూడా ఉంటుందని తెలిపింది.

Charminar: చార్మినార్‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హ‌ల్‌చ‌ల్‌, అత్యంత ప్రమాదకరంగా పైఅంతస్తులో సర్కస్ ఫీట్లు...వీడియో వైరల్

Arun Charagonda

చార్మినార్‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హ‌ల్‌చ‌ల్‌ చేశాడు. అత్యంత ప్రమాదకరంగా పైఅంతస్తులో సర్కస్ ఫీట్లు వేయగా సోష‌ల్‌మీడియాలో వీడియో వైరల్‌గా మారగా నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

Advertisement

Chandrababu On Tirumala: తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు..వకుళామాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించిన సీఎం

Arun Charagonda

తిరుమల లో వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తో కలిసి శ్రీవారి చిత్రపటానికి పూజలు చేసి..వంటశాల ప్రారంభించారు సీఎం. ఆధునిక పరిజ్ఞానంతో అన్న ప్రసాదాల తయారీ విధానాన్ని సీఎంకు వివరించారు టీటీడీ అదనపు ఈవో.

Telangana Shocker: ఆన్‌లైన్ బెట్టింగ్..రైతు కుటుంబం ఆత్మహత్య, కొడుకు రూ.20 లక్షలు పొగొట్టుకోవడంతో అప్పుల బాధ తాళలేక ముగ్గురు ఆత్మహత్య

Arun Charagonda

నిజామాబాద్ - బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ ఆడి దాదాపు రూ.20 లక్షలు పోగొట్టుకున్నాడు కొడుకు హరీష్. అప్పుల పాలు కావడంతో పొలాన్ని అమ్మేసిన కుటుంబం. దీంతో ఆర్ధిక ఇబ్బందులు రావడంతో తండ్రి సురేష్, తల్లి హేమలతతో పాటు.. కొడుకు హరీష్ కూడా ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

Dussehra Rush: జనంతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ, మహాత్మాగాంధీ బస్ స్టేషన్లు (వీడియో)

Rudra

దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుండి ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.

Rain in Hyderabad: హైదరాబాద్‌ ను ముంచెత్తిన భారీ వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజులూ వానలే

Rudra

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది.

Advertisement

Police Case on Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పై మధురైలో కేసు నమోదు.. ఎందుకంటే?

Rudra

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై తమిళనాడులోని మధురైలో ఓ కేసు నమోదైంది. వంజినాథన్ అనే న్యాయవాది ఈ మేరకు మధురై కమిషనర్‌ కు ఫిర్యాదు చేశారు.

Mallareddy Mass Dance: మాస్ స్టెప్పులతో హుషారెత్తించిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. బతుకమ్మ పాటకు విద్యార్థినులతో నృత్యం (వీడియో)

Rudra

‘పాలమ్మిన, పూలమ్మిన..’ అనే డైలాగ్ తో తెలుగురాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏం చేసిన వైరల్ అవ్వాల్సిందే.

Charminar Viral Video: చార్మినార్‌ పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హ‌ల్‌ చ‌ల్‌.. ప్రమాదకరంగా సర్కస్ ఫీట్లు (వీడియో)

Rudra

హైదరాబాద్ కు మణిహారంగా నిలిచిన చారిత్రాత్మక కట్టడం చార్మినార్ పై ఓ వ్యక్తి హల్ చల్ సృష్టించాడు. నిషేధించబడిన పైఅంతస్తులోకి చేరి అత్యంత ప్రమాదకరంగా సర్కస్ ఫీట్లు చేశాడు.

Rajendra Prasad: సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో నటుడి కుమార్తె మృతి

Rudra

విలక్షణమైన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో మృతి చెందారు.

Advertisement
Advertisement