రాష్ట్రీయం

Telangana: వీడియో ఇదిగో, మీ ఇంట్లో ఆడ పిల్లలకు మూసీ అనే పేరు ఎందుకు పెట్టకూడదు, త్వరలో పెట్టుకునేలా సుందరీకరణ చేస్తానని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

మీ ఇంట్లో ఆడ పిల్లలకు మూసీ అనే పేరు ఎందుకు పెట్టకూడదు.. కృష్ణా, గంగా, సరస్వతి, యమున గోదావరి నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టినట్లు మూసీ అనే పేరు కూడా అమ్మాయిలకు పెట్టేలా మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, 5 నెలల చిన్నారిని బస్టాండ్‌లో వదిలి వెళ్లిన మహిళ, బాత్ రూమ్‌కు వెళ్లి వస్తానని అటే..

Hazarath Reddy

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో APSRTC బస్ స్టాండ్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ RTC బస్ స్టాండ్ ప్రాంగణములో ఉన్న మరో మహిళకు తన 05 నెలల చిన్న పాపను ఇచ్చి తాను బాత్ రూమ్ కు వెళ్లి వస్తానని వెళ్లి తిరిగి రాకుండా వెళ్ళిపోయింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, చీరాల బీచ్‌లో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు, రాకాసి అలల తాకిడికి కొట్టుకుపోతోండగా సముద్రంలోకి వెళ్లి సాహసం

Hazarath Reddy

ఒక్కసారిగా వచ్చిన రాకాసి అలల తాకిడికి షేక్ భాషా (44) సముద్రంలోనికి కొట్టుకుపోతుండగా, అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో సముద్రంలోకి వెళ్లి యాత్రికుడు ప్రాణాలను రక్షించి ఒడ్డుకు చేర్చారు.

Driver Dies of Heart Attack: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు, బస్సును రోడ్డు పక్కకు ఆపి కుప్ప కూలిన డ్రైవర్, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి

Hazarath Reddy

గజ్వేల్‌ వద్ద హుజురాబాద్‌ ఆర్టీసీ డిపోకి చెందిన‌ బస్సు హుజురాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా.. ఛాతిలో నొప్పిగా రావడంతో బస్సు పక్కకు ఆపి ప్రయాణికులకు చెప్పిన డ్రైవర్‌ రమేష్‌ సింగ్‌ చెప్పాడు. వెంటనే ప్రయాణికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్‌ రమేష్‌సింగ్‌ మృతి చెందాడు.

Advertisement

Vizag Honey Trap Case: వైజాగ్‌లో హానీ ట్రాప్ కేసు వెలుగులోకి, యువకులని రూంకి పిలిచి న్యూడ్‌లో ఉండగా ముఠా ఎంటర్, ఫోటోలు తీసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్

Hazarath Reddy

రూంకి తీసుకెళ్లి మ‌త్తు ప‌దార్థాలు ఇచ్చి స్పృహ త‌ప్పేలా చేసి.. అనంతరం వారితో న్యూడ్‌గా ఉన్న‌ట్టు వీడియోలు తీసి డ‌బ్బుల కోసం బ్లాక్‌ మెయిలింగ్ చేసేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓ వ్య‌క్తి ఫిర్యాదుతో జాయ్‌ని భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు.

Hyderabad Horror: హైదరాబాద్‌లో దారుణం, యువతి ప్రైవేట్ పార్టుపై దాడి చేస్తూ హత్య, గొంతు కోసి మరీ కిరాతకం

Hazarath Reddy

వెండి ఆభరణాల వివాదంలో మరో మహిళను హత్య చేసిన సెక్స్ వర్కర్‌ను అరెస్టు చేసిన ఘటన కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. నిందితులు బ్లేడ్‌తో బాధితురాలి గొంతు కోసి, ఆమె ప్రైవేట్ భాగాలకు గాయాలు చేశారన్నారు.

Big Blow to Jani Master: జానీ మాస్టర్‌ కు మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేయనున్న పోలీసులు.. జాతీయ పురస్కారం రద్దు నేపథ్యంలోనే నిర్ణయం

Rudra

లైంగిక దాడి కేసులో చిక్కుకున్న జానీ మాస్టర్‌ కు మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలని రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. జానీ మాస్టర్‌ కు జాతీయ అవార్డును నిలిపివేసిన సందర్బంగా బెయిల్ రద్దు చేయాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం.

Bathukamma Festival: మన బతుకమ్మకు అమెరికాలో గౌరవం.. పలు రాష్ట్రాల్లో అధికారిక గుర్తింపు

Rudra

తెలంగాణ సాంసృతిని చాటే బతుకమ్మ పండుగ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. ఇప్పటికే పలు దేశాల్లో తెలంగాణ ఆడపడుచులు అంగరంగ వైభవంగా బతుకమ్మ ఆడుతున్న విషయం విధితమే.

Advertisement

CM Revanth Reddy On Musi: కృష్ణా,గంగ,సరస్వతిలా మూసీ నది..అమ్మాయిలకు మూసీ అనే పేరు పెట్టేలా సుందరీకరణ చేస్తా

Arun Charagonda

మీ ఇంట్లో ఆడ పిల్లలకు మూసీ అనే పేరు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా, గంగా, సరస్వతి, యమున గోదావరి నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టినట్లు మూసీ అనే పేరు కూడా అమ్మాయిలకు పెట్టేలా మూసీ సుందరీకరణ చేస్తానని చెప్పారు రేవంత్.

Telangana Nominated Posts: తెలంగాణలో మరో 13 నామినేటెడ్ పోస్టులను భర్తీ, 13 జిల్లాలకు గ్రంధాలయ ఛైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం

Arun Charagonda

దసరా వేళ తెలంగాణ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. 13 జిల్లాలకు గ్రంధాలయ ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. త్వరలో మిగితా జిల్లాల గ్రంధాలయాలకు ఛైర్మన్లను ప్రకటించనుంది. సామాజికవర్గ సమీకరణల ప్రకారం రెడ్డి సామాజికవర్గం నుంచి ఐదు మందికి, గౌడ్ సామాజికవర్గం నుంచి ఇద్దరు, ఒక ముస్లిం సామాజికవర్గం చెందిన నేతను పదవి వరించింది.

Woman blackmails Men: మగాళ్ల న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్‌మెయిల్, విశాఖట్నంలో ఘటన, అరెస్ట్ చేసిన పోలీసులు

Arun Charagonda

మగాళ్ల న్యూడ్ వీడియోలతో ఓ యువతి చేస్తున్న బ్లాక్‌మెయిల్ దందా వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో జాయ్ అనే యువతి సంపన్నులు, సొసైటిలో పలుకుబడి ఉన్నవారిని సోషల్ మీడియా ద్వారా హనీట్రాప్ చేస్తూ ముగ్గులోకి దింపుతుంది. మత్తు పదార్థులు ఇచ్చి స్పృహ తప్పగానే తన టీంతో వీడియోలు, ఫొటోలు రికార్డు చేసి డబ్బలు ఇవ్వాలని బెదిరింపులకు దిగుతోంది. భీమిలి పోలీసులు జాయ్‌ని అరెస్టు చేశారు.

Jainoor Tribal Woman: ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన జైనూర్ బాధిత మహిళ, బాధితురాలి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించిన మంత్రి సీతక్క

Arun Charagonda

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు జైనూర్ బాధిత మహిళ. గత నెల రోజులుగా గాంధీ ఆసుపత్రిలో వైద్యం అందుతుండగా బాధితురాలికి అందించే వైద్యం, ఇతర సౌకర్యాల పై ప్రత్యేక శ్రద్ధ చూపారు మంత్రి సీతక్క. డిశ్చార్జ్ సందర్భంగా మహిళకు నూతన వస్త్రాలు బహుకరించి కొంత నగదును అందజేశారు సీతక్క. బాధిత కుటుంబ సభ్యులు మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Bathukamma Festival: బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తించిన అమెరికా, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించిన అమెరికాలోని పలు రాష్ట్రాలు

Arun Charagonda

బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తించింది అమెరికా. బతుకమ్మ సంబరాల వారాన్ని అధికారికంగా బతుకమ్మ పండగ వారం, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించాయి అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్టే రాలేహ్, వర్జీనియా రాష్ట్రాలు.

Goddess Kanyaka Parameswari: రూ.6 కోట్లతో అమ్మవారి అలంకరణ, మహబూబ్‌నగర్‌ జిల్లా వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక అలంకరణ..వైరల్ వీడియో

Arun Charagonda

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బ్రాహ్మణవాడలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమివ్వనుండగా ప్రత్యేకంగా రూ.6,66,66,666.66తో అలంకరించారు. రూ. 6 కోట్ల నగదు చూసి భక్తులు ఆశ్యర్యపోయారు.

Minister Komatireddy Dance: డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

డీజే టిల్లు పాటకు స్టెప్పులేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ క్యాన్సర్ రన్-2024ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజే టిల్లు పాటకు ఆయన డాన్స్ వేశారు.

Tirupati Airport: తిరుపతి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు, బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ బాంబు బెదిరింపుతో కలకలం

Arun Charagonda

బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. బాంబు బెదిరింపుతో పోలీసులు అప్రమత్తమై రాత్రికి రాత్రే విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో ఎయిర్​పోర్టు అథారిటీ అధికారులు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.

Advertisement

Criminals Arrest: సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది అరెస్ట్,దేశ వ్యాప్తంగా 435 కేసుల్లో నిందితులుగా ఉన్న సైబర్ నేరగాళ్లు, ముంబై కేంద్రంగా మోసాలు

Arun Charagonda

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది కీలక నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం 435 కేసుల్లో నిందితులుగా ఉన్నారు సైబర్ నేరగాళ్లు. ముంబై కేంద్రంగా ఈ ముఠా సైబర్ నేరాలకు పాల్పడుతుండగా హైదరాబాద్ లో ఏకంగా రూ.7 కోట్లకుపైగానే కాజేశారు కేటుగాళ్లు.

Modi On Rythu Runa Mafi: రుణమాఫీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన కామెంట్, తెలంగాణలో రుణమాఫీ కాలేదు, ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీస్తున్నారన్న మోడీ

Arun Charagonda

తెలంగాణలో రుణమాఫీఐ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన కామెంట్ చేశారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఇప్పటికి మాఫీ కాలేదన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా రుణమాఫీ చేయకపోవడంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అని తెలిపారు మోడీ.

CM Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, వరద సాయం పెంపుతో పాటు కాంగ్రెస్ పెద్దలను కలవనున్న తెలంగాణ సీఎం

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలవనున్నారు సీఎం. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భేటీ కానుండగా ఈ సమావేశానికి హాజరుకానున్నా రేవంత్ రెడ్డి.

Hyderabad: వీపు రుద్దమన్నందుకు భర్త తలపై ఐరన్ రాడ్‌తో దాడి చేసిన భార్య, పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

Arun Charagonda

హైదరాబాద్ కేపీహెచ్‌బీలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. తన వీపు రుద్దాలని గట్టిగా భార్యపై అరిచాడు భర్త శివ. గట్టిగా అరవకండి చుట్టూ ఉన్న వాళ్లు చూస్తే బాగోదు అంటూ భర్తతో చెప్పినా వినలేదు. దీంతో మాట మాట పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి భర్త తలపై ఐరన్ రాడ్‌తో దాడి చేసింది. తలకు తీవ్ర గాయం అవ్వడంతో భర్త శివ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Advertisement
Advertisement