రాష్ట్రీయం
Andhra Pradesh Election Results 2024: పోస్టల్‌ బ్యాలెట్‌లో‌ గెజిటెడ్‌ సంతకం సడలింపుపై హైకోర్టుకు వైసీపీ, ఇప్పటికే సీఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపిన వైవీ సుబ్బారెడ్డి
Hazarath Reddyమే 13న జరిగిన ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌లో‌ గెజిటెడ్‌ సంతకం సడలింపుపై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఈసీ వ్యవహారశైలిని హైకోర్టులో తేల్చుకోనున్నామన్నారు.
Threat Call to BJP MLA Raja Singh: చంపేస్తామంటూ రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌, బెదిరింపు కాల్స్‌ నంబర్లకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే
Hazarath Reddyగోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ఆయన్ను చంపేస్తామంటూ పలు నంబర్ల నుంచి ఫోన్‌ చేసి బెదిరించారు. ఈ విషయాన్ని రాజా సింగ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌ నంబర్లకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన షేర్‌ చేశారు.
Praja Bhavan Bomb Threat Case: పుల్లుగా తాగి ప్రజా భవన్ బాంబులతో పేల్చేస్తానంటూ కాల్, 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు, రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌
Hazarath Reddyప్రజా భవన్ బాంబ్ బెదిరింపు కేసులో 24 గంటలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు పంజాగుట్ట పోలీసులు. నిందితుడిని గుంటూరుకు చెందిన రామకృష్ణగా గుర్తించారు. మంగళవారం ఉదయం ప్రజాభవన్‌లో, నాంపల్లి కోర్టులో బాంబ్‌ పెట్టినట్లు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌చేసిన రామకృష్ణ.. అధికారులను కంగారు పెట్టించాడు.
Video: వీడియో ఇదిగో, ఆర్టీసీ డ్రైవర్‌పై చెప్పుతో దాడి చేసిన యువకుడు, చితకబాది పోలీసులకు అప్పగించిన ప్యాసింజర్లు
Hazarath Reddyకరీంనగర్ - శంకరపట్నం మండలం తాడికల్ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్‌పై గాలిపెల్లి అనిల్ అనే యువకుడు చెప్పుతో దాడి చేశాడు.. దీనితో ఆగ్రహించిన ప్రయాణికులు అతడిని బస్సులోనే బంధించి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
Andhra Pradesh: బాపట్లలో తీవ్ర విషాదం, నల్లమడ వాగులో ఈత కొట్టడానికి వెళ్లి నలుగురు హైదరాబాదీలు గల్లంతు, రెండు మృతదేహాలు లభ్యం, కొనసాగుతున్న గాలింపు చర్యలు
Hazarath Reddyఏపీలో బాపట్ల శివారు నల్లమడ వాగులో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాపట్ల శివారు నల్లమడ వాగులో ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం పర్యటక కేంద్రం సూర్యలంక బీచ్‌కు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో నల్లమడ వాగులో స్నానానికి దిగారు
Liquor Shops Bandh in AP: ఏపీలో జూన్ 3,4,5 తేదీల్లో వైన్ షాపులు బంద్, ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరగకుండా చూడాలని డీజీపీ ఆదేశాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది.
Road Accident Video: కారు ఉంది కదా అని రోడ్డుపైన ఇష్టమొచ్చినట్లుగా డ్రైవింగ్ చేయకండి, అమాయకుల ప్రాణాలు తీయొద్దంటూ వీడియో షేర్ చేసిన సజ్జనార్
Hazarath Reddyకారు ఉంది కదా అని రోడ్డుపైకి వచ్చి ఇష్టారితీన డ్రైవింగ్‌ చేసి అమాయకుల ప్రాణాలు తీయొద్దు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ఏమాత్రం సరికాదు. చిన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కుటుంబాల భవిష్యత్తును రోడ్డు పాలు చేస్తుంది. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించండి. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ డ్రైవింగ్‌ చేయండి
Child Selling Racket Busted in Hyderabad: పిల్లల విక్రయాల ముఠా గుట్టు రట్టు చేసిన రాచకొండ పోలీసులు, 16 మంది చిన్నారులను రక్షించామని తెలిపిన సీపీ తరుణ్‌ జోషి
Hazarath Reddyరాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పిల్లల విక్రయాల ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. పిల్లలను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్టు గుర్తించారు.
Telangana ACB Raids RTA Offices: వీడియో ఇదిగో, తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు, భారీ స్థాయిలో నగదు స్వాధీనం, ఏజెంట్లు అరెస్ట్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఖైరతాబాద్‌, మలక్‌పేట్‌, నాగోల్‌, అత్తాపూర్,మహబూబ్‌నగర్‌, సిద్ధిపేట ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు వాహనదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు
Bomb Threat to Praja Bhavan: ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్, ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నం అయిన పోలీసులు
Hazarath Reddyతెలంగాణ ప్రజా భవన్‌లో బాంబ్ ఉందని ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు, డాగ్ స్వ్కాడ్ సిబ్బంది హుటహుటిన పరుగులు తీశారు. అందులో ఉంటున్న డిప్యూటీ సీఎం దంపతులు, సిబ్బందిని బయటకు పంపించి అణువణువు తనిఖీ చేపట్టారు.
RS 1 Lakh Hospital Bill For Rs 1000 Biryani: వేయి రూపాయల బిర్యానీ తిన్నందుకు రూ. లక్ష రూపాయలు ఆస్పత్రి బిల్లు, రక్తపు వాంతులతో ఆస్పత్రి పాలైన హైదరాబాద్ వాసి, వీడియో ఇదిగో..
Hazarath Reddyషాద్‌నగర్ - అప్పరెడ్డిగూడా గ్రామానికి చెందిన కావాలి నరేందర్ తన పెళ్లి రోజు ఉందని ఈనెల 22న షాద్‌నగర్‌లోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి మండి బిర్యానీ తిన్నారు. ఇంటికి చేరుకున్నాక ఒకరి తర్వాత ఒకరికి వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు..
Cyclone Remal Effect: వీడియోలు ఇవిగో, ఉప్పాడలో ఇంకా అల్లకల్లోలంగానే సముద్రం, ఇళ్లలోకి దూసుకువచ్చిన సముద్రపు నీరు
Hazarath Reddyరెమాల్ తుఫాన్ బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని తాకినప్పటికీ దాని ప్రభావం కొనసాగుతూనే ఉంది. గత మూడు రోజుల నుంచి ఏపీలో కాకినాడ సమీపంలోని ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి
Pinnelli Ramakrishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్, జూన్‌ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టరాదని ఏపీ హైకోర్టు ఆదేశాలు
Hazarath Reddyమాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్‌ షరతులే వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది. జూన్‌ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది
Theft Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలే అమ్మవారి గుడిలో హుండీ చోరీ, భక్తుడిలా వచ్చి హుండీని భుజాన వేసుకుని వెళ్లిపోయిన దొంగ
Hazarath Reddyఏపీలోని కాకినాడ సంజయ్ నగర్ లో పట్టపగలు అమ్మవారి గుడిలో చోరీ జరిగింది. దొంగతనం చేస్తున్న దృశ్యాలు అక్కడ ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. ఫుటేజ్ అధారంగా దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగ ఎవరికీ అనుమానం రాకుండా హుండీని సంచిలో పెట్టి భుజాన వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
Dubbaka Ikat Cloth for Ayodhya Lord Ram: అయోధ్య రామయ్య అలంకరణకు దుబ్బాక చేనేత వస్త్రం.. దుబ్బాక చేనేత వస్త్ర ఖ్యాతిలో మరో కలికితురాయి
Rudraసిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్త్ర ఖ్యాతిలో మరో కలికితురాయి వచ్చి చేరింది. సాక్షాత్తు అయోధ్య శ్రీరామచంద్రుడే దుబ్బాక చేనేత వస్ర్తాన్ని ధరించి మరింత ఖ్యాతిని విస్తరింపజేశాడు.
AI Headphone: ఈ హెడ్‌ ఫోన్‌ పెట్టుకున్నారో.. వందల మంది మాట్లాడినా.. మీరు ఏం వినాలనుకొంటున్నారో.. అదే వింటారు.. నిజం!
Rudraరద్దీ ఎక్కువగా ఉన్న చోట ఎవరు ఏం మాట్లాడుతున్నారో స్పష్టంగా వినిపించదు. అయితే, వందల మంది ఒకేసారి మాట్లాడుతున్నప్పటికీ.. మనం ఏం వినాలనుకొంటున్నామో.. అదే వినేలా సాయపడే అధునాతన ఏఐ హెడ్‌ ఫోన్‌ ను యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ పరిశోధకులు తీసుకొచ్చారు.
AP Counting Day Arrangements: కౌంటింగ్‌ కు ఏపీ సన్నద్ధం.. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్.. స్ట్రాంగ్‌ రూమ్‌ ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలు.. కౌంటింగ్ రోజున డ్రై డే
Rudraజూన్ 4న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ కు ఆంధ్రప్రదేశ్ సర్వం సిద్ధం అవుతున్నది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే.
Hyderabad Lift Collapse: హైదరాబాద్ కిన్నెర గ్రాండ్‌ హోటల్‌లో కుప్పకూలిన లిఫ్ట్, 8 మందికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyనాగోల్‌లోని హోటల్ కిన్నెరా గ్రాండ్‌లో నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఎనిమిది మంది వ్యక్తులు హోటల్‌లోని 4వ అంతస్తు నుండి అకస్మాత్తుగా లిఫ్ట్ కుప్పకూలడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఆదివారం, మే 26, హోటల్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ వేడుకలో జరిగింది, ఇక్కడ 4వ అంతస్తు నుండి లిఫ్ట్ పడిపోవడంతో హాజరైన వారు గాయపడ్డారు.
Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సజ్జనార్, అతివేగం.. మృత్యుపాశం అంటూ సూచన
Hazarath Reddyతెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేశారు.ఇందులో అతివేగం.. మృత్యుపాశం అని కాబట్టి నెమ్మదిగా చూసుకుని వెళ్లాలని సూచించారు.
Andhra Pradesh Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలో నలుగురు అక్కడికక్కడే మృతి, అదుపుతప్పి లారీని డీకొట్టిన కారు
Hazarath Reddyకృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోడూరుపాడు వద్డ జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతులను తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది.