రాష్ట్రీయం
Hyderabad: హైదరాబాద్ ప్రముఖ రెస్టారెంట్లలో పాడైపోయిన ఆహార పదార్థాలు, ఫుడ్ సేఫ్టీ రూల్స్ సరిగా పాటించడం లేదని తెలిపిన అధికారులు, లిస్ట్ ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ లక్డీకాపుల్, సోమాజిగూడ పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
EVM Destroy in Andhra Pradesh: ఈవీఎంలో డేటా సేఫ్‌గా ఉంది, అందుకే రీపోలింగ్ నిర్వహించలేదు, మాచర్ల ఈవీఎంల ధ్వంసం ఘటనపై మీడియాతో ముఖేశ్‌ కుమార్‌ మీనా
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ పోలింగ్‌ రోజున మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించాం
Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, డివైడర్‌ను దాటి కంటైనర్ లారీని ఢీకొట్టిన బస్సు, డ్రైవర్ మృతి, పలువురికి తీవ్ర గాయాలు
Hazarath Reddyఏపీలో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సున్నపుబట్టి సమీపంలో NH వద్ద విజయవాడ నుండి చెన్నైకి వెళుతున్న ప్రైవేట్ బస్సు డివైడర్‌ను దాటి కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, కనీసం 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
EVM Destroy in Andhra Pradesh: మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసంపై ఈసీ సీరియస్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు, వైరల్ వీడియోపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
Hazarath Reddyమాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు దెబ్బతిన్నాయని, అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మే 21 (మంగళవారం) ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది.
Telangana: మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్న కొమురవెల్లి ఎస్ఐ, న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగిన మొదటి భార్య
Hazarath Reddyసిద్దిపేట - కొమురవెల్లి పోలీస్టేషన్ ఎదుట ఎస్ఐ నాగ రాజు భార్య మానస పలువురు మహిళలతో కలిసి ఆందోళనకు దిగారు. కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు తనను పెండ్లి చేసుకొని రెండేండ్ల క్రితం తనను కరీంనగర్‌లో నివాసం ఉంచాడని, విడాకులు ఇవ్వాలని రెండు నెలల క్రితం తనను కొట్టి పిల్లలను తీసుకువచ్చినట్టు మానస ఆరోపించారు.
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, బట్టలన్నీ విప్పేసి నగ్నంగా పోలీస్ స్టేషన్ ముందు కత్తితో సైకో వీరంగం, ఆస్పత్రికి తరలించిన అధికారులు
Hazarath Reddyమద్యం మత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా చల్లపల్లి ప్రధాన సెంటర్లలో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు ఓ సైకో. కోమల నగర్ గుడారాల వద్ద జరిగిన ఘర్షణలో శివ అనే వ్యక్తి గాయపడ్గారు .
ACB Raids: సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ చేసిన ఏసీబీ
sajayaహైదరాబాద్‌: సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ చేసిన ఏసీబీ.. 17 ప్రాపర్టీస్ గుర్తించామన్న ఏసీబీ అధికారులు.. ఘట్‌కేసర్‌లో 5 ప్రాపర్టీల గుర్తింపు.. ఉమామహేశ్వరరావు నివాసంలో రూ.38 లక్షల నగదు సీజ్.. 60 తులాల బంగారం సీజ్.. మార్కెట్‌ విలువ ప్రకారం రూ.3 కోట్ల సొత్తు స్వాధీనం.
Rain Alert: నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. 24 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం.. 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు..
sajayaRain Alert: నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. 24 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం.. 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు..
Andhra Pradesh: పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి, వీడియోను విడుదల చేసిన టీడీపీ
Hazarath Reddyమాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. బూత్ లోకి ప్రవేశించిన పిన్నెల్లి... నేరుగా బ్యాలెట్ చాంబర్ వద్దకు వెళ్లి, ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి
Telugu States Weather: బీ అల‌ర్ట్! తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, మ‌రింత బ‌ల‌ప‌డ‌నున్న అల్ప పీడ‌నం, ఏపీలో ఐదు రోజుల పాటూ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని అంచ‌నా
VNSఅల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉంద‌ని, దీని ప్ర‌భావంతో 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు: విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ సునంద తెలిపారు.
Andhra Pradesh Election Results 2024: గుర్తుపెట్టుకో..జూన్ 9న సీఎం జగన్ ప్రమాణ స్వీకారం, ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన బొత్సా సత్యనారాయణ
Hazarath Reddyప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మనా? ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ. గిమ్మిక్కులు చేస్తారని విమర్శలు గుప్పించారు. ప్రశాంత్‌ కిషోర్‌ కమర్షియల్‌ అని తెలుసుకునేే వద్దనుకున్నట్లు చెప్పారు.
Andhra Pradesh Election Results 2024: జగన్ ఘోరంగా ఓడిపోబోతున్నారు, మరోసారి ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీలో త్వరలో వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పందించారు. జూన్ 4న జగన్ కు దిగ్భ్రాంతి కలిగించే ఫలితాలు వస్తాయని కొన్నిరోజుల కిందట వ్యాఖ్యానించిన ప్రశాంత్ కిశోర్... తాజాగా తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు
U Tax: ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి రూ. 100 కోట్లు పంపారు, రాష్ట్రంలో యూ ట్యాక్స్ వ‌సూలు చేస్తున్నారంటూ బీజేపీ నేత‌ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
VNSఅధిక ధాన్యం జోకడంతో వచ్చిన డబ్బులో నుంచి కేసీ వేణుగోపాల్‌కి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రూ.500 కోట్లు ఇచ్చారని విమర్శించారు. రైస్‌ మిల్లర్లతో మంత్రి కుమ్మక్కై వారికి రూ.450 కోట్లు ఇచ్చారని తెలిపారు. అలా మొత్తం రూ.950 కోట్ల కుంభకోణం జరిగిందని మహేశ్వర్‌ రెడ్డి ఆరోపించారు.
NIA Raids In Anantapur: వామ్మో అనంత‌పురంలో ఉగ్ర లింకులు! రిటైర్ట్ హెడ్ మాస్ట‌ర్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు
VNSఏపీలోని అనంతపురం జిల్లాలో కలకలం రేగింది. ఉగ్రవాదులతో (Terror Links) సంబంధాల కేసులో ఎన్ఐఏ (NIA) అధికారులు సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని బెంగళూరులో నమోదైన కేసులో జాతీయ దర్యాఫ్తు సంస్థ ఎన్ఐఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం ఏకకాలంలో దాడులు నిర్వహించింది.
Jaya Jaya He Telangana: ఒకటిన్నర నిమిషం నిడివిలో జయ జయహే తెలంగాణ, సంగీతం అందించనున్న సంగీత దర్శకుడు కీరవాణి, జూన్2న రాష్ట్ర ప్రజలకు అంకితం
Vikas Mప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది. సినీ సంగీత దర్శకుడు కీరవాణితో ఈ పాటను రేవంత్ ప్రభుత్వం కంపోజింగ్ చేయించింది. కాగా తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందెశ్రీకి కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది.
Hyderabad Road Accident: ఘోర విషాదం, పెళ్లి చూడటానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
Hazarath Reddyపెళ్లి అయిపోయాక ఆదివారం రాత్రి శ్రవణ్, శివ వాళ్ల కజిన్ భానుతో కలిసి బైక్‌పై పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వెళ్తూ, ఓ డివైడర్ వద్ద యూటర్న్ చేస్తుండగా బొలేరో ఢీకొట్టడంతో శివ, శ్రవణ్ అక్కడికక్కడే మృతి చెందగా భాను పరిస్థితి విషమంగా ఉంది.
Andhra Pradesh: మే 24 నుంచి ఏపీలో పదవ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు, పరీక్షల నిర్వహణ తేదీల వివరాలు ఇవిగో..
Hazarath Reddyఏపీలో పదవ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్‌ 6వ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ వెల్లడించారు. ఈ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి­చేసుకోవాలని వర్చువల్‌ మీటింగ్‌లో జిల్లా విద్యాశాఖాధికారులను కమిషనర్ ఆదేశించారు.
Telangana: ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన దంపతులు,హాస్పిటల్ ద్వారం వద్ద ఉన్న ఓ చెట్టు కూలడంతో భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు
Hazarath Reddyఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన దంపతులు..చెట్టు కూలి భర్త మృతి చెందిన విషాదకర ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఇద్దరు దంపతులపై ద్వారం వద్ద ఉన్న ఓ చెట్టు కూలడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
Woman Riding Sports Bike in Saree: చీరకట్టుతో వరంగల్ రోడ్లపై స్పోర్ట్స్ బైక్ నడిపిన యువతి, కుర్ర హృదయాలను కొల్లగొడుతున్న వీడియో ఇదిగో..
Hazarath Reddyవరంగల్ లో ఓ యువతి చీరకట్టుతో స్పోర్స్‌ బైక్‌ను నగరంలో రోడ్ల మీద నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాజూకైన సన్నని నడుముతో రొమాంటిక్ రైడ్ చేస్తూ.. కుర్ర హృదయాలను ఈ యువతి కొల్లగొట్టేస్తోంది. ఆ లేడీ డాన్ చేసిన బైక్ రైడ్‌ను జెట్టి బైకర్‌గర్స్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
Andhra Pradesh: ఆస్పత్రి ఆవరణలో ఉమ్మేయకూడదన్నందుకు ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేసిన మందుబాబులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyశ్రీకాకుళం - రణస్థలం మండల ప్రాథమిక ఆస్పత్రి ఆవరణలో వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు ఉమ్మేయడంతో అలా ఉమ్మకుడదని అన్నందుకు, మద్యం మత్తులో ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తులు.