ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh Shocker: ప్రకాశం జిల్లాలో దారుణం, బాలికల హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో మృతశిశువుకు జన్మనిచ్చిన విద్యార్థిని, చివరిదాకా కనుక్కోలేకపోయిన టీచర్లు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ప్రభుత్వ బాలికల హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో 16 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని మృత శిశువుకు జన్మనిచ్చింది. కాగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గత రెండు నెలలుగా హాస్టల్‌లోనే ఉంటోంది.
YS Jagan Praja Darbar: కార్యకర్తల కోసం తెరుచుకున్న వైఎస్ జగన్ బంగ్లా తలుపులు, ప్రజాదర్బార్ పేరిట ప్రజలతో మమేకమవుతున్న మాజీ ముఖ్యమంత్రి
Hazarath Reddyతాడేపల్లిలోని వైఎస్ జగన్ బంగ్లా తలుపులు బుధవారం పార్టీ కార్యకర్తలు, ప్రజల కోసం తెరుచుకున్నాయి.తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీస్‌లో బుధవారం కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. ఎవరూ అధైర్యపడవద్దు.. అన్ని విషయాల్లో చివరి వరకు అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన చంద్రబాబు, శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత, రిజర్వాయర్‌కు క్రమంగా పెరుగుతున్న వరదప్రవాహం
Hazarath Reddyశ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3,17,940 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి 3,42,026 వరద నీరు వచ్చి చేరుతోంది.
Andhra Pradesh: పెట్రోల్ బంక్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమాని హల్ చల్, ట్యాంకర్‌కి నిప్పు పెడతానని బెదిరింపు, అడ్డుకున్న సిబ్బంది, వీడియో వైరల్
Arun Charagondaఏపీలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమాని హల్‌చల్ చేశాడు. తన సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి చేర్చాలంటూ పెట్రోల్ బంక్ దగ్గర హల్‌చల్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేన కార్యకర్త హంగామా చేశాడు. లేదంటే ట్యాంకర్‌కి నిప్పు పెడుతానంటూ సిలిండర్, లైటర్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడు. బంక్ సిబ్బంది ఎట్టకేలకు యువకుడిని అడ్డుకోగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Pawan Kalyan Meets Chandrababu: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సుధీర్ఘ చర్చ, పంపకాలపై మూడు పార్టీల మధ్య ఒప్పందం
VNSఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో (Chandrababu) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Dy CM Pawan Kalyan) అమరావతిలో సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవులతో పాటు ఇతర కీలక అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.
ADR Report on Lok Sabha Poll: మొన్నటి ఎన్నికల్లో 365 సీట్లలో లక్షల్లో ఓట్ల తేడా, ఏపీలో 85 వేల ఓట్లకు పైగానే, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సంచలన నివేదికను బయటపెట్టిన ఏడీఆర్
Hazarath Reddyసార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మీద ADR సంస్ధ నివేదిక సంచలన విషయాలను బైట పెట్టింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో (Lok Sabha Poll 2024) 538 నియోజకవర్గాల్లో , 365 స్థానాల్లో లక్షల్లో ఓట్ల తేడా ఉనట్టు తెలిపింది
Andhra Pradesh: ఏపీ పొలిటికల్ బ్రదర్స్, పవన్ మాట - లోకేష్ బాట, హాట్ టాపిక్‌గా అన్నాదమ్ముళ్ల వ్యవహారం!
Arun Charagondaతెలుగు రాష్ట్ర రాజకీయాలకు దేశంలో ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. వ్యక్తిగతంగా దూషించుకోవడమైనా, ఆ తర్వాత కలిసి పోవడమమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకే చెల్లుతుంది. అయితే కొంతమంది మాత్రం ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు. వీరిలో ప్రధానంగా వినిపించే పేరు హైదరాబాద్ బ్రదర్స్. దివంగత పి జనార్ధన్ రెడ్డి(పీజేఆర్), మర్రి శశిధర్ రెడ్డి హైదరాబాద్ బ్రదర్స్‌గా నిత్యం సమస్యలపై తమ గళాన్ని వినిపించే వారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో వినిపించిన మరో బ్రదర్స్ పేరు దానం నాగేందర్, దివంగత ముఖేష్ గౌడ్.
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, అత్త, మామలపై కత్తితో దాడి చేసిన అల్లుడు, తీవ్ర గాయాలతో అత్త మృతి, ఆస్పత్రిలో మామ..
Hazarath Reddyదాడిలో అత్త మృతి చెందింది.మావయ్య కు తీవ్ర గాయాలవగా , స్థానికులు చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అందిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh: రూ.1.30 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్, ఆన్‌లైన్‌లో తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్ర మంత్రి మండలి
Hazarath Reddyచంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం (Andhra Pradesh government) రాబోయే నాలుగు నెలలకు రూ.1.30 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్సు జారీ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఆన్‌లైన్‌లో తీర్మానాన్ని ఆమోదించింది
Sugali Preeti Case: ఏపీలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మళ్లీ తెరపైకి, న్యాయం చేయాలంటూ పవన్‌కు సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు, ఈ కేసులో మొదటి నుంచి ఏం జరిగిందంటే..
Hazarath Reddyతమ బిడ్డకు జరిగిన అన్యాయం (Sugali Preeti Rape & Murder Case) మరే ఆడ బిడ్డకు జరగకుండా చూడాలని ఆమె (Sugali Preeti's Mother Parvati ) కోరారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు.
TDP MLA Daggubati On Poker Clubs: త్వరలో ఏపీలో పేకాట క్లబ్బులు,పేకాట ఆడకపోవడం వల్ల తగ్గిన జీవితకాలం, వైరల్‌గా టీడీపీ ఎమ్మెల్యే వీడియో
Arun Charagondaఅనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని షాకింగ్ కామెంట్స్ చేశారు.
Farmer Dies After Tractor Overturns: వెంటాడుతున్న విషాదాలు, 10 రోజుల్లో ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు రైతులు మృతి, తాజాగా పొలం దున్నుతూ ట్రాక్టర్ బోల్తా పడి అన్నదాత మృతి
Hazarath Reddyతెలంగాణలోని నాగరకర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని వంగూరు మండలంలో వంగూరు గ్రామానికి చెందిన రైతు మీసాల లక్ష్మయ్య పొలం దున్నుతూ ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
Andhra Pradesh: మన్యం జిల్లాలో రోడ్ల పరిస్థితికి అద్దం పట్టే వీడియో ఇదిగో, ఆస్పత్రికి వెళ్లడానికి కుండలో కూర్చుని నది ప్రవాహాన్ని దాటిన అనారోగ్యంతో ఉన్న మహిళ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లా నుండి షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని జామిగూడ, పెదబయలు మండలంలో సరైన రోడ్లు లేకపోవడం వల్ల అనారోగ్యంతో ఉన్న గిరిజన వృద్ధ మహిళ వైద్య సంరక్షణ కోసం ప్రవాహాన్ని నావిగేట్ చేస్తూ వంట కుండపై కూర్చోవలసి వచ్చింది. వృద్ధురాలిని ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో కుండలో ఉంచినట్లు ఈ వీడియోలో ఉంది.
Bagless Days: బ్యాగుల మోతకు చెల్లు.. 10 రోజులు బ్యాగ్ లెస్ డేస్.. 6-8 తరగతులకు అమలు.. కేంద్రం మార్గదర్శకాలు
Rudraవిద్యార్థులపై బ్యాగుల మోత తగ్గించడానికి, చదువును ఆహ్లాదకరంగా, ప్రయోగాత్మకంగా మార్చడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించాలని నిర్ణయించింది.
Bull Attack on AP Minister: వీడియో ఇదిగో, పోలేరమ్మ కొలుపుల వేడుకల్లో ఏపీ మంత్రిపై ఎద్దు దాడి, పెను ప్రమాదం నుంచి బయటపడ్డ డోలా బాలవీరాంజనేయస్వామి
Hazarath Reddyప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో నిర్వహిస్తున్న పోలేరమ్మ కొలుపులకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి హాజరయ్యారు. ఎడ్లబండ్ల ముందు మంత్రితో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో డీజే సౌండుకు ఎద్దు బెదిరి మంత్రిని కొమ్ముతో నెట్టింది.
Giant Whale Shark: వీడియో ఇదిగో, మత్స్యకారుల వలలో చిక్కిన 1500 కేజీల భారీ సొరచేప, కొనుగోలు చేసిన చెన్నైకి చెందిన వ్యాపారులు
Hazarath Reddyమచిలీపట్నం వద్ద సముద్రంలో మత్స్యకారుల వలకు 1500 కేజీలు గల భారీ సొర చేప చిక్కింది. దీన్ని మచ్చల సొర అని పిలుస్తారు. గిలకలదిండి వద్ద స్థానిక మత్స్యకారులు దీన్ని ఒడ్డుకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఓ క్రేన్ సాయంతో దీన్ని వెలుపలికి తీసుకువచ్చారు
Andhra Pradesh: వీడియో ఇదిగో, మేం కాపులం, ఎవడ్రా నువ్వు అంటూ మంత్రి కారుముందు రెచ్చిపోయిన యువకులు, కడ్ డ్రాయర్లపై పోలీస్ స్టోషన్లో నిలబెట్టిన పోలీసులు
Hazarath Reddyదివంగత ఎన్జీ రంగా వారసులం, నిజమైన కాపులం అంటూ రచ్చరచ్చే చేశారు. పోలీసులను సైతం పరుష పదజాలంతో దూషిస్తూ వారిపైకి వెళ్లారు. దీనికి కారణం గంజాయి మత్తు. ఆ మత్తు దిగేంత వరకు ఎంతో సహనంతో వ్యవహరించిన పోలీసులు... ఆ తర్వాత ఆ యువకులను పోలీస్ స్టేషన్‍కు తీసుకెళ్లి కడ్ డ్రాయర్లపై (లోదుస్తు) నిలబెట్టారు
JC Prabhakar Reddy Meets YS Vijayamma: వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్‌రెడ్డి భేటీ, పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఏం మాట్లాడారనే చర్చ
Hazarath Reddyటీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను కలిశారు.హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని విజయమ్మ నివాసానికి వెళ్లి భేటీ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
Viral Video: గుర్రపు స్వారీ చేస్తూ కింద పడి వ్యక్తి మృతి.. కర్నూల్ లో ఘటన.. వీడియో వైరల్
Rudraసరదా కోసం చేసే కొన్ని పనులు ప్రాణాలు కూడా తీస్తాయి. ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన తాజా విషాదం ఈ కోవకే వస్తుంది. మద్దికేరకు చెందిన ఓ వ్యక్తి గుర్రపుస్వారీ చేస్తూ పొరపాటున కిందపడి మరణించాడు.
Hyderabad Youth Dies in US: అమెరికాలో ఉన్నత చదువు.. ఆపై మంచి ఉద్యోగం.. ఇంకేంటి.. వచ్చే డిసెంబర్ లో అబ్బాయికి పెండ్లి చేద్దాం అనుకొన్నారు ఆ పేరెంట్స్.. ఇంతలో అంతులేని విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి హైదరాబాదీ యువకుడి మృతి..
Rudraచేతికొచ్చిన చెట్టంత కొడుకు, అదీ ఆణిముత్యంలా అన్నింటా మేటిగా ఉన్న బంగారు పుత్రుడు ఒక్కసారిగా ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిస్తే, ఆ కన్న తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది?