ఆంధ్ర ప్రదేశ్

YS Sharmila on Union Budget: ప్ర‌త్యేక హోదాపై ఒక్క మాట కూడా లేదు, కేంద్ర బ‌డ్జెట్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డ ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌

VNS

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై ఎన్నికల మ్యానిఫెస్టోను తలపించిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై (Union Budget) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. లక్ష కోట్లు అడిగితే 15 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు.

Union Budget 2024: ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చి అమరావతికి రూ.15 వేల కోట్లు ఇస్తాం, అప్పుగా ఇస్తున్నారా, నిధులా అనే అంశంపై స్పష్టత ఇచ్చిన నిర్మలా సీతారామన్

Hazarath Reddy

కేంద్ర బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతికి రూ 15 వేల కోట్లు కేంద్రం కేటాయించడం తెలిసిందే. అయితే, ఈ రూ.15 వేల కోట్లు అప్పు రూపంలో ఇస్తున్నారా, లేక నిధులా? అనే విషయంలో స్పష్టత లేదు. అయితే, ఇవాళ ఢిల్లీలో బడ్జెట్ ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వచ్చారు

Narsapuram MPDO Death Case: ఏలూరు కాల్వలో లభ్యమైన నరసాపురం ఎంపీడీవో మండవ వెంకటరమణ మృతదేహం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వారం రోజుల నుండి కనపడకుండా పోయిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మండవ వెంకటరమణ కథ విషాదంగా ముగిసింది. తాజాగా ఆయన మృతదేహం ఏలూరు కాల్వలో లభ్యమైంది.

Vijayasai Reddy on TDP: రెడ్‌బుక్ పేరుతో ఎంత కాలం ఈ రావణ దహనం? వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపాటు, పోలీస్ యంత్రాంగం కూడా బెంబేలెత్తిపోతోందంటూ..

Hazarath Reddy

ఏపీలో దాడులపై ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘టీడీపీ వాళ్లు నడిరోడ్డు మీద పట్టపగలే వైఎస్సార్‌సీపీ వారిని హతమారుస్తుంటే, వాటిని గురించి మాట్లాడకుండా.. హంతకులు కూడా వైఎస్సార్‌సీపీ వాళ్లే అని అబద్ధాలతో ఎదురు దాడి చేస్తున్నారు.

Advertisement

Andhra Pradesh: వైసీపీ నేతల ముందస్తు బెయిల్‌ పిటిషన్, అప్పటివరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.

Andhra Pradesh Assembly Session: వివేకా హత్య కేసుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, రేపటి నుంచి మరో 3 శ్వేతపత్రాలు అసెంబ్లీలో పెడతామని స్పష్టం

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు శాసనసభలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్‌ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. రెండు నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని తెలిపారు.

CM Chandrababu on Budget: వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ‌కు ఆక్సిజన్ ఈ బడ్జెట్, యూనియన్ బడ్జెట్‌పై చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

కేంద్ర బడ్జెట్‌లో (Budget 2024) ఏపీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (CM Chandrabau Naidu)ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తగిన గుర్తింపు కలిగిందన్నారు. రూ.15 వేల కోట్లు అమరావతికి కోసం బడ్జెట్‌లో పెట్టారన్నారు.

Andhra Pradesh Assembly Session: రెండు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం రెండు కీలక బిల్లులను శాసనసభ ముందుకు తీసుకొచ్చింది. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2022) రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విజయవాడలోని ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరించారు.

Advertisement

Budget 2024: ఏపీ రాజధానిగా అమరావతి ఫిక్స్, రాజధాని అభివృద్ధికి రూ.15వేల కోట్ల ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన కేంద్రం, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి వరాల జల్లు

Hazarath Reddy

ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది. ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు.

Budget 2024: అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం, అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇస్తామని తెలిపిన కేంద్రమంత్రి నిర్మల

Hazarath Reddy

ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు అందజేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, రైతులకు పోలవరం జీవనాడి అని తెలిపారు.

Jagan Slams TDP Alliance Governance: టీడీపీ కూటమి అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వైఎస్ జగన్ విమర్శలు, చంద్రబాబుకు ప్రతి అడుగులోనూ భయం కనపడుతోందని వెల్లడి

Hazarath Reddy

కేవలం 50 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఈ అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోందని (Jagan Slams TDP Alliance Governance) చెప్పారు.

CM Chandrababu Slams YS Jagan: వివేకా హత్య కేసులో నడిపిన నాటకాన్నే జగన్ మళ్లీ మొదలెట్టారు, బీఏసీ సమావేశంలో మండిపడిన చంద్రబాబు, 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. గౌవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేశారు. ఐదు రోజులపాటు సభను నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు

Advertisement

Telugu States Rain Update: మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది, మేడిగడ్డ బ్యారేజ్‌కు పోటెత్తిన వరద

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా రెండు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురిసింది. ఆయా జిల్లాల్లోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలకు భారీగా వరద నీరు చేరింది.

Budget Session 2024: వీడియో ఇదిగో, సైకిల్ మీద పార్లమెంటుకు వచ్చిన టీడీపీ ఎంపీ అప్పల నాయుడు, రైతు అయిన సామాన్యుడు పార్లమెంటులో అడుగుపెట్టడం గర్వంగా ఉందని వెల్లడి

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీ అప్పల నాయుడు కలిశెట్టి ఈరోజు సైకిల్‌పై పార్లమెంటుకు చేరుకున్నారు. నేను నా జీవితంలో తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నానని, ఓ రైతు అయిన సామాన్యుడు పార్లమెంటులో అడుగుపెట్టడం గర్వంగా ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్ మీద వచ్చానని తెలిపారు.

Andhra Pradesh Assembly Session: మధుసూదన్ రావ్ గుర్తు పెట్టుకో, జగన్ మాస్ వార్నింగ్ వీడియో ఇదిగో, అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదంటూ వైసీపీ అధినేత ఉగ్రరూపం

Hazarath Reddy

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో అసెంబ్లీకి చేరుకున్నారు వైఎస్సార్‌సీపీ చట్ట సభ్యులు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ‘‘సేవ్‌ డెమోక్రసీ’’ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.

Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉందని గవర్నర్ ప్రసంగం, వైసీపీ సభ్యులు వాకౌట్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. నేటి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం (Andhra Pradesh Assembly Session) సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ (Governor Speech) ప్రసంగించారు

Advertisement

AP Assembly Session LIVE: ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.. అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత.. నల్ల కండువాలతో హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు.. సేవ్ డెమోక్రసీ అంటూ సభలో నినాదాలు.. వాకౌట్

Rudra

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను అభినందిస్తూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు.

AP Girl Dead in USA: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి విద్యార్థిని మృతి

Rudra

అమెరికాలో మరణిస్తున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గుంటూరు జిల్లా తెనాలి విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

AP Assembly Session: నేటి నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్

Rudra

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నది. ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు షురూ కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Ys Jagan Meets AP Governor: ఏపీ గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్, ఏపీలో జ‌రుగుతున్న దాడుల‌పై ఫిర్యాదు, ఫోటోలు, వీడియోలు అంద‌జేత‌

VNS

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను (Governor Abdul Nazeer) మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, వైసీపీ నేతలపై దాడుల అంశంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు జగన్. రాజ్ భవన్ లో గవర్నర్ ను (YS Jagan Meet Governer) కలిసిన జగన్.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయనకు వివరించారు.

Advertisement
Advertisement