ఆంధ్ర ప్రదేశ్
Magunta Srinivasulu Reddy Resigns YCP: వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు ఎంపీ బరిలో కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి ఉంటారని వెల్లడి
Hazarath Reddyప్రకాశం జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (magunta sreenivasulu reddy) ఆ పార్టీని వీడారు. వైసీపీకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..11 సార్లు చట్టసభలకు పోటీ చేశా. మా కుటుంబానికి అహం లేదు.
Andhra Pradesh Elections 2024: వచ్చే 45 రోజుల్లో ఏపీలో ఎన్నికలు, కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్, 175కి 175 స్థానాలు గెలవాల్సిందేనని వైసీపీ కార్యకర్తలకు సూచన
Hazarath Reddyఏపీలో ఎన్నికల వేడీ మొదలైంది. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో ఈ రోజు సాయంత్రం జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం ‘మేం సిద్ధం- మా బూత్ సిద్ధం’ సమావేశంలో (booth-level worker meets) ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న 45 రోజుల్లో ఎన్నికలు (Andhra Pradesh Elections 2024) జరగబోతున్నాయి
Andhra Cricket Controversy: రాజకీయ రంగు పులుముకున్న హనుమ విహారి-ఆంధ్రా క్రికెట్ వివాదం, అతనికి అండగా ఉంటామని తెలిపిన చంద్రబాబు, వైఎస్ షర్మిల
Hazarath Reddyవైసీపీ రాజకీయ కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు.హనుమ విహారిని వేధించారని అతడికి తాము అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు
Andhra Pradesh Elections 2024: మహాసేన రాజేష్‌కి టికెట్‌ ఇవ్వడంపై మండిపడుతున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు, టీడీపీ నేత హరీష్‌ మాధుర్‌ కారు ధ్వంసం
Hazarath Reddyకోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ-జనసేన సమావేశం రసాభాసగా మారింది. మహాసేన రాజేష్‌కి పి గన్నవరం టికెట్‌ కేటాయింపుపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజేష్‌ గోబ్యాక్‌’ అంటూ జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు.
Fact Check on Floating Bridge Washed Away: విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందనేది అబద్దం, తప్పుడు ప్రచారాన్ని ఖండించిన VMRDA, అలల ఉధృతి అధికంగా ఉంటే జాయింట్ తొలగింపు చేస్తామని క్లారిటీ
Hazarath Reddyబీచ్ లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందంటూ సోషల్ మీడియాలో సృష్టించిన కథనాలన్నీ ఫేక్ అని VMRDA క్లారిటీ ఇచ్చింది . ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్వహణలో భాగంగా జరిగిన మాక్ డ్రిల్ అది అని విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్ మెంట్ (VMRDA) కమిషనర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Andhra Pradesh Elections 2024: ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి నెలకు రూ.5000 ఇస్తాం, సంచలన ప్రకటన చేసిన మల్లిఖార్జున ఖర్గే
Hazarath Reddyఏపీలో కాంగ్రెస్ గెలిస్తే ప్రతి నెలా, ప్రతి కుటుంబానికి రూ.5000 ఇస్తామని పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ యూనివర్స్ బేసిక్ ఇన్కమ్ సపోర్ట్ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెలా రూ.5,000 ఇస్తామని ఆయన అన్నారు.
Gajuwaka Fire Video: విశాఖ గాజువాకలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో కాలిపోయిన మూడు ఫ్లోర్లు, భారీగా ఆస్తి నష్టం, మంటలను అదుపు చేస్తున్న ఫైర్‌ ఇంజిన్లు
Hazarath Reddyవిశాఖలోని గాజువాకలో ఉన్న ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలకు చెందిన భవనంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కమర్షియల్ కాంప్లెక్స్‌లో మూడు ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాద తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నట్లు సమాచారం. బిల్డింగ్ వెనుక భాగానికి మంటలు వ్యాపించాయి.
AP Assembly Speaker: 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వేటు వేసిన ఏపీ అసెంబ్లీ స్పీకర్‌..టీడీపీ నలుగురు..వైఎస్సార్సీపికి చెందిన నలుగురి పై అనర్హత వేటు
sajayaటీడీపీ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పై వేటు వేయగా, అలాగే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలపై అనర్హత వేటు వేశారు.
Floating Bridge Washed Away: ఒక్కరోజుకే తెగిపొయిన విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జ్, సందర్శకులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం, వైసీపీని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
Hazarath Reddyఅట్టహాసంగా ఆదివారం ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సోమవారం తెగిపోయింది. ఒక ముక్క విడిపోయి సముద్రంలో దూరంగా కొట్టుకుపోయింది. ఆ సయమంలో సందర్శకులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
Kolusu Parthasarathy Joins TDP: టీడీపీలో చేరిన పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, వచ్చే ఎన్నికల్లో నూజివీడు నుంచి టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణా జిల్లా పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) కొలసు పార్థసారథి(Parthasarathy) టీడీపీ(TDP) కండువా కప్పుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.
CM Jagan Kuppam Tour: కుప్పంకు కృష్ణా జలాలను అందించిన సీఎం జగన్‌, భరత్‌ను ఆశీర్వదించి గెలిపిస్తే నా కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తానని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyతాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట ఇచ్చినట్లుగానే సీఎం జగన్ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. అనంతరం చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం రాజుపేట గ్రామంలో బహిరంగసభలో పాల్గొన్నారు.
TTD Key Decisions: తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు, 9వేల మందికి జీతాలు పెంచుతూ నిర్ణయం, టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు ఇవిగో..
Hazarath Reddyతిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై (Ramana Deekshitulu) టీటీడీ (TTD) వేటు వేసింది. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీటీడీ .. దీక్షితులుపై చర్యలు తీసుకుంది.
Skill Development Scam Case: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌ కేసు, చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ మరోసారి వాయిదా, ఈ రోజు విచారణలో ఏం జరిగిందంటే..
Hazarath Reddyస్కిల్‌ డెవలప్మెంట్‌ స్కామ్‌ కేసులో (Skill Development Scam Case) టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. మూడు వారాల తర్వాత పిటిషన్‌పై తదుపరి విచారణ ఉంటుందని జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ తో కూడిన ధర్మాసనం తెలిపింది.
Andhra Pradesh Elections 2024: పెట్రోలుతో చంద్రబాబు ఇంటిని ముట్టడించిన తంబళ్లపల్లె టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతాజాగా చంద్రబాబు ఇంటి వద్ద అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన చేపట్టారు. మొన్నటి లిస్టులో యాదవ్ కు చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన కార్యకర్తలు చంద్రబాబు ఇంటి వద్ద పెట్రోల్ డబ్బాలతో నిరసన తెలిపారు.
YS Sharmila: శ్రీరెడ్డి పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు.. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తుందంటూ కంప్లైంట్
Rudraతన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో నటి శ్రీరెడ్డి పోస్టింగ్స్ చేస్తున్నదంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు.
AP Horror: ఏపీలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీభత్సం.. రోడ్డు పక్కన ఉన్న వారి మీదనుంచి దూసుకెళ్లిన బస్సు.. లారీ టైర్ మార్చుతుండగా ఘోరం.. ప్రమాదంలో ముగ్గురు డ్రైవర్లు, ఒక క్లీనర్ దుర్మరణం.. పత్తిపాడు హైవేపై చోటుచేసుకున్న ప్రమాదం
Rudraఆంధ్రప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పత్తిపాడు హైవేపై ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. రోడ్డు పక్కన లారీ ఆపి టైర్ మార్చుతున్న నలుగురు వ్యక్తుల పైనుంచి బస్సు దూసుకెళ్లింది.
Janasena - TDP Crisis: చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి, చెరి సగం మంత్రి పదవులు దక్కాలి.. అలా ప్రకటన వస్తేనే పొత్తులో ఉండాలి..పవన్‌ కల్యాణ్‌కు హరిరామజోగయ్య లేఖ
sajayaHarirama Jogayya Letter to Pawan Kalyan: మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. పవన్‌ కల్యాణ్‌కు హరిరామజోగయ్య రాసిన లేఖలో.. జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా? అని విమర్శించారు.
PM Vizag Tour Cancelled: ప్రధాని మోదీ వైజాగ్ పర్యటన రద్దు?? ఏయూ మైదానంలో ఏర్పాట్లను తాత్కాలికంగా నిలిపేసిన అధికారులు
Rudraప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయినట్టు సమాచారం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నవీకరణ ప్రాజెక్టు మార్చి 1న ప్రారంభించేందుకు పీఎం షెడ్యుల్ ఖరారైంది.
TDP-Janasena's First List: ఇంకా టికెట్ దక్కని టీడీపీ కీలక నేతల లిస్టు ఇదిగో, రెండో జాబితా పైనే గంపెడాశలు, జాక్ పాట్ కొట్టిన కొలికపూడి శ్రీనివాసరావు, మహాసేన రాజేశ్
Hazarath Reddyటీడీపీ కీలక నేతలైన గంటా శ్రీనివాసరావు, యరపతినేని శ్రీనివాసరావు, ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పీతల సుజాత, కళా వెంకట్రావ్, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, ఆలపాటి రాజా తదితరుల పేర్లు తొలి జాబితాలో కనిపించలేదు
Buragadda Vedavyas: చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారు, పెడనలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి నేనేంటో చూపిస్తానంటూ బూరగడ్డ వేదవ్యాస్ సవాల్
Hazarath Reddyచంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడనుకోలేదంటూ వేదవ్యాస్‌ మండిపడ్డారు. నాకు టీడీపీ, జనసేన కార్యకర్తల మద్దతు నాకే ఉంది. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా.. గెలిచే సత్తా నాకుంది’’ అని వేదవ్యాస్ పేర్కొన్నారు.ఇక పెడన సీటు జనసేనకు కేటాయించకపోవడంపై..మాకు అన్యాయం జరిగిన చోట మేం ఉండలేం అంటూ కృత్తివెన్ను,గూడూరు,పెడన, బంటుమిల్లి మండల పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీకి రాజీనామా చేశారు.