ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు, సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని ఆదేశాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో.. ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఐఏఎస్‌ బుడితి రాజశేఖర్‌, ఐఆర్‌ఎస్‌ రామకృష్ణకు నెల రోజుల జైలుశిక్షతో పాటు ₹2వేల జరిమానా విధిస్తూ హైకోర్టు మొదట తీర్పు ఇచ్చింది.
Suicides In SHAR: శ్రీహరికోటలో వరుస ఆత్మహత్యల కలకలం, 24 గంటలు గడవక ముందే మరొకరు సూసైడ్, కుటుంబ బాధలు, వ్యక్తిగత ఇబ్బందులే ఆత్మహత్యలకి కారణమా..
Hazarath Reddyతిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో సీఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మరువక ముందు మరో సూసైడ్ కలకలం రేపుతోంది. సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ వికాస్‌ సింగ్‌ భార్య ప్రియా సింగ్‌ ఆత్మహత్యకు పాల్పడింది.
Special Aadhar Camps: ఆధార్ అప్‌డేట్ చేయని వారికి గుడ్ న్యూస్, ఈ నెల 19 నుంచి ఏపీ సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు
Hazarath Reddyఏపీలో ఆధార్‌లో బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ నెల 19 నుంచి ఐదు రోజులపాటు ప్రత్యేక క్యాంప్‌లు (Special Aadhar Camps) నిర్వహించనుంది. ఈ నెల 19, 20, 21, 23, 24 తేదీల్లో ఆయా సచివాలయాలు (All village secretariats), వాటి పరిధిలోని పాఠశాలల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తారు.
Vande Bharat Train: సెల్ఫీల కోసం వందేభారత్ ట్రైన్ ఎక్కేశాడు, డోర్ లాక్ అవడంతో భారీగా ఫైన్ కట్టాడు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో వందే భారత్‌ ట్రైన్‌ పట్టాలెక్కిన సంగతి విదితమే. అయితే తాజాగా ఈ ట్రైన్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వందే భారత్‌ ట్రైన్‌ రాజమహేంద్రవరం(రాజమండ్రి)లో ఆగిన సమయంలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసం ట్రైన్‌ ఎక్కేశాడు. సెల్ఫీలు తీసుకున్నాడు.
Ali vs Pawan Kalyan: సీఎం జగన్ సై అంటే పవన్ కళ్యాణ్‌పై నేనే పోటీ చేస్తా, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా అడ్వజైర్‌ అలీ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా అడ్వజైర్‌ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశిస్తే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై పోటీకి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. అధిష్టానం ఏ పని చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నానని అన్నారు.
Sankranti Traffic: సంక్రాంతి రద్దీ.. హైదరాబాద్-విజయవాడ రహదారిపై ఒక్క రోజే 67 వేలకు పైగా వాహనాల పరుగులు
Rudraపెద్ద పండుగ సంక్రాంతి కోసం వలస జీవులు సొంతూళ్ల బాట పట్టడంతో హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పండుగ కోసం లక్షలాదిమంది జనం నగరాన్ని వీడారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 67,577 వాహనాలు రాకపోకలు సాగించాయి.
Drug Prices: తగ్గనున్న ఔషధాల ధరలు.. 128 రకాల ఔషధాల ధరలను సవరించిన ఎన్‌పీపీఏ.. సవరించిన ఔషధాల్లో యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు కూడా
Rudraమెడికల్ షాపుల్లో మందులను ఇష్టం వచ్చిన ధరలతో విక్రయించకుండా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) చర్యలు చేపట్టింది. 128 రకాల ఔషధాల ధరలను సవరిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
Suicides In SHAR: సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఆత్మహత్యల కలకలం.. 24 గంటల వ్యవధిలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది సూసైడ్
Rudraతిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో 24 గంటల వ్యవధిలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వీరిద్దరూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి (సీఐఎస్ఎఫ్) చెందినవారు. వీరిలో ఒకరిది చత్తీస్‌గఢ్ కాగా, మరొకరిది ఉత్తరప్రదేశ్.
AP Road Accident: ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, కాన్వాయ్‌లోని వాహనాన్ని ఎదురుగా వచ్చి ఢీకొట్టిన మరో కారు
Hazarath Reddyఏపీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డికి తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. సంక్రాంతి పండుగ వేళ బంధువుల ఇంటికి మంత్రి పెద్దిరెడ్డి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోని వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది.
Peddireddy vs Chandrababu: జగన్ సై అంటే చాలు, కుప్పంలో పోటీ చేసి చంద్రబాబును ఇంటికి సాగనంపుతా, మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyచిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితే ఉండదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ (CM Jagan) ఆదేశిస్తే కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి(Chandrababu)పై పోటీ చేయడానికి తాను సిద్ధమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) తెలిపారు.
Andhra Pradesh: రైతుల అకౌంట్లలో రూ. 4,813 ‍కోట్లు జమ చేసిన ఏపీ ప్రభుత్వం, వారి నుంచి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన జగన్ సర్కారు, 21 రోజుల్లోపే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బు జమ
Hazarath Reddyసంక్రాంతి వేళ ఏపీ రైతుల మోములో చిరునవ్వులు విరబూశాయి. రైతుల వద్ద నుంచి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పటివరకూ వారి ఖాతాల్లో రూ. 4,813 ‍కోట్లు జమ చేసింది. ఇవాళ ఒక్కరోజు రూ, 1,500 కోట్లను రైతుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం జమచేసింది.
KA Paul on Pawan Kalyan: తన కొడుకు లోకేష్‌ను కాదని నిన్ను సీఎం ఎలా చేస్తారు పవన్, నీకు అసలు బుర్ర ఉందా, జనసేనాధినేతపై మండిపడిన కెఏ పాల్
Hazarath Reddyజనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు (KA Pal on Pawan Kalyan) చేశారు. అసలు పవన్‌కు బుర్ర ఉందా? తన ఓటమికి ప్రజలే కారణమంటూ పవన్‌ మాట్లాడటం అనేది తెలివి తక్కువతనం అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.
Ambati Rambabu vs Nagababu: నాగబాబుకు పంచ్ రిప్లై ఇచ్చిన అంబటి రాంబాబు, పోలవరం పూర్తి చేసి మీ అన్నాదమ్ముళ్ల చేత డ్యాన్స్ వేయిస్తామంటూ ట్వీట్
Hazarath Reddyనాగబాబు సెటైర్ పట్ల అంబటి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. 'నువ్వు, నీ తమ్ముడు అన్నట్టు నేను సంబరాల రాంబాబునే. కానీ ముఖానికి రంగు వేయను. ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను' అని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh: కంచరపాలెం పోలీస్‌ స్టేషన్ వెనుక ఘోర అగ్ని ప్రమాదం, కాలి బూడిదైన 27 బైకులు,నాలుగు కార్లు,ఒక ఆటో, ఘటనపై దర్యాప్తు చేస్తున్న విశాఖ పోలీసులు
Hazarath Reddyవిశాఖపట్నం కంచరపాలెం పోలీస్‌ స్టేషన్ పరిధిలో వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు ఆదివారం అగ్నికి ఆహుతయ్యాయి. వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ వెనుక భద్రపరిచారు. ఆ వాహనాలన్నీ కాలి బూడిదయ్యాయి.
Andhra Pradesh Horror: అనకాపల్లిలో ఓ వ్యకిని ముక్కలు ముక్కలుగా నరికిన గుర్తు తెలియని వ్యక్తులు, దుండగులు తల, మొండెం, కాళ్లను వేర్వేరుగా పడేసిన కిరాతకులు
Hazarath Reddyఅనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి మున్సిపాలిటీ కొత్తపాలెం సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన దుండగులు తల, మొండెం, కాళ్లను వేర్వేరుగా పడేశారు. ఎలమంచిలి కొత్తపాలెం బ్రిడ్జి కింద శరీర భాగాలు గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Vande Bharat: వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలుకు విశాఖలో అపూర్వ స్వాగతం.. జాతీయ జెండాలు, మంగళవాయిద్యాలతో వెల్ కమ్
Rudraసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నిన్న ఉదయం బయలుదేరిన వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలుకు విశాఖపట్టణంలో ఘటన స్వాగతం లభించింది. రాత్రి 10.45 గంటలకు విశాఖ చేరుకున్న రైలుకు రైల్వే అధికారులు జాతీయ జెండాలు, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు.
Balamurugan Passes Away: ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూత
Rudraగత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ (85) కన్నుమూశారు. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో అనేక సినిమాలకు రచయితగా పనిచేసిన ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు, రచయిత భూపతి రాజా తెలిపారు.
Andhra pradesh: పందెం కోడికి కత్తి కడుతుండగా ఒకరు మృతి, ఆట చూసేందుకు వచ్చి కోడికత్తి తగిలి మరొకరు మృతి, సంక్రాంతిరోజు కోడి పందాల్లో విషాదం
VNSఓ కోడి జనం మధ్యలోకి రావడంతో కోడికత్తి గుచ్చుకుని పద్మరాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు స్థానికులు అతడిని నల్లజర్ల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Vande Bharat Express: సంక్రాంతి పర్వదినం రోజున తెలుగు ప్రజలకు శుభవార్త.. వందేభారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ.. వీడియోతో..
Rudraతెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్‌ రైలు ప్రారంభమైంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
Happy Pongal 2023 Wishes: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపే వీడియో, వాట్సప్ మెసేజెస్, స్టిక్కర్స్, ఈ సందేశాలతో మీ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి
Rudraసంక్రాంతి పర్వదినం నాడు మీ బంధువులు, మిత్రులకు లేటెస్ట్ లీ వీడియో, వాట్సప్ మెసేజెస్, స్టిక్కర్స్, ఈ సందేశాలతో శుభాకాంక్షలు చెప్పేయండి..