ఆంధ్ర ప్రదేశ్
YSR Sankranthi Lucky Draw: వైఎస్సార్ సంక్రాంతి లక్కీ డ్రా.. గుంటూరు వాసికి రూ. 16 లక్షల విలువైన వజ్రాల హారం
Rudraవైఎస్సార్ సంక్రాంతి లక్కీ డ్రాలో గుంటూరు‌కు చెందిన గుడే వినోద్ కుమార్ రూ. 16 లక్షల విలువైన వజ్రాల హారాన్ని దక్కించుకున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురువారం రాత్రి ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, కల్పలతారెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి మంత్రి అంబటి రాంబాబు ఈ డ్రా తీశారు.
Kodi Pandalu: కాయ్ రాజా కాయ్.. కోడి పందెం కాయండి.. బుల్లెట్ బండి సొంతం చేసుకోండి.. కోస్తాలో పందెంరాయుళ్లను ఆకర్షిస్తున్న ఆఫర్లు!
Rudraకాయ్ రాజా కాయ్.. భలే ఆఫర్లు.. పెద్ద పండుగ రోజుల్లో ప్రత్యేక ఆఫర్లు. ఏంటీ? ఈ-కామర్స్ సంస్థలు, వస్త్ర దుకాణాల ఆఫర్లు అనుకుంటున్నారా? కాదండీ.. ఏపీలో కోడిపందేల బరుల వద్ద ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఊహించని ఆఫర్లతో ఈసారి బరుల నిర్వాహకులు పందెంరాయుళ్లను ఆకర్షిస్తున్నారు.
Gas Penalty: రూ. 30 డిమాండ్.. ఇవ్వనందుకు సిలిండర్ తీసుకెళ్లిపోయిన డెలివరీ బాయ్.. రూ. లక్ష చెల్లించాలన్న వినియోగదారుల ఫోరం
Rudraఇంటివరకూ గ్యాస్ తెచ్చినందుకు రూ. 30 అదనంగా ఇమ్మన్నాడు గ్యాస్ డెలివరీ బాయ్. వినియోగదారుడు ససేమిరా అనడంతో సిలిండర్‌ను వెనక్కి తీసుకెళ్లిపోయాడు. దీనిపై సదరు వినియోగదారుడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. విచారించిన ఫోరం వినియోగదారుడికి లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
Vande Bharat Express Timings, Route: వందేభారత్ ట్రైన్‌ ప్రత్యేకతలు తెలుసా? సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే మార్గం, ఆగే స్టేషన్లు ఇవే! ఈ నెల 15 నుంచి అందుబాటులోకి వందేభారత్‌
VNSతాజాగా ఈ రైలు నంబర్‌, ఆగే స్టేషన్లు, కాలపట్టిక వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 15న ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి.. చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది
144 Section in Macherla: మాచర్లలో 144 సెక్షన్‌ ఈనెల 22వ తేదీ వరకు పొడిగింపు, అనుమతి లేకుండా ర్యాలీలు,సభలు,బహిరంగసభలు నిర్వహించకూడదని పోలీసుల ఆదేశాలు
Hazarath Reddyపల్నాడు జిల్లాలో మాచర్ల పట్టణంలో శాంతిభద్రతల దృష్ట్యా ఈనెల 22వ తేదీ వరకు 144 సెక్షన్‌ను పొడిగించినట్లు అర్బన్‌ సీఐ టి బాలకృష్ణ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల 16వ తేదీన పట్టణంలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో విధించిన 144 సెక్షన్‌ పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు తెలిపారు.
CM Jagan’s ‘Telugu Flag’ Row: తెలుగు ఫ్లాగ్ అంటే తెలుగు జాతి, ముందు తెలుగోడి సత్తా తెలుసుకుని మాట్లాడు, ఆద్నాన్ సమీపై విరుచుకుపడిన వైసీపీ మంత్రులు
Hazarath Reddyఅద్నాన్‌ సమీ చేసిన ట్వీట్‌కు ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు కౌంటర్‌ ఇచ్చారు. అద్నాన్‌ చేసిన ట్వీట్‌కు స్పందించిన ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కౌంటర్‌ ట్వీట్ చేశాడు. ‘మా భాష, మా సంస్కృతి, మా గుర్తింపు మాకు గర్వకారణం. నేను మళ్లీ చెబుతున్నాను, మేం తెలుగు వాళ్లం. మా దేశభక్తిని ప్రశ్నించడానికి మీరు ఎవరు
YSRCP Leaders vs Pawan Kalyan: ప్యాకేజీ తీసుకుని పక్కకు వెళ్లి ఆడుకో, పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడిన వైసీపీ నేతలు, రెండుసార్లు ఓడిపోయిన నువ్వా మాట్లాడేది అంటూ ఫైర్
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లాలో యువశక్తి మీటింగ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణం తప్పదనే విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ ముందే ఒప్పేసుకున్నాడంటూ కామెంట్‌ చేశారు ఐటీ మంత్రి గుడివాడ అమరనాథ్,
Happy Kanuma 2023 Wishes: మూడు రోజుల సంక్రాంతి సంబరం, ఏడాదంతా జ్ఞాపకం. రైతన్నల నేస్తాలకు 'పసందైన విందు'తో జరుపుకునే పండగే కనుమ. తెలుగు సంస్కృతి- సంప్రదాయాలకు అద్ధంపట్టేలా, కనుమ పండగ విశిష్టత తెలిపే సందేశాలు, కనుమ శుభాకాంక్షలు Kanuma Subhakankshalu Images, Kanuma Quotes, Kanuma Telugu Greetings కోసం ఇక్కడ చూడండి
Vikas Mandaఈ సంక్రాంతి వేడుకలు ఏడాదికి సరిపోయే మధుర జ్ఞాపకాలు మిగిల్చాలని ఆకాంక్షిస్తూ కనుమ శుభాకాంక్షలు తెలిపే సందేశాలు, సోషల్ మీడియా స్టేటస్ లు అందిస్తున్నాం. కనుమ గొప్పదన్నాన్ని, విశిష్టతను, తెలుగు సాంప్రదాయాలను తెలిపే ఈ సందేశాలు...
Happy Makar Sankranti 2023 Wishes: నూతన క్రాంతులతో రానే వచ్చిన సంక్రాంతి, తెలుగు రాష్ట్రాల్లో మొదలైన సంక్రాంతి సంబరాలు, పండగ శోభతో కళకళలాడుతున్న పల్లెసీమలు. తెలుగింటి పండగ సంక్రాంతి ఔన్నత్యాన్ని చాటే సందేశాలు, అచ్ఛ తెలుగు సంక్రాంతి శుభాకాంక్షలు Sankranthi Subhakankshalu Images, Sankranthi Quotes, Sankranti Telugu Greetings కోసం ఇక్కడ చూడండి
Vikas Mandaసంక్రాంతి వేడుకల్లో మీతో పాటు మీ ఆత్మీయులను భాగస్వామ్యం చేసేలా, మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు మరియు మీ ప్రియమైన వారందరికి శుభాకాంక్షలు తెలిపేందుకు అచ్చమైన తెలుగు పదాల అల్లికలతో సంక్రాంతి పండగ విశిష్టతను చాటే సందేశాలు, వాట్సాప్ - ఫేస్బుక్ మేసేజ్ స్టేస్టస్, ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు అనువుగా కొన్ని చిత్రాలు.....
Amazon Layoffs: భారత్‌లో వెయ్యి మందిని తొలగించనున్న అమెజాన్..‌ పరిహారంగా 5 నెలల జీతం
Rudra10 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. మరో 18 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటువేసేందుకు సిద్దమైంది. ఇందులో భారత్‌కు చెందిన సుమారు 1000 మంది ఉన్నట్లు తెలుస్తున్నది.
Sexual Assault On Cow: గంజాయి మత్తులో ఆవుపై గ్యాంగ్ రేప్.. ఊపిరి ఆడక మృతి చెందిన మూగజీవి.. యానాంలో దారుణం
Rudraసభ్యసమాజం తలదించుకునే ఘోరమైన ఉదంతం ఇది. గంజాయి సేవించిన కొందరు ఆ నిషాలో అసలు ఏం చేస్తున్నామో అని కూడా గ్రహించకుండా ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటనలో ఊపిరి ఆడని ఆ మూగజీవి తనువు చాలించింది.
Pavuluri Passes Away: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి కన్నుమూత
Rudraగత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి (96) కన్నుమూశారు. ఇంటి దగ్గరే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో గత రాత్రి 11.20 గంటలకు తుదిశ్వాస విడిచారు.
TTD: తిరుమలలో అద్దె గదుల ధరలు పెంచిన వార్తలన్నీ అబద్దం, సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదని స్పష్టం చేసిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
Hazarath Reddyతిరుమలలో అద్దె గదుల ధరలు పెంచారన్న విమర్శలు సరికాదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO dharma reddy) అన్నారు. సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. రాజకీయంగా దీనిపై చర్చ చేస్తున్నారని, పూర్తి సమాచారం తెలుసుకోకుండానే మాట్లాడటం బాధాకరమన్నారు
AP Global Investors Summit-2023: వాస్తవిక పెట్టుబడులు లక్ష్యంగా సదస్సు ముందుకు సాగాలి, గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌-2023 ఏర్పాట్లపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష
Hazarath Reddyవిశాఖపట్నంలో త్వరలో జరగనున్న జీ-20 వర్కింగ్‌ గ్రూపు సన్నాహక సమావేశం, గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌-2023 (AP Global Investors Summit-2023) ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
Pawan Kalyan Speech in YuvaShakti: పవన్ కళ్యాణ్ పూర్తి స్పీచ్ ఇదే, యువతకు బంగారు భవిష్యత్‌ ఇచ్చేందుకు బాధ్యతగా పనిచేస్తానని హామీ, నేను సామాన్యుడిని అని తెలిపిన జనసేన అధినేత
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన యువశక్తి సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan Speech in YuvaShakti) ప్రసంగించారు. అందరికీ స్వామి వివేకానందుడి జయంతి శుభాకాంక్షలు అంటూ ప్రసంగం ప్రారంభించారు.
Happy Bhogi 2023 Wishes: భోగి పండుగ విషెస్, వాట్సప్ కొటేషన్స్, మెసేజెస్..స్నేహితులకి, బంధువులకు, కుటుంబ సభ్యులకు ఈ కోట్స్ ద్వారా భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyబలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. మరి, ఈ సంక్రాంతి ముందు రోజున వచ్చే ఈ బోగి పండుగ రోజున బంధుమిత్రులకు ఈ కింది కోటేషన్లతో శుభాకాంక్షలు చెప్పేయండి
Happy Bhogi Wishes 2023: భోగి మంటలతో సంక్రాంతి సంబరాలకు ఘనమైన ఆరంభాన్ని ఇవ్వండి, భోగి పండగ విశిష్ఠత మరియు భోగి శుభాకాంక్షలు తెలిపే సందేశాలు, WhatsApp Status Images, Bhogi Quotes, Image Messages, Bhogi Greetings కోసం ఇక్కడ చూడండి
Vikas Mandaభోగి పండగను పురస్కరించుకొని మీ స్నేహితులు, కుటుంబం, బంధువులు, సహోద్యోగులు మరియు తోటి వారికి ఈ భోగి పండగ గొప్ప ఆరంభాన్ని ఇవ్వాలని వారికి శుభాకాంక్షలు తెలియజేసే విధంగా, మీ ద్వారా పండగ సంతోషం వ్యాప్తి కావాలనే ఉద్దేశ్యంతో భోగి పండగ శుభాకాంక్షలు, సందేశాలు మరియు....
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.1 ఈ నెల 23 వరకు సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, విచారణ ఈనెల 20కి వాయిదా వేసిన ధర్మాసనం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1ని ఈ నెల 23 వరకు సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెం.1ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
Andhra Pradesh: ఏపీలో విషాదం, లండన్ వెళ్లాల్సిన యువకుడు చెట్టుకు ఉరివేసుకుని శవమై కనిపించాడు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు, నందిగామ జిల్లాలో ఘటన
Hazarath Reddyఏపీలో ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం లండన్‌ బయలుదేరి వెళ్లవలసిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి (youth suspicious death) చెందాడు.
Swami Vivekananda Jayanti: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌
Hazarath Reddyస్వామి వివేకానంద జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో వివేకానందుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు.