ఆంధ్ర ప్రదేశ్

Telangana Road Accident: విజయవాడ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం, ఢీకొన్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు, 16 మందికి తీవ్రగాయాలు, నలుగురి పరిస్థితి విషమం

Hazarath Reddy

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఒకదానిని మరొకటి ఢీ (bus collision) కొట్టాయి. ఈ ప్రమాద ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Somesh Kumar: ఏపీలో ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తా, ఏపీ సీఎస్‌ జవహర్‌ రెడ్డిని కలవనున్న సోమేశ్‌కుమార్‌, వీఆర్‌ఎస్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు (IAS officer Somesh Kumar) తెలంగాణహైకోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌కుమార్‌ను ఏపీ (Andhra Pradesh) కేడర్‌కు కేటాయించినందు వల్ల అక్కడే విధులు నిర్వహించాలని కోర్టు పేర్కొంటూ తెలంగాణలో కొనసాగింపును రద్దు చేసింది.

APSRTC Special Services: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌, దేవాలయాలకు ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయం, టూరిస్టు గైడ్స్, వసతికోసం ప్రత్యేక ఏర్పాట్లు

VNS

ఆంధ్రప్రదేశ్ ప్రజారవాణా సంస్థ (APSRTC) ఆదాయాన్నిపెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆధ్యాత్మిక ప్రదేశాలు, దేవాలయాలు, ఇతర రద్దీ ప్రదేశాలకు ప్రత్యేక బస్సులను (special services) నడిపించాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు టూరిస్టు ప్లేసులకు బస్సులను పెంచినప్పటికీ..మరికొన్ని కొత్త కొత్త ఆధ్యాత్మిక ప్రదేశాలకు బస్సు సర్వీసులను పెంచనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ తిరుమలరావు తెలిపారు.

Stones Pelted on Vande Bharat Train: విశాఖలో వందేభారత్‌ రైలుపై ఆగంతకులు రాళ్ల దాడి, రాళ్లు తగిలి రెండు బోగీల అద్దాలు ధ్వంసం

Hazarath Reddy

విశాఖపట్నంలో వందేభారత్‌ రైలు బోగీలపై గుర్తు తెలియని ఆగంతకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కంచరపాలెం వద్ద జరిగిన ఈ ఘటనలో రాళ్లు తగిలి రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. రామ్మూర్తి పంతులు పేట గేట్ దగ్గర రాళ్లతో అగంతకులు దాడి చేశారు.

Advertisement

Bonfire in School: స్కూల్ భోగిమంటల్లో పెట్రోల్ పోసిన సిబ్బంది, ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలు, కోనసీమ జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

కోనసీమ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలోని ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో సంక్రాంతి సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. స్కూల్‌ సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది.

Andhra Pradesh: నన్ను అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదు, తర్వాత రాజీకి వచ్చామని కేసును వెనక్కి తీసుకుంటున్నానని తెలిపిన బాధితురాలు, ఫిర్యాదును రద్దు చేసిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత వారం నిందితుడిపై ఒక మహిళ దాఖలు చేసిన అత్యాచారం కేసు/ఫిర్యాదును రద్దు చేసింది. అతనితో ఈ విషయాన్ని రాజీ చేసుకోవడానికి అనుమతించింది.

Jagananna Thodu: చిరువ్యాపారులకు సంక్రాంతి కానుక, ఆరో విడుత నగదును బొటన్ నొక్కి విడుదల చేసిన చేసిన సీఎం జగన్, చిరు వ్యాపారులు వాళ్ల కష్టంపైనే ఆధారపడతారని వెల్లడి

Hazarath Reddy

ఏపీలో చిరువ్యాపారులకు సంక్రాంతి ముందుగానే వచ్చేసింది. పెట్టుబడి రుణంతో అండగా నిలుస్తూ.. ఆర్థికంగా వాళ్లు (small vendors) నిలదొక్కుకునేందుకు జగనన్న తోడు పథకం (Jagananna Thodu) ఎంతగానో ఆసరాగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆరో విడుత నగదును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి జమ (CM YS Jagan disburse) చేశారు.

Golden Globe Awards 2023:తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కించుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేసిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

నాటు నాటు సాంగ్‌తో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కించుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం బుధవారం ఉదయం ఒక ట్వీట్‌ చేశారు. తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది.

Advertisement

Andhra Pradesh: సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదు, రహదారులు, రోడ్లపై సభలకు అనుమతి లేదు, జీవో నెంబర్‌ 1పై క్లారిటీ ఇచ్చిన ఏపీ అడిషనల్‌ డీజీపీ రవి శంకర్‌

Hazarath Reddy

జగన్ ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చిన జీవో నెంబర్‌ 1పై (GO No.1) జరుగుతున్న దుష్ప్రచారంపై ఆంధ్రప్రదేశ్‌ అడిషనల్‌ డీజీపీ రవి శంకర్‌ అయ్యన్నార్‌‌ వివరణ ఇచ్చారు.

Ram Gopal Varma Tweet: సేనలు ఇస్ నాట్ ఓట్లు అంటూ రాంగోపాల్ వర్మ వైరల్ ట్వీట్, కాపులు - కాపులు x కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు - సేనలు ఇస్ నాట్ = ఓట్లు అంటూ ట్వీట్

Hazarath Reddy

ఏపీ రాజకీయాలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తకిర ట్వీట్ చేశాడు. కుల రాజకీయాలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా ఫ్లాట్ పాం ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో ప్రధానంగా జనసేనను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన.. కాపులు - కాపులు x కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు - సేనలు ఇస్ నాట్ = ఓట్లు అంటూ ట్వీట్ చేశాడు.

CM Jagan in Action: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం, స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌, వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశాలు

Hazarath Reddy

తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మహిళా, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీలలో నాడు-నేడుపై సమీక్ష చేపట్టిన సీఎం.. దాదాపు రూ.1500 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందని.. మూడు విడతల్లో చేపట్టాలని ఆయన ఆదేశించారు.

Andhra Pradesh: చెరువులు, కాలువల్లో చేపల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీకి మొదటి ర్యాంక్, 42.19 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో అగ్రస్థానంలో నిలిచిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఇన్‌ల్యాండ్‌లో 42.19 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో ఏపీ మొదటి స్థా­నం­లో నిలవగా.. ఆ తర్వాత 16.52 లక్షల టన్నులతో పశ్చిమ బెంగాల్, 8.09 లక్షల టన్నులతో ఉత్తరప్రదేశ్, 7.89 లక్షల టన్నులతో ఒడిశా, 7.62 లక్షల టన్నులతో బిహార్‌ వరుస స్థానాలు పొందాయి.

Advertisement

Ex-Gratia For Covid Death Families: కోవిడ్‌ మృతుల ఎక్స్‌గ్రేషియాకు రూ.10 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, మిగిలిపోయిన మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు ఈ పరిహారం

Hazarath Reddy

ఏపీలో కోవిడ్‌–19తో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana Hc: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ వెంటనే ఏపీకి వెళ్లాల్సిందే, కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో సీఎస్

Hazarath Reddy

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.

Sankashta Chaturthi: నేడే సంకష్ట చతుర్థి.. లేటెస్ట్‌లీ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా మీ ప్రెండ్స్, బంధువులకు గ్రీటింగ్స్ పంపండి..

Rudra

నేడు సంకష్ట చతుర్థి పండుగ. ఈ రోజున గణేశుడిని , చంద్ర దేవుడిని పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. మరి ఈ పర్వదినం రోజు లేటెస్ట్ లీ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా మీ ప్రెండ్స్, బంధువులకు గ్రీటింగ్స్ పంపండి..

Cat Theft In Hyderabad: రూ. 50 వేల పిల్లిని ఎత్తుకుపోయిన దొంగలు.. హైదరాబాద్ లో కేసు నమోదు

Rudra

హైదరాబాద్ లో ఒక విచిత్రమైన కేసు నమోదయింది. పిల్లిని దొంగిలించడంపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.

Advertisement

Robotic Massage Centre: విజయవాడ రైల్వే స్టేషన్‌లో రోబోటిక్ మసాజ్ సెంటర్.. బాడీ మసాజ్‌కు రూ. 60, ఫుట్ మసాజ్‌కు రూ. 30

Rudra

టికెట్‌యేతర ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించిన దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వేస్టేషన్‌లో రోబోటిక్ మసాజ్ సెంటర్‌ ను ఏర్పాటు చేసింది.

Vande Bharat Train: సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖకు..

Rudra

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. భారత రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలును కేటాయించింది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ, విశాఖ నుంచి సికింద్రాబాద్ ప్రయాణిస్తుంది.

Jio 5G in Andhra Pradesh: నెల్లూరు, తిరుపతిలో జియో 5జీ సేవలు వచ్చేశాయి, ఏపీలో 5జీ కోసం రూ.26,000 కోట్లను ఖర్చుపెట్టిన రిలయన్స్ జియో

Hazarath Reddy

ఏపీలో రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ప్రారంభించింది. రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో సోమవారం లాంఛనంగా ప్రారంభించింది.ఇప్పటికే తిరుమ‌ల‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు పట్టణాల్లో రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

Andhra Pradesh: జర్నలిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన వైసీపీ, ట్విట్టర్‌లో వీడియో షేర్ చేసిన అధికార పార్టీ

Hazarath Reddy

హైదరాబాద్లో పవన్ తో కలిసి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు జర్నలిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జీఓ1పై ఓ రిపోర్టర్ ప్రశ్నించగా చంద్రబాబు సమాధానం చెప్పకుండా విసుగెత్తిపోయారు. మీడియాను మూకుమ్మడిగా దాడి చేసే అడవి కుక్కలతో పోల్చారు. బ్రిటీష్ పాలనలో కూడా కొందరు ఊడిగం చేశారని చెప్పుకొచ్చిన చంద్రబాబు..ఊర కుక్కల్లా మాట్లాడొద్దని వీడియోలో కనిపిస్తోంది.

Advertisement
Advertisement