ఆంధ్ర ప్రదేశ్

Tirumala: ఫిబ్ర‌వ‌రిలో శ్రీ‌వారి ఆల‌యంలో జరగనున్న విశేష ఉత్స‌వాలు ఇవే, జనవరి 28వ తేదీన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం

Hazarath Reddy

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రిలో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాలను టీటీడీ ప్రకటించింది. దీంతో పాటుగా సూర్య జయంతి సందర్భంగా జనవరి 28వ తేదీన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం జరుగనుంది.

Tirumala: జ‌న‌వ‌రి 27 నుండి 31వ తేదీ వ‌ర‌కు విశాఖలో చ‌తుర్వేద హ‌వ‌నం, లోక క‌ల్యాణం కోసం 5 రోజుల పాటు చ‌తుర్వేద హ‌వ‌నం

Hazarath Reddy

టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, శ్రీ‌ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ సంయుక్త ఆధ్వ‌ర్యంలో జ‌న‌వ‌రి 27 నుండి 31వ తేదీ వ‌ర‌కు విశాఖ‌ప‌ట్నంలోని పెందుర్తిలో గ‌ల శ్రీశార‌దా పీఠంలో చ‌తుర్వేద హ‌వ‌నం జ‌రుగ‌నుంది.

Tirumala: శ్రీవారి వైభవం నలు దిశలా వ్యాప్తి, శ్రీవాణి ట్రస్టు నిధులతో దేశ వ్యాప్తంగా 2,068 ఆలయాల నిర్మాణం, పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపిన టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి

Hazarath Reddy

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాలతోపాటు తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలతో కలిపి మొత్తం 2,068 ఆలయాల నిర్మాణం జరుగుతోందని, ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయని టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.

TTD: తిరుమలలో పటిష్ఠ నిఘా, చిన్నపాటి మైక్రో డ్రోన్‌లు కూడా పనిచేయకుండా నేవల్‌ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌, బెల్‌తో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపిన ఈవో ధర్మారెడ్డి

Hazarath Reddy

చిన్నపాటి మైక్రో డ్రోన్‌లను కూడా తక్షణమే గుర్తించి వాటిని పనిచేయకుండా నిలిపివేసే నేవల్‌ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌(ఎన్‌ఎడిఎస్‌)ను తిరుమలలో ఏర్పాటుచేసేందుకు యోచిస్తున్నట్లు టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి (TTD EO AV Dharma Reddy) తెలిపారు.

Advertisement

Andhra Pradesh: జీవో నెం 1పై విచారణ రేపటికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు, విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం రోడ్లపై సమావేశాలు, సభలు నిర్వహించకూడదంటూ తీసుకొచ్చిన జీవో నెం 1పై (AP Govt Go No1 Petition) రాష్ట్ర హైకోర్టు చేపట్టిన విచారణ రేపటికి వాయిదా పడింది. నేటి విచారణ సందర్భంగా జీవో నెం.1ను తాత్కాలికంగా నిలిపివేతను కొనసాగించేందుకు హైకోర్టు (AP High Court) నిరాకరించింది.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి జగన్ సర్కారు నోటీసులు, గవర్నర్ కు ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధమని నోటీసుల్లో స్పష్టం

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ఇటీవల గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవడంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరింది. ఈ మేరకు ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో చెప్పాలంటూ ఈ షోకాజ్ నోటీసులో పేర్కొంది.

AP Govt Extends SC/ST Sub-Plan: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ మరో 10 ఏళ్ళు పొడిగించిన జగన్ సర్కారు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన వివిధ ప్రజా సంఘాల నేతలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిర్దేశించిన సబ్‌ప్లాన్‌ (ఉప ప్రణాళిక)ను ప్రభుత్వం మరో పదేళ్లు (AP government Extends SC ST Sub Plan) పొడిగించింది. ఈ మేరకు ఆదివారం ఆర్డినెన్స్‌ను (issues ordinance) జారీచేసింది.

Andhra Pradesh: హంద్రీ నదిపై కాజ్‌వే నిర్మాణానికి రూ.24 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం, నిర్మాణ పనులను దక్కించుకున్న ఓఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ

Hazarath Reddy

కర్నూలు జిల్లాలోని కోడుమూరు మండలం గోరంట్ల గ్రామం దగ్గర హంద్రీ నదిపై కాజ్‌వే నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం రూ.24 కోట్లు మంజూరు (AP Government sanctioned Rs.24 crore) చేసింది.దీనికి సంబంధించిన నిర్మాణ పనులను (construction of causeway on Handri River ) ఓఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ దక్కించుకుంది.

Advertisement

Zomato Delivery Scam: జొమాటోలో ఫుడ్‌ డెలివరీ స్కామ్‌ ను బయటపెట్టిన కస్టమర్.. కంపెనీ సీఈవో స్పందన ఏంటంటే??

Rudra

ఫుడ్‌ ఆగ్రిగేటర్‌కు చెందిన డెలివరీ క్యాష్‌ ఆన్‌ డెలివరీతో డబ్బుల్ని ఎలా ఆదా చేసుకోవచ్చో కస్టమర్లకు చెబుతున్నాడు జొమాటో డెలివరీ బాయ్‌. అందులో ఓ కస్టమర్‌ డెలివరీ బాయ్‌ చేస్తున్న ప్రచారం గురించి నెటిజన్లతో పంచుకున్నాడు.

US Visa Interviews On Saturdays: అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఇక శనివారాల్లోనూ ఇంటర్వ్యూ

Rudra

అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయాలు శనివారం కూడా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసే ప్రక్రియను ప్రారంభించాయి.

Singer Mangli Car Attacked: సింగర్ మంగ్లీ కారుపై రాళ్లతో దాడి, బళ్లారిలో పాటపాడి వస్తుండగా దాడికి పాల్పడ్డ దుండగులు, ఆ వ్యాఖ్యలే దాడికి కారణమా?

VNS

ప్రముఖ సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. కర్ణాటకలోని బళ్లారిలో (Bellary) ఈ దాడి జరిగింది. బళ్లారి మున్సిపల్ కాలేజ్ గ్రౌండ్స్ లో బళ్ళారి ఉత్సవ్ లోపాల్గొన్న మంగ్లీ.. తిరిగి వెళ్తుండగా ఆమె కారుపై దుండగులు రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఉత్సవ్ కు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజకుమార్, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

G-20 Summit In Vizag: మార్చి 28, 29 తేదీల్లో జరగనున్న జీ20 సమ్మిట్‌కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం: విశాఖ నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడి

kanha

మార్చి 28, 29 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు.

Advertisement

Jubilee Hills Shocker: మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ చొరబాటు.. ఎందుకొచ్చావ్ అన్న అధికారిణి? అతని సమాధానం ఏంటంటే?? జూబ్లీహిల్స్‌ లో కలకలం

Rudra

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ లో నివసిస్తున్న ఓ మహిళా ఐఏఎస్ ఇంట్లోకి అర్ధరాత్రి వేళ డిప్యూటీ తహసీల్దార్ చొరబడడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.

Train Accident In Nellore: నెల్లూరులో అర్ధరాత్రి రైలు ఢీకొని ముగ్గురి దుర్మరణం.. పట్టాలపై ఉన్న మహిళను రక్షించే ప్రయత్నంలో పురుషులు మరణించారంటున్న ప్రత్యక్ష సాక్షులు

Rudra

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గత అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. గూడూరు నుంచి విజయవాడ వెళ్తున్న నర్సాపూర్ ఎక్స్‌ ప్రెస్ రైలు ఢీకొని ఓ మహిళ, ఇద్దరు పురుషులు మృతి చెందారు.

SSC Exam In Telugu: ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. ఇక తెలుగులోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష.. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 13 స్థానిక భాషల్లోనూ పరీక్ష

Rudra

గ్రామీణ ప్రాంత ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) పరీక్షను తెలుగులోనూ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) పరీక్షను ఇప్పటి వరకు హిందీ, ఇంగ్లిష్‌లో నిర్వహిస్తుండగా, ఇకపై మరో 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్టు చెబుతూ ప్రకటన విడుదలైంది.

Hyper Aadi: కాబోయే సినిమాటోగ్రఫీ మంత్రి హైపర్ ఆది అంటూ పోస్టర్లు ప్రదర్శిస్తున్న ముగ్గురు మహిళలు, పోస్టర్లు ఒరిజినలా..కాదా అనే దానిపై ఇంకా రాని క్లారిటీ

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ క్లిప్ వైరల్ అవుతోంది. ఈ క్లిప్ లో కాబోయే సినిమాటోగ్రఫీ మంత్రి హైపర్ ఆది నాయకత్వం వర్థిల్లాలి.. హైపర్ ఆది రావాలి.. పాలన మారాలి.. 2024 ఎన్నికల్లో జనసేన నుంచి కాబోయే మంత్రి హైపర్ ఆది' అంటూ ముగ్గురు మహిళలు పోస్టర్లు ప్రదర్శించారు

Advertisement

Andhra Pradesh: ఈ నెల23న జీవో నెం 1పై హైకోర్టు విచారణ జరపాలని సుప్రీంకోర్టు సూచన, వాద, ప్రతివాదులిరువురూ డివిజన్‌ బెంచ్‌ ముందు అన్ని అంశాలు ప్రస్తావించుకోవచ్చని స్పష్టం

Hazarath Reddy

ఇటీవల తీసుకువచ్చిన జీవో నెం.1పై (GO 1 petition) ఏపీ హైకోర్టు సస్పెన్షన్ ఆర్డర్స్ ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జీవో నెం.1 పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

Gidugu Rudra Raju: చిరంజీవి మా పార్టీలోనే ఉన్నారు.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.. ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు

Rudra

మెగాస్టార్ చిరంజీవి ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారని, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. ఒంగోలులో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Aruna Miller: అమెరికాలో చరిత్ర సృష్టించిన హైదరాబాదీ మహిళ.. మేరీలాండ్ గవర్నర్‌గా అరుణా మిల్లర్

Rudra

అమెరికాలోని మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అరుణా మిల్లర్‌ ఎన్నికయ్యారు. భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన తొలి ఇండియన్‌-అమెరికన్‌గా అరుణా మిల్లర్‌ అమెరికాలో చరిత్ర సృష్టించారు.

Yogi Vemana Birth Anniversary: యోగి వేమన జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్, ఏపీలో ప్రతి ఏటా జనవరి 19న అధికారికంగా యోగి వేమన జయంతి

Hazarath Reddy

యోగి వేమన జయంతి సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు

Advertisement
Advertisement