ఆంధ్ర ప్రదేశ్

US Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు తెలుగు విద్యార్థులు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు, ట్రక్కును ఢీకొట్టిన మినీ వ్యాన్

Hazarath Reddy

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ముగ్గురు విద్యార్థులు (Three students from Telugu states) మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.మంగళవారం కనెక్టికట్ రాష్ట్రంలో ట్రక్కు మరియు మినీ వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ఈ ప్రమాదం జరిగింది.

CM Jagan Nellore Visit: నేడు సీఎం జగన్ నెల్లూరు పర్యటన, ఏపీ జెన్‌కో ప్రాజెక్టు మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి, రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్‌ జెట్టి నిర్మాణం

Hazarath Reddy

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన కొనసాగుతోంది. నేడు ముత్తుకూరు మండలం నేలటూరులో ఏర్పాటు చేసిన ఏపీ జెన్‌కో ప్రాజెక్టు మూడో యూనిట్‌(800 మెగావాట్లు)ను సీఎం జగన్‌ (CM YS Jagan Mohan Reddy) జాతికి అంకితం చేయనున్నారు.

Andhra Pradesh: వచ్చే ఎన్నికల్లో మనం గెలిస్తే 30 ఏళ్లు మనమే ఉంటాం, 175కి 175 ఎందుకు తెచ్చుకోకూడదు, టెక్కలి నియోజవర్గ నేతలు, కార్యకర్తలతో సీఎం జగన్

Hazarath Reddy

అర్హులైన ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ.. ప్రజా ప్రభుత్వంగా పేరు దక్కించుకున్నాం. అలాంటప్పుడు లక్ష్య సాధన పెద్ద కష్టమేమీ కాదని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

TTD Darshan Tickets: వారికి నవంబర్‌ నెల కోటా టికెట్లను విడుదల చేయనున్న TTD, నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి, శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు

Hazarath Reddy

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి సంబంధించిన ప్రత్యేక కోటా టికెట్లు (November quota of Special darshan tokens) విడుదల కానున్నాయి. నవంబర్‌ నెల కోటాకు చెందిన టికెట్లను టీటీడీ (TTD) ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. వృద్ధులు, దివ్యాం‌గులకు సంబంధించిన ఈ టికెట్లు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నది.

Advertisement

CM Jagan to Visit Nellore: రేపు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన, ఏపీ జెన్‌కో ప్రాజెక్టు మూడో యూనిట్ జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి, పర్యటన పూర్తి వివరాలు ఇవే

Hazarath Reddy

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 27న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏర్పాటు చేసిన ఏపీ జెన్‌కో ప్రాజెక్టు మూడో యూనిట్‌(800 మెగావాట్లు)ను సీఎం జగన్‌ జాతికి అంకితం చేయనున్నారు.

Theft inTTD Parakamani: తిరుపతి హుండీ నుంచి రూ. 94 వేలు చోరీ, మాస్క్‌లో పెట్టుకొని బయటకు వెళ్లేందుకు ఉద్యోగియత్నం, గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది, ఇది మొదటిసారి కాదు! గతంలోనూ చిల్లర పనులకు పాల్పడ్డట్లు గుర్తింపు

Naresh. VNS

కానుకల లెక్కింపు తరువాత రూ.94 రెండువేల రూపాయల నోట్లను మాస్క్ లో పెట్టుకుని బయటకు వస్తుండగా విజిలెన్స్ అధికారులు అనుమానించారు. వెంటనే మాస్క్ (Mask) తీయాలని ఆదేశించగా దిలీప్ దొంగతనం బయటపడింది. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉన్న దిలీప్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా దిలీప్ ఇటువంటి చిల్లర పనులు చేయటం మొదటిసారికాదు. గతంలో కూడా దిలీప్ చేసిన చోరీలు బయటపడ్డాయి.

Weather Forecast: సిత్రాంగ్ తుపాన్ విధ్వంసంలోనే మరో అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక, అక్టోబరు 29 నాటికి శ్రీలంక,తమిళనాడు మధ్యన ఏర్పడనుందని అంచనా

Hazarath Reddy

సిత్రంగ్ తుపాను (Cyclone Sitrang) బంగ్లాదేశ్ వద్ద తీరం దాటి బలహీనపడిందన్న వార్త మరువక ముందే.. బంగాళాఖాతంలో (Bay of Bengal) మరో అల్పపీడనం ఏర్పడనుంది. సిత్రంగ్ తుపాను ఏపీపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో (Low pressure area) ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.

SP Fakkeerappa: జోగినులతో కలిసి దీపావళి జరుపుకున్న అనంతపురం ఎస్పీ ఫకీరప్ప

kanha

సమాజం వెనుకబాటుకు గురవుతున్న జోగినులతో కలిసి అనంతపురం ఎస్.పి పకీరప్ప దీపావళి వేడుకలు జరుపుకుని వార్తల్లో కెక్కారు.

Advertisement

AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టుతో పాటు, జిల్లా కోర్టుల్లో 3,432 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలతో కూడిన పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీల్లో 3,432 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేశారు.అటు హైకోర్టు, ఇటు జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను హైకోర్టు వెబ్‌సైట్‌ http://hc.ap.nic.inలో పొందుపరిచారు.

Nagula Chaviti 2022: దీపావళి తర్వాత వచ్చే మొదటి చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు. వచ్చే శుక్రవారం జరుగనున్న నాగుల చవితి పండుగ శుభాకాంక్షలను ఈ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా మీ బంధు, మిత్రులకు షేర్ చేయండి.

Jai K

వచ్చే శుక్రవారం జరుగనున్న నాగుల చవితి పండుగ శుభాకాంక్షలను ఈ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా మీ బంధు, మిత్రులకు షేర్ చేయండి.

Andhra Pradesh Shocker: రాజమండ్రిలో ఘోర ప్రమాదం, బాణాసంచా తయారు చేస్తున్న ఇంట్లో భారీ పేలుడు, ఒకరు మృతి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం బాణాసంచా తయారు చేస్తున్న ఓ ఇంట్లో పేలుడు సంభవించి ఒకరు మృతి చెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది.దీపావళి రోజున జరిగిన ఈ దుర్ఘటనలో జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉన్న ఇల్లు పూర్తిగా దెబ్బతింది.

Andhra Pradesh Fire: పాలకొండలో బైక్ షోరూంలో ఘోర అగ్నిప్రమాదం, మంటల్లో పూర్తిగా కాలిపోయిన 36 ఈ-బైకులు, యాభై లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం

Hazarath Reddy

పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండలో గల బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి ధమాకా అమ్మకాలకు తెచ్చిన బ్యాటరీ బైక్‌లు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని యజమానులు అంటున్నారు.

Advertisement

Deepavali Wishes: దివ్వెల పండుగకు శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు.. చీకటిపై వెలుగు సాధించిన విజయం అని ఏపీ సీఎం జగన్ వెల్లడి.. అజ్ఞాన అంధకారాన్ని పారదోలి జ్ఞానపు కాంతులు విరజిమ్మాలనే తత్వాన్ని దీపావళి చాటుతుందన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

Jai K

దీపావళి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ, దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.

Andhra Pradesh: విజయనగరంలో ఘోర అగ్ని ప్రమాదం, విశాల్‌ మార్ట్‌లో చెలరేగిన మంటలు, మార్ట్‌ మూసివేసి ఉండటంతో తప్పిన పెను ప్రమాదం

Hazarath Reddy

విజయనగరంలోని విశాల్‌ మార్ట్‌లో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మూడో అంతస్తులో చెలరేగి ఐదో అంతస్తు వరకు మంటలు వ్యాప్తి చెందాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్ని ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.

Andhra Pradesh: షాకింగ్ వీడియో, విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో ఘోర అగ్నిప్రమాదం, దగ్ధమైన టపాసుల దుకాణాలు, మంటల్లో ఇద్దరు సజీవదహనం, భారీగా ఎగిసిపడ్డ మంటలు

Hazarath Reddy

దీపావళి ముందు జరుగుతున్న ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. క్రాకర్స్ స్టాల్స్‌లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న రాత్రి తిరుపతిలో, ఇవాళ విజయవాడలో క్రాకర్స్ స్టాల్స్‌లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Telangana High Court: జగన్ అక్రమాస్తుల కేసులో ఇండియా సిమెంట్స్‌కు తెలంగాణ హై కోర్టులో ఊరట

kanha

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఇండియా సిమెంట్స్‌ కంపెనీకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఇండియా సిమెంట్స్‌ కేసులో ఏ-7గా ఉన్న ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ కంపెనీపై సీబీఐ నమోదు చేసిన కేసును శుక్రవారం కోర్టు కొట్టివేసింది.

Advertisement

Amaravati Farmers: అమరావతి రైతుల మహా పాదయాత్ర తాత్కాలికంగా నిలిపివేత, హై కోర్టు నిర్ణయం అనంతరం తిరిగి ప్రారంభిస్తామని వెల్లడి..

kanha

తమ పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్న పోలీసుల చర్యకు నిరసనగా అమరావతి రైతులు శనివారం తమ మహా పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ షాక్, మహిళలకు క్షమాపణ చెప్పాలని నోటీసులు..

kanha

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. మూడు పెళ్లిళ్లపై మీ వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి.. మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Rape Attempt: ఏకాంతంగా ఊసులడుకుంటున్న ప్రేమ జంట దగ్గరికి గంజాయి బ్యాచ్.. యువకుడిని తాళ్లతో కట్టి యువతిపై గ్యాంగ్ రేప్ యత్నం.. భయపడిపోయి గట్టిగా కేకలు వేసిన యువతి.. తర్వాత ఏమైందంటే? కృష్ణా జిల్లాలో దారుణ ఘటన..

Jai K

కృష్ణా జిల్లాలో గంజాయి బ్యాచ్ దారుణం.. యువకుడిని బంధించి యువతిపై అత్యాచార యత్నం.. ప్రేమ జంటను ఆటోలో వెంబడించిన గంజాయి ముఠా.. యువకుడిని తాళ్లతో కట్టి యువతిపై అఘాయిత్య యత్నం.. యువతి కేకలతో ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు.. నిందితుల ఆటోలో గంజాయి

Sitrang: బంగాళాఖాతంలో తుపాను... సోమవారం విరుచుకుపడే ప్రమాదం.. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వ యంత్రాంగం.. ఏపీపై తుపాను ప్రభావం స్వల్పమేనన్న విపత్తుల నిర్వహణ శాఖ.. అయినప్పటికీ అధికారులను సిద్ధం చేస్తున్న వైనం.. హెల్ప్ లైన్ నెంబర్లు ప్రకటన..

Jai K

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు ఐఎండీ వెల్లడించిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ తెలిపారు. ఈ తుపాను ఈశాన్య దిశగా పయనిస్తూ, ఒడిశా తీరాన్ని దాటి, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను సమీపిస్తుందని వివరించారు.

Advertisement
Advertisement