ఆంధ్ర ప్రదేశ్
AP Coronavirus Report: 25 లక్షల కరోనా పరీక్షలతో ఏపీ రికార్డు, తాజాగా 9,024 మందికి కోవిడ్-19 పాజిటివ్, రాష్ట్రంలో 2,44,549కు చేరిన కరోనా కేసుల సంఖ్య, మొత్తంగా 87,597 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 58,315 కోవిడ్-19 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 9,024 మందికి పాజిటివ్‌గా (AP Coronavirus Report) తేలింది. తాజా పరీక్షల్లో 27,407 ట్రూనాట్‌ పద్ధతిలో, 30,908 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. కొత్త కేసులతో రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య (coronavirus cases) 2,44,549 కు చేరింది. కొత్తగా 9,113 మంది వైరస్‌ బాధితులు కోలుకుని మంగళవారం డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,54,749 కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 87,597 యాక్టివ్‌ కేసులున్నాయి.
Ram Madhav: ఏపీలో ప్రతిపక్షం సీటు ఖాళీయే, బీజేపీనే భర్తీ చేయాలన్న రాం మాధవ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు స్వీకరణ, రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని వెల్లడి
Hazarath Reddyఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు మంగళవారం బాధ్యతలు (Somu Veerraju sworn-in as AP BJP President) స్వీకరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, బీజేపీ రాష్ట్ర సహాయ ఇంచార్జ్ సునీల్ డియోదర్, మధుకర్ జీ, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు, స్వర్ణపాలెస్ ప్రమాద మృతులకు బీజేపీ నేతలు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
Voter List Revision: నవంబర్ 16వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, జనవరి 15వ తేదీన ఓటర్ల తుది జాబితా, ఏపీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ వెల్లడి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 16వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Voter list revision) కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ (AP Chief Electoral Officer K.Vijayanand) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నిండే యువతీ, యువకులను ఓటరుగా నమోదు చేసేందుకు దీన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ నెల 10వ తేదీ నుంచి పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణతో పాటు ఓటర్ల జాబితాల్లో అనర్హుల పేర్లను తొలగించే కార్యక్రమం చేపడతారు. అక్టోబర్‌ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను (Voter list revision in AP) పూర్తి చేస్తారు.
Vijayawada Fire Accident: స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటనలో ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు, ఒప్పంద పత్రాలు స్వాధీనం, అగ్నిప్రమాదంపై రెండు కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
Hazarath Reddyవిజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటనలో (Vijayawada Fire Accident) పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. రమేష్‌ ఆస్పత్రి జీఎం సుదర్శన్‌, చీఫ్‌ ఆపరేటర్‌ రాజా గోపాల్‌రావుతో పాటు నైట్‌ షిఫ్ట్‌ మేనేజర్‌ వెంకటేష్‌ను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాదంపై విజయవాడ సెంట్రల్‌ తహసీల్దార్‌ జయశ్రీ ఫిర్యాదు మేరకు వీరిని అరెస్టు చేసినట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గవర్నర్‌ పేట పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు.
AP Coronavirus Report: ఏపీలో తగ్గుముఖం పట్టిన కేసులు, గత 24 గంటల్లో 7,665 మందికి కరోనా, రాష్ట్రంలో 2,35,525కు చేరిన మొత్తం కేసుల సంఖ్య, 2116కు పెరిగిన మరణాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 46,699 కరోనా వైరస్‌ (AP Cornavirus Report) నిర్ధారణ పరీక్షలు చేయగా 7,665 మందికి పాజిటివ్‌గా (New Covid-19 cases) తేలింది. తాజా పరీక్షల్లో 22,668 ట్రూనాట్‌ పద్ధతిలో, 24,331 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య (Coronavirus) 2,35,525 కు చేరింది. కొత్తగా 6,924 మంది వైరస్‌ బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,45,636 కి చేరింది.
Land Dispute in Chittoor: మహిళపై కత్తులతో దాడి, చిత్తూరులో భూవివాదం విషయంలో కత్తులతో విరుచుకుపడిన సమీప బంధువులు, మహిళ పరిస్థితి విషమం
Hazarath Reddyచిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఆస్తి తగాదాల విషయంలో (Land Dispute in Chittoor) ఓ మహిళపై సమీప బంధువులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. చిత్తూరు జిల్లా కెవి పల్లె మండలం పాపిరెడ్డిగారి పల్లెలో ( Papireddygaripalli) సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యర్థులైన సమీప బంధువులు కత్తులతో తెగబడటంతో (Man Attack Opponent With Knife) ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇది పథకం ప్రకారం జరిగిన దాడి అని తులసి భర్త అశోక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
AP New Industrial Policy: ఏపీలో కొత్త పారిశ్రామిక పాలసీని ఆవిష్కరించిన మంత్రి గౌతమ్‌రెడ్డి, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా నూతన పారిశ్రామిక పాలసీ
Hazarath Reddyఏపీలో నూతన పారిశ్రామిక విధానాన్ని మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రి గౌతమ్‌రెడ్డి (Mekapati Goutham Reddy), ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా (Roja) సోమవారం ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan) ఆలోచనల ప్రతిరూపంగా, ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానం (AP New Industrial Policy) అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించారు. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తల ఆశాకిరణం.. పెట్టుబడిదారులు నష్టపోకుండా చర్యలపై సమదృష్టి చూపనుంది.
Vijayawada Swarna Palace Fire: ప్రమాదం ఎలా జరిగింది? విచారణకు రెండు కమిటీలు ఏర్పాటు, 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు, మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి రూ. 2 లక్షలు, రాష్ట్రం నుంచి రూ. 50 లక్షలు
Hazarath Reddyఏపీలో విజయవాడలోని రమేష్‌ హాస్పిటల్‌ అనుబంధ కోవిడ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాద ఘటనపై (Vijayawada Hotel Swarna Palace Fire incident) విచారణకు రెండు కమిటీలను (Two committees) నియమించామని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని (Minister Alla Nani) తెలిపారు. ఆస్పత్రికి అనుమతులు, ఇతర అంశాలపై విచారణకు ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌లతో ఒక కమిటీ, ప్రమాదానికి కారణాలపై ఇతర అధికారులతో మరో కమిటీని నియమించినట్లు చెప్పారు.
COVID-19 in Tirumala: టీటీడీలో కరోనా కల్లోలం, మొత్తం 743 మందికి కోవిడ్-19 పాజిటివ్, 402 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్, యాక్టివ్ కేసులు 338
Hazarath Reddyతిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురు అర్చకులు, అధికారులు కరోనా (COVID-19 in Tirumala) బారినపడిన విషయం తెలిసిందే. కాగా జూన్ 11 నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, జూన్ 11 నుంచి ఇప్పటి వరకు 743 మంది(అర్చకులు, టీటీడీ సిబ్బంది) కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని డయల్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనీల్ కుమార్ సింగ్ వెల్లడించారు.
Andhra Pradesh: విజయవాడ కొవిడ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది మృతి , పలువురికి గాయాలు, భయంతో పైఅంతస్తుల నుంచి దూకిన మరికొందరు, వివరాలు ఇలా ఉన్నాయి
Team Latestlyకొవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో ఆదివారం తెల్లవారు ఝామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 7 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి....
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 10,080 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 2,17,040కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 1900 దాటిన కరోనా మరణాలు
Team Latestlyకర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా 1353 కేసులు నమోదయ్యాయి. అలాగే తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు అంతేస్థాయిలో 1310 కేసులు నమోదయ్యాయి. ఇక విశాఖపట్నం, చిత్తూరు, అనంతపూర్...
AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో 2 లక్షలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 10,171 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి రోజురోజుకి మరింత పెరుగుతూ పోతుంది. ప్రతిరోజు వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్యలో ఇటీవల కాలంగా ఏపీ, మహారాష్ట్రతో పోటీపడుతుంది....
CM YS Jagan Temple: ఏపీ సీఎం జగన్‌కు గుడి, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, గోపాలపురం మండంలం రాజుపాలెం వైసీపీ నేతల అత్యుత్సాహం
Hazarath Reddyసాధారణంగా దేవుళ్లకు, సినీ తారలకూ కొన్నిచోట్ల ఆలయాలు నిర్మిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఏపీ సీఎం వైయస్ జగన్ కు కూడా గుడి (CM YS Jagan Temple) కడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండంలం రాజుపాలెంలో వైసీపీ నేతలు సీఎం జగన్ కు ఆలయం (CM YS Jagan Mohan Reddy Temple) నిర్మిస్తున్నారు. ఈ గుడిలో సీఎం జగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ ఆలయానికి గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు (MLA Venkatarao Talari) శంకుస్థాపన చేశారు. భూమి పూజ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ సీఎం జగన్ ను ఆకాశానికెత్తేశారు.
Rajahmundry Central Jail: రాజమండ్రి సెంట్రల్ జైల్లో 265 మందికి కరోనా, హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స, అదే జైలులో రిమాండులో ఉన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర, ఈఎస్ఐ స్కాం నిందితులు
Hazarath Reddyరాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry central jail) కరోనా కల్లోలం రేపింది. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 3వ తేదీన 900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 247 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల ఒకటో తేదీన 75 మందికి పరీక్షలు చేయగా జైల్‌లో (Rajamahendravaram Central Prison) విధులు నిర్వహిస్తున్న 24 మంది సిబ్బందికి, 9 మంది ఖైదీలకు, 2వ తేదీన 64 మందికి పరీక్షలు చేయగా 9 మంది ఖైదీలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సెంట్రల్‌ జైలులో మొత్తం 1,675 మంది ఖైదీలు ఉండగా వారిలో 265 మంది ఖైదీలు కరోనా వైరస్‌ సోకింది. పాజిటివ్‌ వచ్చిన జైల్‌ సిబ్బంది 24 మందిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
AP Won 15 Awards: ఏపీ ప్రభుత్వానికి 15 అవార్డులు, కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ 2020 అవార్డుల్లో భాగంగా రాష్ట్రానికి దక్కిన పురస్కారాలు, హర్షం వ్యక్తం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం మరో ఘనతను సొంతం చేసుకుంది. ఏటా కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డుల్లో (Central Panchayati Raj Department annual awards) భాగంగా 2020 సంవత్సరానికిగానూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 15 అవార్డులను (AP Won 15 Awards) సొంతం చేసుకుంది. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు గాను ఈ అవార్డులను పంచాయతీరాజ్‌ శాఖ ఏపీకి అందించింది. ప్రతిష్టాత్మక అవార్డులు సాధించడంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఆనందం వ్యక్తం చేశారు.
CM Ramesh COVID-19 Positive: సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన బీజేపీ ఎంపీ, కరోనాతో మరో తిరుమల అర్చకుడు మృతి
Hazarath Reddyబీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కరోనావైరస్ బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ (CM Ramesh tests positive for COVID-19) అయిందని ఆయనే స్వయంగా తన ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని... డాక్టర్ల సలహా మేరకు ఐసొలేషన్లో ఉన్నానని ట్వీట్ చేశారు. రమేశ్‌కు (BJP MP CM Ramesh) కరోనా సోకిందనే వార్తలతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కరోనా బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 2 లక్షలకు చేరువైన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో 10 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు
Team Latestlyతూర్పు గోదావరి జిల్లా నుంచి నుంచి అత్యధికంగా 1,351 కేసులు నమోదయ్యాయి. అలాగే కర్నూలు జిల్లా నుంచి 1285, మరియు అనంతపూర్ జిల్లా నుంచి 1112 పాజిటివ్ కేసుల చొప్పున నమోదయ్యాయి....
AP Colleges Reopen Date: ఏపీలో అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ఓపెన్, 3 లేక 4 ఏళ్ల డిగ్రీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభం, సీఎం సమీక్ష నిర్ణయాలను వెల్లడించిన విద్యా శాఖ మంత్రి సురేష్
Hazarath Reddyఅక్టోబ‌ర్ 15 నుంచి అన్ని కాలేజీల‌ను (AP Colleges Reopen Date) ప్రారంభిస్తున్నామని అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ప‌లు ద‌ఫాలుగా వాయిదా ప‌డుతూ వ‌స్తోన్న సెట్‌ల‌ను సెప్టెంబ‌ర్ 3వ వారం నుంచి నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. 3, 4 ఏళ్ల డిగ్రీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కళాశాల‌ల్లో నాడు- నేడు కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతామ‌ని తెలిపారు. అన్ని ప్రైవేటు కళాశాల‌లు ఆన్‌లైన్‌లో అడ్మిష‌న్లు చేప‌ట్టాల‌ని సూచించారు. ఈ క్ర‌మంలో ఏవైనా కాలేజీలు అక్ర‌మాల‌కు పాల్పడితే వాటిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.
Visakha CP RK Meena: విశాఖలో తొలి అడుగు పోలీస్ శాఖదేనా? ఆరుగురు అధికారుల ప్ర‌త్యేక బృందంతో ఇప్పటికే క‌మిటీ, 15 రోజుల్లో డీజీపీకి తుది నివేదికను అందిస్తామని తెలిపిన విశాఖ సీపీ రాజీవ్ కుమార్ మీనా
Hazarath Reddyఏపీ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖ పరిపాలనా రాజధానిగా ఆమోదముద్ర పడిన నేపధ్యంలో పోలీస్ శాఖ ఆవశ్యకత, మౌలిక సదుపాయాల కల్పనపై తమ కమిటీ పరిశీలన చేయనున్నట్లు విశాఖ పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా (Rajeev Kumar Meena) అన్నారు. ఆరుగురు అధికారుల ప్ర‌త్యేక బృందంతో క‌మిటీని నియ‌మించిన‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే ఒక‌సారి స‌మావేశ‌మైన ఈ బృందం మ‌రో మూడుసార్లు స‌మావేశమ‌య్యి తుది నివేదిక‌ను 15 రోజుల్లో డీజీపీకి అందిస్తామ‌ని సీపీ (Viaskha CP Rajeev Kumar Meena) అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ‌లో ట్రాఫిక్ నియంత్ర‌ణ‌పై ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లను అంద‌జేశామ‌న్నారు. దీంతో పాటు క్రైం, విఐపిల సెక్యూరిటీ తదితర అంశాలపై కమిటీ పూర్తిగా పరిశీలన జరుపుతుంద‌ని వెల్ల‌డించారు.
SPY Agro Industry Explosion: నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మళ్లీ పేలుడు, ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
Hazarath Reddyకర్నూలు జిల్లా నంద్యాలోని ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మళ్లీ ప్రమాదం (SPY Agro Industry Explosion) చోటు చేసుకుంది. ఆగ్రో ఫ్యాక్టరీలోని (agri-chemical industry)బాయిలర్ హీటర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి (Nandyal Govt Hospital) తరలించగా, ముగ్గురు కార్మికుల్లో ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రిఫర్‌ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దక్షిణ మూర్తి అనే కార్మికుడు మృతి చెందాడు. మిగతా ఇద్దరు కార్మికులు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశార్జి అయ్యారు.