ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యం దందా, టీడీపీ ఎమ్మెల్యే వనమాడిపై మండిపడిన పవన్ కళ్యాణ్, జాగ్రత్తగా ఉండాలని అధికారులకు వార్నింగ్
Hazarath Reddyకాకినాడ పోర్టులో ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డారు
Cyclone Fengal Alert: ఫెంగల్ తుఫానుతో వణుకుతున్న తమిళనాడు, ఏపీలో కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక, ప్రస్తుతం సైక్లోన్ ఎక్కడ ఉందంటే..
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
Cyclone Fengal Live Tracker: రానున్న 3 గంటల్లో ఫెంగల్ తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం, ఉత్తర వాయువ్య దిశగా కదిలిన తీవ్ర అల్పపీడనం
Hazarath Reddyశుక్రవారం మధ్యాహ్నం 2:45 గంటలకు IMD విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గత 6 గంటల్లో 10 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలింది. ఈ వ్యవస్థ ట్రింకోమలీకి ఈశాన్యంగా 290 కి.మీ, నాగపట్టణానికి తూర్పున 290 కి.మీ, పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 320 కి.మీ మరియు చెన్నైకి ఆగ్నేయంగా 340 కి.మీ దూరంలో ఉంది.
Balineni Slams YS Jagan: జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని, జగన్ హయాంలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారంటూ..
Hazarath Reddyవైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీరుపై జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫంక్షన్ కు వెళ్లారనే అక్కసుతో మాగుంట శ్రీనివాస్ రెడ్డితో పాటు దాదాపు 17 మందికి జగన్ ఎంపీ టికెట్లు ఇవ్వలేదని మండిపడ్డారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన పిఠాపురం వాసులు, వివరాలను అడిగి తెలుసుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం
Hazarath Reddyరాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తూ, పిఠాపురంలో ధర్నా చేస్తున్న వారిని చూసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగారు..సచివాలయం టౌన్ ప్లానింగ్ సెక్రెటరీ ఫాతిమా పై బాధితులు పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేశారు .అగ్రహారానికి చెందిన ప్రభుత్వ పట్టా భూముల్లో నివాసం ఉంటున్న వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తుంది అంటూ ఫాతిమాకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు
Andhra Pradesh Shocker: మడకశిరలో బాలుడి అదృశ్యం..దారుణ హత్య, కర్ణాటకలో శవమై కనిపించిన 8వ తరగతి విద్యార్థి
Arun Charagondaసత్య సాయి జిల్లా మడకశిరలో దారుణం చోటు చేసుకుంది. ఆమిదాలగొంది గ్రామ ప్రభుత్వ జడ్పీ హైస్కూల్ పాఠశాలలో నిన్నటి దినం 8వ తరగతి చదువుతున్న చేతన్ కుమార్ అదృశ్యం అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ఇవాళ మడకశిర సరిహద్దున ఉన్న కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో బాలుడి హత్య చేయబడి శవంగా కనిపించారు విద్యార్థి చేతన్. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Naga Babu On Rajya Sabha Seat: రాజ్యసభ పదవిపై ఆసక్తి లేదు.. స్వార్థం తెలియని ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్, ఏపీ ప్రయోజనాల కోసమే ఢిల్లీకి పవన్ అని తెలిపిన నాగబాబు
Arun Charagondaరాజ్యసభకు తాను వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు మెగాబ్రదర్ నాగబాబు.నాకు ఎలాంటి రాజకీయ లక్ష్యాలు, ఆశయాలు లేవు అని తెలిపారు. అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు,అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే,వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడు .
12 Feet Snake: అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో 12 అడుగుల భారీ గిరినాగు హల్ చల్.. చాకచక్యంగా పట్టుకుని బంధించిన స్నేక్ క్యాచర్ (వీడియో వైరల్)
Rudraఅనకాపల్లి జిల్లా మాడుగుల శివారులోని ఓ రైతు పొలంలో 12 అడుగుల భారీ గిరినాగు హల్ చల్ చేసింది. ఓ రక్తపింజర పామును వేటాడి మింగేసిన గిరినాగు పొలంలో కనిపించడంతో సదరు రైతు భయపడ్డాడు.
Nagachaitanya-Sobhita Haldi Function: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్.. ఫోటోలు వైరల్
Rudraఅక్కినేని హీరో నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్ వేడుకలు ఎంతో అంగరంగ వైభోగంగా మొదలయ్యాయి. హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
AP Cabinet Meeting: డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ.. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం
Rudraఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం డిసెంబర్ 4వ తేదీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మీటింగ్ హాలులో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది.
AP Secretariat Employees: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్.. ఎందుకంటే? (వీడియో)
Rudraఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టయ్యారు. వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేశారన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డి ని అర్థరాత్రి అరెస్టు చేశారు.
AP Rain Alert: ఏపీకి తప్పిన తుపాను ముప్పు.. నేడు, రేపు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అటు తెలంగాణలో చలి పంజా
Rudraఏపీకి తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందలేదు. నేడు సాయంత్రానికి ఆ వాయుగుండం బలహీన పడుతుందని భారత వాతావరణశాఖ పేర్కొంది. వాయుగుండం వాయవ్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికల్లా కరైకల్ , మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని తెలిపింది.
Cyclone Fengal Alert: మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, దూసుకువస్తున్న ఫెంగల్ తుఫాన్, ఏపీలో మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడు తీర ప్రాంతాలకు పెను ముప్పు
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన లోతైన అల్పపీడనం ట్రింకోమలీకి తూర్పు-ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో దాదాపు స్థిరంగా ఉందని, ఇది మరో 12 గంటల్లో ఫెంగల్ తుఫానుగా మారుతుందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది
Ram Gopal Varma: పోలీసులు ఇంత వరకు నా ఆఫీసులోకి కాలే పెట్టలేదు, మరో బాంబు పేల్చిన వర్మ, ఎక్స్‌లో ప్రశ్నలు సంధించిన వివాదాస్పద దర్శకుడు
Hazarath Reddyవిచారణకు హాజరు కావాలంటూ రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి విదితమే. తాజాగా దీనిపై వర్మ ఎక్స్ వేదిగా ఓ స్టోరిని వదిలాడు ఆ స్టోరీలో వర్మ.. అన్ని న్యూస్ ఛానళ్లను ట్యాగ్ చేశారు. పాయింట్ల వారీగా అందులో రాసుకొచ్చారు.
Jagan on Power Agreements: విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో లక్ష కోట్లు ప్రజల మీద భారం పడకుండా చేశాం, నేను హిస్టరీ క్రియాట్ చేసినందుకు నాపై బురద చల్లుతారా..
Hazarath Reddyవిద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో తమ ప్రభుత్వ హయాంలో తప్పు జరిగిందనే విధంగా చూపించేందుకు కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం.. ఒప్పందం జరిగింది కేంద్ర ప్రభుత్వం(సెకి), రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమేనని స్పష్టం చేశారు.
Jagan Slams Chandrababu Govt: విద్యుత్ కొనుగోలు ఒప్పందం చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం, బురద జల్లుతూ రాతలు రాయడంపై మండిపడిన జగన్, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyఈ రోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు పాలనలో బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. హామీల అమలు లేకపోగా.. స్కాంల పాలన నడుస్తోందని అన్నారు.
YouTuber Arrest: ఉడుమును చంపి వండుకుని తిన్న వీడియోని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన యూట్యూబర్ అరెస్ట్, పోలీసులకు ఫిర్యాదు చేసిన యానిమల్ పరిరక్షణ సభ్యుల కంప్లైంట్
Hazarath Reddyలైక్‌ల కోసం ఉడుమును వండిన వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. యానిమల్ ఆక్ట్ కింద అరెస్ట్ చేశారు పోలీసులు. మన్యం పార్వతీపురం మండలంలో ఉడుమును వండుకుని, తిని ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన యూట్యూబర్లు చీమల నాగేశ్వరరావు, నాని బాబు
Andhra Pradesh: వీడియో ఇదిగో, డ్రోన్లతో పోలీసుల నిఘా పెట్టడంతో పరుగులు పెట్టిన జూదగాళ్లు, మందుబాబులపై నాలుగు కేసులు
Hazarath Reddyఅనంతపురం శివారు కాలనీలు, పరిసర ప్రదేశాలలో కొనసాగిన డ్రోన్ల నిఘా... ఓపెన్ డ్రింకింగ్ కేసు నమోదు. అనంతపురం వన్, ఫోర్త్ మరియు రూరల్ పోలీసు స్టేషన్ల పరిధిల్లోని శివారు కాలనీలు, పరిసర ప్రదేశాలలో ఆయా పోలీసులు ఈరోజు కూడా డ్రోన్లతో నిఘా పెట్టారు.
Cyclone Fengal: నెల్లూరు, తిరుపతి జిల్లాలను వణికిస్తున్న ఫెంగల్ తుఫాను, సముద్రంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
Hazarath Reddyకోస్తాంధ్రలో అక్కడక్కడ గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా పడతాయన్నారు.
Cyclone Fengal Alert: ఫెంగల్ తుఫాను ముప్పు, సహాయక చర్యల కోసం అప్రమత్తమైన భారత నౌకాదళం, తమిళనాడు, ఏపీ రాష్ట్రాలను వణికించనున్న సైక్లోన్
Hazarath Reddyహిందు మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఉత్తర, వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది