ఆంధ్ర ప్రదేశ్
COVID-19 Outbreak in HYD: హైదరాబాద్‌లో మరో 36 మందికి కరోనావైరస్ లక్షణాలు? ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని వెల్లడించిన వైద్యాధికారులు, 104 హెల్ప్‌లైన్ నెంబర్ ప్రారంభం
Vikas Mandaరాష్ట్ర వాతావరణానికి కరోనావైరస్ మనుగడ సాధించే అవకాశం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంధర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విస్తృత సాయం కోరుతున్నట్లు తెలిపారు. నగరప్రజలకు అందుబాటులో ఉంచేందుకు 50 వేల మాస్కులను తెప్పించనున్నారు. కరోనావైరస్ కోసం ప్రత్యేకంగా 104 హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా ప్రారంభించారు.....
Spandana Program: ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ, వచ్చే నెల 1వ తేదీన 2 గంటల్లోగా పెన్షన్ల పంపిణీ పూర్తి, స్పందన కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్, ఏపీలో మళ్లీ ఎన్నికల కోలాహలం
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఏం జగన్ (AP CM YS Jagan) కీలక నిర్ణయాలతో ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు.పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధి అనుకున్న గడువులోగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.
AP CM Jagan on NPR: మోదీ ప్రభుత్వానికి సున్నితంగా ఎదురెళుతున్న ఏపీ సీఎం, మైనారిటీల్లో అభద్రతాభావం.. ఎన్‌పీఆర్‌పై ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి
Vikas Mandaమోదీ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ఎన్‌పిఆర్ లో కొన్ని ప్రశ్నలుగా తల్లిదండ్రుల జన్మించిన ప్రదేశం, ఆధార్ నంబర్, పాస్‌పోర్ట్ నంబర్, మొబైల్ ఫోన్ నంబర్, ఓటరు ఐడి నంబర్, మాతృభాష తదితర వివరాలు ఉన్నాయి.అయితే వీటిపై సీఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మోదీ సర్కార్ ఏర్పడక ముందు 2010లో ఉన్నట్లుగానే జనాభా రిజిస్టర్‌ను అప్‌డేట్ చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరుతున్నారు....
AP Local Body Polls: స్థానిక సంస్థల ఎన్నికలపై గురిపెట్టిన సీఎం జగన్, నెల రోజుల్లోగా ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే జైలుకే అని హెచ్చరిక
Vikas Mandaస్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం జగన్ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. మూడు రాజధానుల అంశం, ప్రభుత్వ ఇతర నిర్ణయాలను ప్రతిపక్షం, ముఖ్యంగా చంద్రబాబు అండ్ కో తీవ్రంగా వ్యతిరేకిస్తూ తన పాలనకు వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేస్తున్న సందర్భంలో, ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఏమాత్రం గెలిచే అవకాశం ఇవ్వకుండా పూర్తిగా ఆధిపత్యం సాధించి
COVID-19: తెలంగాణలో ఉండే పొడి వాతావరణంలో కరోనావైరస్ మనుగడ సాధించలేదు, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది, వెల్లడించిన మంత్రివర్గ ఉపసంఘం
Vikas Mandaఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంధర్ మాట్లాడుతూ తెలంగాణలో ఉండే వేడి, పొడి వాతావరణంలో వైరస్ సజీవంగా ఉండే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. కరోనావైరస్ ఎక్కువగా తేమ మరియు చల్లని ప్రదేశాలలో వ్యాప్తి చెందుతుంది. తెలంగాణలో అలాంటి వాతావరణమే లేదు.....
COVID-19 in India: తెలంగాణలో కరోనావైరస్ కేసుతో రెండు రాష్ట్రాల ఆందోళన, అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములు
Vikas Mandaబాధితుడు బెంగళూరు నగరంలోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత నెలలో ఆఫీస్ పని మీదే దుబాయ్ వెళ్లిన ఆ యువకుడు అక్కడే కరోనావైరస్ బారిన పడినట్లు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత బాధితుడు నేరుగా ఫిబ్రవరి 19న దుబాయి నుంచి ముందుగా బెంగళూరు నగరానికి వచ్చాడు. అక్కడే తన ఆఫీసులో రెండు రోజుల పాటు పనిచేసి, ఆ తర్వాత సెలవుపై హైదరాబాద్ వచ్చాడు. అతడు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఏసీ బస్సులో ప్రయాణించాడు.....
Mukesh Ambani Meets AP CM: గంటన్నరపాటు ముఖేష్ అంబానీతో ఏపీ సీఎం చర్చలు, సీఎం అయిన తరువాత తొలిసారి అంబానీతో మీటింగ్, పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) భేటీ ముగిసింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో (CM’s Camp Office) దాదాపు గంటన్నర పాటు సీఎం జగన్‌తో అంబానీ బృందం చర్చలు జరిపింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై వీరు చర్చించారు.
TTD Budget 2020-21: టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.3309 కోట్లు, గతేడాది కంటే రూ.66 కోట్లు అధికం, ఆమోదం తెలిపిన పాలక మండలి
Hazarath Reddyతిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) 2020-21 బడ్జెట్ కు (TTD Budget 2020-21) ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్‌ను రూ.3,309.89 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు తిరుమలలోని (Tirumala) అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. సమావేశంలో పలు అభివృద్ధి పనులు, ఆలయ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. బడ్జెట్‌లో ముఖ్యంగా హిందూ ధర్మప్రచారం, భక్తుల సౌకర్యాలు, దేవాలయ నిర్మాణాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశుభ్రతలకు ప్రాధాన్యం ఇచ్చారు.
Father Kills Two Daughters: ఇద్దరు కూతుళ్లని తండ్రి చంపేశాడు, కడప జిల్లాలో దారుణ ఘటన, బావిలో నుంచి మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు, పరారీలో నిందితుడు
Hazarath Reddyఏపీలోని వైయస్సార్ కడప (YSR Kadapa) జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురంలో ఘోరం జరిగింది. ఓ కసాయి తండ్రి ఇద్దరు కూతుళ్లను బావిలోకి తోసి (Father Kills Two Daughters) చంపేశాడు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయాల్సిన ఆ తండ్రి పిల్లల్ని చంపేయడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
Google Pay: రూ.3 వేలు పంపిస్తే లక్ష రూపాయలు అకౌంట్లో పడ్డాయి, గూగుల్ పే నుంచి లక్ష రూపాయల స్క్రాచ్ కార్డు, ఊహించని నగదు చూసి షాక్ తిన్న అనంతపురం కుర్రాడు
Hazarath Reddyప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పేలో (Google pay) ఎవరైనా డబ్బులు ట్రాన్సఫర్ చేస్తే రివార్డు (scratch card) కింద మనకు ఎంతో కొంత డబ్బులు వస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలామందికి బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వస్తుంది. అయితే అనంతపురంలోని ఓ యువకుడికి గూగుల్ పేలో జాక్ పాట్ తగిలింది. గూగుల్‌ పే ద్వారా స్నేహితుడికి నగదు బదిలీ చేసినందుకు ఆ యువకుడికి లక్ష రూపాయల రివార్డు లభించింది.
AP CM Polavaram Tour: సీఎం హోదాలో 2వ సారి పోలవరానికి వైయస్ జగన్, ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్‌ సర్వే, పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలనే లక్ష్యంగా ముందుకు..
Hazarath Reddyఏపీ (Andhra Pradesh) సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరానికి చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ముఖ్యమంత్రి (Chief Minister YS Jagan Mohan Reddy) హోదాలో ఆయన రెండోసారి పోలవరం ప్రాజెక్ట్‌ను (Polavaram Project) ఏరియల్‌ సర్వే ద్వారా సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
YSR Village Clinic: వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు వచ్చేస్తున్నాయ్, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రాథమిక వైద్యం, జూలై 8న ‘డా.వైఎస్సార్‌ చిరునవ్వు’ ప్రారంభం, వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌
Hazarath Reddyపరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటూ దూసుకెళ్తున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) ప్రజలకు చేరువ అయ్యేందుకు మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను (YSR Village Clinic) ప్రవేశపెడుతున్నారు.
Nuzividu: అర్థరాత్రి 10 ఏళ్ల బాలికపై కామాంధుడు అత్యాచారం, నూజివీడులో దారుణ ఘటన, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Hazarath Reddyఏపీలోని (Andhra Pradesh) కృష్ణా జిల్లాలోని నూజివీడులో (Nuzividu) దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్‌ బాలికపై అర్థరాత్రి వేళ ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నాన్న ఎక్కడ ఉన్నాడో చూపుతానని మాయమాటలు చెప్పి అభంశుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీ సమీపంలో ఈ ఘటన జరిగింది.
Praja Chaitanya Yatra: బాబుకు కోడిగుడ్లతో స్వాగతం పలికిన వైజాగ్, ప్రజా చైతన్య యాత్రకు అడుగడుగునా నిరసన సెగలు, ఇరుపార్టీల మధ్య వేడెక్కిన వార్, వైజాగ్‌లో చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు
Hazarath Reddyప్రజా చైతన్య యాత్రలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Vizag Tour) ఈ రోజు ఉత్తరాంధ్రలో పర్యటి'స్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు (Chandra babu) పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ప్రజా చైతన్య యాత్ర (TDP Praja Chaitanya Yatra) చేపడుతున్న బాబుకు వైజాగ్‌లో (Vizag) రాజధాని సెగ తగిలింది.
AP CM Review Meeting: మరిన్ని ఉద్యోగాలు, విద్యుత్ రంగంలో పెట్టుబడులే లక్ష్యం, విద్యుత్‌రంగంపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం, ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyఏపీ సర్కారు (AP Govt) పరిపాలనలో ముందుకు దూసుకువెళుతోంది. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. కాగా విద్యుత్‌రంగంపై (Power Sector) బుధవారం సీఎం జగన్‌ సమీక్ష (AP CM Jagan Review Meeting) నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, ఆ విద్యుత్‌ను బయట అమ్మకోవాలనుకునే కంపెనీలకు, సంస్థలకు అనుకూలంగా పాలసీ తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు.
Polavaram Project: వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి, ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం, మేఘా సంస్థ, ఈ నెల 27న ప్రాజెక్ట్ ప్రాంతాన్ని సందర్శించనున్న ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhra Pradesh Govt) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) ఊపందుకుంది. గోదావరి నదిపై (Godavari River) కడుతున్న ఈ జాతీయ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతోంది. దేశంలోనే పెద్దదైన ఈ బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ పోలవరంను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేసే లక్ష్యంగా ప్రభుత్వం, మేఘా సంస్థలు (Megha Engineering) ప్రణాళికలు రూపొందించాయి. ఆరు దశాబ్దాల క్రితం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిన విషయం విదితమే.
Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమీషన్, త్వరలో ఖాళీ అవుతున్న 55 స్థానాలకు మార్చి 26న పోలింగ్
Vikas Manda17 రాష్ట్రాల నుంచి మొత్తం 55 రాజ్యసభ స్థానాలు ఈ ఏప్రిల్ నెలలో ఖాళీ అవుతున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి 2 మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించేసింది.....
Andhra Pradesh: మదనపల్లెలో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి మరణశిక్ష విధించిన చిత్తూరు సెషన్స్ కోర్టు
Vikas Mandaబాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు తొమ్మిది రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో పోలీసులు ఇరవై ఎనిమిది మంది సాక్షులను హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరస్థుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.....
Jagananna Vasathi Deevena: ప్రతిపక్షం కాదది రాక్షసత్వం! చంద్రబాబును రాక్షసుడితో పోల్చిన సీఎం జగన్, విద్యార్థుల కోసం మరో ప్రతిష్ఠాత్మక పథకం 'జగనన్న వసతి దీవెన' ప్రారంభం
Vikas Mandaప్రతిపక్షం దానిని ఓర్వలేక తమ పత్రికలు, మీడియాలలో దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉంది ప్రతిపక్షం కాదు, రాక్షసత్వం అని, ప్రతిరోజు రాక్షసులతో యుద్ధం చేస్తున్నామంటూ చంద్రబాబు మరియు ఆయన బృందాన్ని సీఎం జగన్ రాక్షసులతో పోల్చారు.....
Kanakadurga Flyover: విజయవాడ వాసుల కష్టాలు తీరినట్లే, తుది దశలో కనక దుర్గ ఫ్లైఓవర్ పనులు, ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్, ఆ తరువాత వాహనాలకు అనుమతి
Hazarath Reddyబెజవాడ వాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకుంటున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణం (Kanaka Durga Flyover) తుదిదశకు చేరుకుంది. ఈ ఫ్లైఓవర్‌ పనులు సంపూర్ణంగా పూర్తిచేసేందుకు అధికార యంత్రాంగం శరవేగంగా కృషిచేస్తోంది. మరో నెలరోజుల్లో.. అంటే మార్చి నెలాఖరు-ఏప్రిల్ మొదటివారంలోగా తుది దశ పనులు పూర్తయ్యేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.