ఆంధ్ర ప్రదేశ్

Telugu CM's At Maharashtra Poll Campaign: మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో తెలుగు గుభాళింపులు, మూడు రోజుల పాటూ చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి స‌హా అనేక ముఖ్య‌నేత‌ల ప్ర‌చారం

VNS

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రచారానికి ఆహ్వానించాయి అక్కడి కూటమి పార్టీలు. దీంతో ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు మహారాష్ట్రకు వెళ్లనున్నారు.

Women Fight Video: వీడియో ఇదిగో, విశాఖలో నడిరోడ్డుపై ఇష్టమొచ్చినట్లు కొట్టుకున్న మహిళలు, వ్యాపారానికి సంబంధించిన షాపు కోసం గొడవే కారణం

Hazarath Reddy

విశాఖపట్నం జిల్లా గాజువాకలో మహిళా వ్యాపారులు ఘర్షణ పడ్డారు. రోడ్డు మీద వ్యాపారానికి సంబంధించిన షాపు కోసం నడిరోడ్డుపై మహిళలు కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే పరస్పరం జుట్లు పట్టుకుని దాడులు చేసుకున్నారు. కొట్టుకుంటున్న వారిని ఆపడానికి స్థానికులు ప్రయత్నించారు.

CM Chandrababu Delhi Tour: అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చర్చకు వచ్చిన అంశాలు ఇవే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించారు.

Kakinada Subbaiah Hotel Seized: కాకినాడ సుబ్బయ్య హోటల్ సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, భోజనంలో జెర్రి రావడంతో కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన కాకినాడ సుబ్బయ్య హోటల్ ను విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ఉన్న కాకినాడ సుబ్బయ్య హోటల్లో జెర్రి కలకలం రేపిన సంగతి విదితమే. ఒక వ్యక్తి భోజనంలో ఈ జెర్రి దర్శనమిచ్చింది.

Advertisement

Tirupati: నటుడు పోసాని కృష్ణమురళిపై జనసైనికుల ఆగ్రహం, పోసాని దిష్టిబొమ్మ దగ్దం.. అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై చర్యలు తీసుకోవాలని పీఎస్‌లో ఫిర్యాదు

Arun Charagonda

నటుడు పోసాని కృష్ణ మురళిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన నాయకులు. తిరుపతిలో పోసాని కృష్ణమురళి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పై పోసాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జనసైనికులు డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తిరుపతి ఈస్ట్ పీఎస్ లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.

PM Modi: 29న ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..రూ.80 వేల కోట్ల పెట్టుబడులతో స్థాపిస్తున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, 48 వేల మందికి దక్కనున్న ఉపాధి

Arun Charagonda

ఈనెల 29న ఏపీలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రూ.80 వేల కోట్ల పెట్టుబడులతో స్థాపిస్తున్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్తో పాటు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి అయితే వచ్చే నాలుగేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 48 వేల మందికి పైగా ఉపాధి లభించనుంది.

SBI Rate Hike: రుణాల వడ్డీ రేటును పెంచేసిన ఎస్బీఐ.. 0.05 శాతం ఎంసీఎల్ఆర్ పెంచిన దిగ్గజ బ్యాంకు

Rudra

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు షాకింగ్ వార్త. అయితే ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR- ఎంసీఎల్ఆర్)లో 0.05 శాతం పెంచినట్లు ప్రకటించింది.

Snake Dance at Dwaraka Tirumala: కార్తీక పౌర్ణమి రోజున పాముల సయ్యాట.. ద్వారకా తిరుమలలో కనిపించిన దృశ్యం.. వైరల్ వీడియో

Rudra

నేడు కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినం రోజున రెండు పాములు చేసిన సయ్యాట కనువిందు చేసింది. ద్వారకా తిరుమలలో కనిపించిన ఈ దృశ్యానికి అందరూ పరవశితులయ్యారు. శివాలయానికి సమీపంలోనే ఇది జరగడంతో దేవుడి మహత్యంగా భక్తులు భావిస్తున్నారు.

Advertisement

Weather Forecast in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌ లో భారీ వర్షాలు.. తెలంగాణలో జల్లులు.. రెండు రోజులు ఇలాగే..!

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడింది. అయితే, దీని ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాలపై ఇంకా కొనసాగుతూనే ఉంది.

Bears at Lord Siva Temple: శివాలయంలోకి ఒకేసారి చొరపడ్డ మూడు ఎలుగుబంట్లు.. భయంతో పరుగెత్తిన జనాలు (వీడియో)

Rudra

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో భయానక ఘటన చోటుచేసుకుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివాలయంలో భక్తులు పూజలు చేస్తుండగా.. ఉన్నట్టుండి ఆలయంలోకి ఒకేసారి మూడు ఎలుగుబంట్లు చొరబడ్డాయి.

Karthika Pournami 2024 Wishes In Telugu: నేడే కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ తెలుగు అందించే ప్రత్యేక హెడ్ డీ ఇమేజెస్ ద్వారా మీ బంధు, మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి..!

Rudra

పరమశివుడితోపాటు శ్రీమహావిష్ణువుకు కూడా అత్యంత ఇష్టమైన పర్వదినం కార్తీక పౌర్ణమి. నేడే ఆ శుభదినం. ఇంతటి పవిత్రత ఉన్న ఈ పర్వదినం రోజు మీరు మీ బంధుమిత్రులకు లీ తెలుగు అందించే ప్రత్యేక హెడ్ డీ ఇమేజెస్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి.

Subbaiah Hotel Seized: తింటున్న భోజనంలో కాళ్ల జెర్రీ… ఎన్‌ హెచ్‌ ఆర్సీ ఛైర్‌పర్సన్‌ ఆగ్రహం.. కాకినాడ సుబ్బయ్య హోటల్ సీజ్ (వీడియో)

Rudra

విజయవాడలోని ప్రముఖ హోటల్ లో గురువారం మధ్యాహ్నం ఓ కస్టమర్ కు సర్వ్ చేసిన భోజనంలో కాళ్ల జెర్రీ ప్రత్యక్షమయ్యింది. నగరంలోని సూర్యారావు పేటలో ఉన్న సుబ్బయ్య హోటల్‌ లో ఈ ఘటన జరిగింది.

Advertisement

Visakhapatnam Horror: విశాఖ గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం, యువతి తలపై ఇనుపరాడ్డుతో దాడి, బాధితురాలి తలపై వైద్యులు 30కి పైగా కుట్లు, వీడియో ఇదిగో..

Vikas M

విశాఖపట్నం గాజువాకలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో యువతిపై ఓ యువకుడు రాడ్డుతో దాడి చేశారు. ఈ ఘటనలో బాధితురాలు మేఘనకు తీవ్ర గాయాలు అయ్యాయి. మేఘన తలపై బలంగా ఇనుప రాడ్డుతో నిందితుడు నీరజ్ శర్మ దాడి చేశాడు.

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, ఓ వ్యక్తిని కత్తితో వెనక భాగంలో పొడిచి చంపేందుకు ప్రయత్నించిన మందుబాబు

Vikas M

అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వీపు భాగంలో మందు బాబు కత్తి దింపి పరార్ అయ్యారు. బి.కొత్తకోట మండలం గోళ్లతోపులో ఉండే టేకుమంద వీరస్వామి (50)పై అదే ఊరిలో ఉండే భగవాన్(22) మద్యం మత్తులో కత్తితో పొడచి హత్యాయత్నంకు పాల్పడ్డాడు.

CM Chandrababu Speech in Assembly: 2047 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ, అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఏమన్నారంటే..

Hazarath Reddy

శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్‌పై నవ్వులు పూయించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన ట్రిపుల్ ఆర్‌కు.. టీడీపీ తరఫున, వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, పల్నాడు జిల్లాలో గాయపడిన లక్ష్మారెడ్డిని ఫోన్లో పరామర్శించిన జగన్, పార్టీ నుండి ఆర్థిక సహాయం అందుతుందని భరోసా..

Hazarath Reddy

పల్నాడు జిల్లా జూలకల్లు గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డిని వైయస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. లక్ష్మారెడ్డిని కొందరు వ్యక్తులు దాడి చేయగా రెండు కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ ఫోన్ ద్వారా ఆయనను పరామర్శించారు. పార్టీ నుండి ఆర్థిక సహాయం లక్ష్మారెడ్డికి అందుతుందని భరోసా కల్పించారు.

Advertisement

Raghurama Krishna Raju: వీడియో ఇదిగో, రఘురామను స్పీకర్ కుర్చీలో కూర్చోపెట్టిన చంద్రబాబు, చైర్ లోంచి లేచిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Hazarath Reddy

రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. రఘురామను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వంటి హేమాహేమీలు చైర్ వద్దకు సగౌరవంగా తీసుకునివెళ్లి కూర్చోబెట్టారు. వారి వెంట బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు.

Siva Prasad Reddy Slams Chandrababu Govt: ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి, మా పోరాటం ఆగదని తెలిపిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

Hazarath Reddy

రాష్ట్రలో ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి అని అంటూ కామెంట్స్‌ చేశారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు.

Sri Reddy Open Letter To Lokesh: శ్రీరెడ్డి క్షమాపణ లేఖ ఇదిగో, నారా లోకేష్ అన్న నన్ను క్షమించాలంటూ లేఖ ద్వారా విన్నపం

Hazarath Reddy

వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లపై చేసిన అనుచిత కామెంట్స్‌కు సంబంధించి ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి విదితమే. తాజాగా శ్రీరెడ్డిపై కూడా చర్యలు ఉంటాయనే ప్రచారం సాగుతుంది. తాజాగా శ్రీరెడ్డి తన ఎక్స్ అకౌంట్‌లో ఓ లేఖను పోస్టు చేశారు

Sri Reddy Open Letter To Jagan: జగన్ అన్నా నన్ను క్షమించు అంటూ శ్రీరెడ్డి మరో లేఖ, వైసీపీ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో వెల్లడి

Hazarath Reddy

జగన్‌ గురించి ప్రస్తావిస్తూ.. జగన్, భారతీరెడ్డిని దగ్గరి నుంచే అదృష్టం తనకు దక్కలేదని, టీవీల్లో చూసి ఆనందిస్తుంటానని పేర్కొంది. పార్టీలో తాను సభ్యురాలిని కాకపోయినా, తన వాణిని బలంగా వినిపించానని, అయితే, తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని, పార్టీకి నష్టం జరుగుతుందని అంచనా వేయలేకపోయానని విచారం వ్యక్తం చేసింది

Advertisement
Advertisement