ఆంధ్ర ప్రదేశ్

Tirupati Laddu Row: తిరుపతి లడ్డు నెయ్యి సరఫరా కోసం కొత్త కాంట్రాక్టర్‌తో టెండర్‌ ఖరారు, ఏఆర్‌ డెయిరీ నెయ్యి వాడడం ఆపేశామని తెలిపిన టీటీడీ ఈవో శ్యామలరావు

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం చర్చనీయాంశమైంది. ఏఆర్‌ డెయిరీ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేలిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఈవో శ్యామలరావు తెలిపారు. శుక్రవారం(సెప్టెంబర్‌20) తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేవంలో ఈవో మాట్లాడారు

Tirupati Laddu Row: మా నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదు, తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏఆర్ డెయిరీ వివరణ

Hazarath Reddy

తిరుమల పుణ్యక్షేత్రంలో పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపి కల్తీ నెయ్యి వాడారంటూ సీఎం చంద్రబాబు స్వయంగా ఆరోపించడం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఈ కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

Jagan on Tirupati Laddu Dispute: మన తిరుమలను మనమే తక్కువ చేసుకుంటున్నాం, లడ్డూ వ్యవహారంపై స్పందించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కొవ్వు ఉందనేది ఒక కట్టు కథ అని కొట్టిపారేశారు.

Tirupati Laddu Controversy: దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకోవాలా జగన్ ఫైర్, ప్రపంచ చరిత్రలో ఇంత నీచ రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు అని మండిపాటు

Arun Charagonda

తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు మాజీ సీఎం జగన్. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవాలి అనే ఆలోచన చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో చంద్రబాబు ఒకరేనని ఇంకెవ్వరూ ఉండరు అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డులకు వాడే నెయ్యి సేకరించే ప్రక్రియ ఎంత గొప్పదో ప్రపంచానికి చెప్పాల్సింది పోయి..ఇంత నీచమైన కామెంట్స్ చేస్తారా అని మండిపడ్డారు.

Advertisement

T. Subbarami Reddy: చాలా రోజుల తరువాత మీడియా ముందుకు, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుబ్బరామిరెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

'Attack on Sanatana Dharma': ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్ర, తిరుపతి లడ్డూ వ్యవహారంపై రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుమలలో లడ్డూ (Tirupati Laddoos) వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది.తాజాగా ఈ లడ్డూ వ్యవహారంపై రామజన్మభూమి ఆలయ (Chief Priest of Ram Janmabhoomi) ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ స్పందించారు. ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్రగా ఆయన అభివర్ణించారు.

Vijaysai Reddy on Chandrababu: ఆంధ్ర రాష్ట్రాన్ని భగవంతుడే రక్షించాలి, నారాయణ అంటూ చంద్రబాబుపై సెటైర్ వేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

Hazarath Reddy

40 ఏళ్ళ ఇండస్ట్రీగా స్వీయప్రకటన చేసుకున్న, పాలన తెలియని పామరుడు పదే పదే అధికారాన్ని చేజిక్కించుకోవటం వెనక వున్న మతలబు ఏమిటో ప్రజలు ఆలోచించాలి!. ఆంధ్ర రాష్ట్రాన్ని భగవంతుడే రక్షించాలి. నారాయణ , నారాయణ.. నారాయణ’ అంటూ కామెంట్స్‌ చేశారు.

VHP on Tirupati Laddu Dispute: చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన విశ్వహిందూ పరిషత్, వ్యాఖ్యలకు కట్టుబడి ఆ ఆరోపణలను నిరూపణ చేయాలని డిమాండ్

Hazarath Reddy

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేసింది మరియు గత హయాంలో జంతు కొవ్వును దాని తయారీలో ఉపయోగించినట్లు వచ్చిన నివేదికలపై హిందువులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు.

Advertisement

Cyclone To Hit Andhra Pradesh? ఏపీని తాకనున్న మరో తుఫాను, ఈ నెలాఖరులో రాష్ట్రానికి సైక్లోన్ ముప్పు ఉందని హెచ్చరిక

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ నెల ప్రారంభంలొ వరదలు ముంచెత్తిన సంగతి విదితమే.దాని నుంచి ఇంకా ప్రజలు బయటపడలేదు. అయితే ఈ విపత్తు నుంచి తేరుకోకముందే మరో తుఫాను హెచ్చరిక ఏపీ వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెలాఖరులో రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబు­తున్నారు.

Tirupati Laddu Controversy: దేవుడితో పెట్టుకుంటే ఎవరూ బతకలేరు, చంద్రబాబుపై మండిపడిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌

Hazarath Reddy

లడ్డూ తయారీపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ మండిపడ్డారు. సీఎం హోదాలో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చా అంటూ నిలదీశారు.

Tirupati Laddu Controversy: సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వైఎస్సార్‌సీపీ, వాస్తవాలు నిగ్గుతేల్చాలంటూ పిటిషన్

Hazarath Reddy

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్, పోర్క్ ఫ్యాట్ ఉందనే టీడీపీ బయటపెట్టిన రిపోర్ట్ కలకలం రేపుతోంది. ఈ నేపధ్యంలో తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సార్‌సీపీ.. హైకోర్టును ఆశ్రయించింది.

Kethireddy Venkatarami Reddy: చివరి వరకు వైఎస్ ఫ్యామిలీతోనే..జగన్ వెంటే నడుస్తా, వైసీపీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

Arun Charagonda

వైసీపీ నుంచి వైదొలుగుతారంటూ జరుగుతున్న ప్రచారంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతలే తనపై దుష్పచారం చేస్తున్నారని ...35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటున్నాం.

Advertisement

Ramana Deekshitulu On TTD Laddu: నెయ్యి కల్తీ బాధాకరమన్న రమణ దీక్షితులు, నెయ్యి కల్తీపై విచారణ జరిపించాలని డిమాండ్, ఆగమ శాస్త్రం ప్రకారం పరిహారం చేయాలని సూచన

Arun Charagonda

కళియుగ వైకుంఠం శ్రీనివాసుడి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తారన్న సంగతి తెలిసిందే. దేశ, విదేశాల నుండి భక్తులు తరలివస్తారు. శ్రీవారి దర్శనమే కాదు లడ్డూ కూడా ఫేమస్. శ్రీవారి లడ్డూ కోసం ఎగబడతారు కూడా. అయితే అలాంటి శ్రీవారి లడ్డూ పై సీఎం చంద్రబాబు చేసిన కామెంట్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh: మద్యం మత్తులో మందుబాబుల హల్‌చల్, హోటల్‌లో ఓ వ్యక్తిపై దాడి, పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్వాహకులు

Arun Charagonda

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. మినర్వా హోటల్ లో ఓ వ్యక్తిపై దాడి చేశారు. మందుబాబులను పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు పోలీసులు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. గంటపాటు శ్రమించి ఎట్టకేలకు వారిని పీఎస్ కు తరలించారు.

Pawan Kalyan on Tirupati Laddu Row: బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం.. తిరుమ‌ల ల‌డ్దూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. 'సనాతన ధర్మ రక్షణ బోర్డు' ఏర్పాటుకు డిమాండ్‌

Rudra

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు క‌ల‌పారన్న వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

Anna Canteens: అన్న క్యాంటీన్ ఓపెనింగ్..కొట్టుకున్న టీడీపీ నేతలు, రాజంపేటలో ఉద్రిక్తత, రిబ్బన్ కటింగ్ కోసం కొట్టుకున్న తెలుగు దేశం నేతలు..వీడియో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌ రాజంపేటలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రాజంపేట టీడీపీ ఇంఛార్జి తాను అంటే తాను అని సుగవాసి బాలసుబ్రమణ్యం, చమర్తి జగన్మోహన్ రాజు ఎవరికి వారు ప్రకటించుకొని అన్న క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో గొడవ పడ్డారు.

Advertisement

Jani Master Rape Case Row: గోవా కోర్టు అనుమతితో హైదరాబాద్‌ కు జానీ మాస్టర్‌.. రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్న పోలీసులు.. నేడు పోక్సో కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు

Rudra

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలోని ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన జానీ మాస్టర్ పై తాజాగా ఒక యువతి లైంగిక ఆరోపణలు చేసింది.

Tirupati Laddu Controversy: తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం, ఆధారాలు ఇవిగో అంటూ బయటపెట్టిన టీడీపీ, ఖండించిన వైసీపీ

Hazarath Reddy

ఈ దేశంలోనే నెం.1 డెయిరీ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు అని, గుజ‌రాత్ కు శాంపిల్స్ పంప‌గా… వ‌చ్చిన రిపోర్ట్ ఇదిగో అంటూ టీడీపీ నేత ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మీడియాకు చూపించారు.

New Liquor Policy in AP: ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు ఓపెన్, షాపు లైసెన్స్ దరఖాస్తు ఖరీదు రూ.2 లక్షలు, నో రీఫండ్

Hazarath Reddy

మద్యం ప్రియులకు చంద్రబాబు సర్కారు మరో శుభవార్తను తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లిక్కర్ షాపులను తెరిచి ఉంచనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త మద్యం పాలసీ ప్రకారం.. తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం అందిస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు

YS Sharmila on Tirupati Laddu: తిరుపతి లడ్డు వివాదం, చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన వైఎస్ షర్మిల, రాజకీయ కోణం లేకుంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్

Hazarath Reddy

తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయ‌ని ఆమె మండిప‌డ్డారు. సీఎం హోదాలో చంద్రబాబు వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశ్వ‌రుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయ‌ని తెలిపారు.

Advertisement
Advertisement