ఆంధ్ర ప్రదేశ్

Budameru River Flood: బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద, నీట మునిగిన పలు కాలనీలు, ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్న ప్రజలు

Hazarath Reddy

విజయవాడను ముంచెత్తిన వరదలు కాస్త తగ్గుముఖం పడుతుండగానే గురువారం మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో బుడమేరుకు వరద తాకిడి పెరుగుతోంది. విజయవాడ వీధుల్లోకి మరోసారి నీళ్లు చేరుతున్నాయి.

TDP Suspends MLA Koneti Adimulam: రాసలీలల ఎఫెక్ట్, టీడీపీ నుండి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్, ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు!

Arun Charagonda

రాసలీలల ఎఫెక్ట్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు సత్యవేడు ఎమ్మెల్యే, టీడీపీ నేత కోనేటి ఆదిమూలం. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. లైంగిక ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తూ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

Andhra pradesh: ఫార్చునర్ కారులో వచ్చి చోరి, బంగారం షాపులో 38 కిలోల వెండి ఆబరణలు అపహరణ, దొంగల్లో ఒకరిని పట్టుకున్న స్థానికులు..వీడియో

Arun Charagonda

ఖరీదైన కారులో వచ్చి చోరీ చేసి దొరికిపోయిన సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో చోటు చేసుకుంది. ఫార్చునర్ కారులో వచ్చి బంగారం షాపులో 38 కిలోల వెండి ఆభరణాలు చోరీ చేశారు. పారిపోతున్న దొంగల్లో ఒకడిని పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితులది రాజస్థాన్‌గా భావిస్తున్నారు పోలీసులు.

TDP MLA Koneti Adimulam Episode: టీడీపీ ఆఫీస్ ముందే ఆత్మహత్య చేసుకుంటా..ఎమ్మెల్యే లైంగిక వేధింపులపై బాధితురాలు, పలు న్యూడ్ వీడియోలు రిలీజ్

Arun Charagonda

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో ఉన్న న్యూడ్ వీడియో వైరల్‌గా మారగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో బాధితురాలు పలు న్యూడ్ వీడియోలను రిలీజ్ చేసింది. ఈ అంశాన్ని గతంలో సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించింది.

Advertisement

TDP MLA Koneti Adimulam: అది మార్ఫింగ్ వీడియో, టీడీపీ నేతలే తనపై కుట్ర చేశారని వెల్లడించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటన

Arun Charagonda

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఓ మహిళతో రొమాన్స్ చేస్తున్న వీడియో బయటకు రాగా దీనిపై స్పందించారు ఆదిమూలం. సొంతపార్టీ నేతలే తనపై కుట్రచేశారని, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

TDP MLA Koneti Adimulam: ఓ వైపు వర్షం..మరోవైపు రాసలీలల్లో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, లైంగికంగా దాడి చేశారని ఫిర్యాదు చేసిన మహిళా..వీడియో ఇదిగో

Arun Charagonda

టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వివాదంలో చిక్కుకున్నారు. సత్యవేడు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆదిమూలం. చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశారని కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ ఫిర్యాదు చేయగా రాసలీలకు సంబంధించిన వీడియో లీక్ అయింది.

YS Sharmila On Rainy Season: వర్షాకాలానికి సరికొత్త అర్ధం చెప్పిన వైఎస్ షర్మిల, రైనీ సీజన్ అంటే షర్మిల ఏం చెప్పిందో తెలుసా?, అందుకే నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారా!

Arun Charagonda

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు మరోసారి ట్రోలింగ్‌గా మారారు. గతంలో పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పి నవ్వుల పాలైన షర్మిల తాజాగా వర్షాకాలనికి అలాంటి సమాధానమే చెప్పింది. విజయవాడలో పర్యటించిన షర్మిల...మీడియాతో మాట్లాడుతూ రైనీ సీజన్ అంటే రైన్స్ వచ్చే సీజన్‌ అని చెప్పేశారు. అంతే నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు

Vijayawada Floods: కన్నీరు తెప్పిస్తున్న వీడియో, వరద నీటిలో శవమై తేలిన 14 ఏళ్ల బాలుడు,విజయవాడలో కన్నీటి దృశ్యాలు

Arun Charagonda

వరద నుండి ఇప్పుడిప్పుడే విజయవాడ బయటపడుతోంది. ఇక సహాయక చర్యల్లో భాగంగా హృదయ విదారక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. చిట్టినగర్ పరిధిలో అదృశ్యమైన 14 ఏళ్ల బాలుడు వరద నీటిలో శవమై తేలాడు. నడుములోతు నీటిలో మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్తుండగా కొడుకుని తలుచుకుని రోదిస్తున్న ఆ తల్లి బాధ మాటల్లో చెప్పలేదని. ఈ దృశ్యాలు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి.

Advertisement

Nandigam Suresh Arrest: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్, టీడీపీ కార్యాలయంపై దాడి ఎఫెక్ట్, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు

Arun Charagonda

వైసీపీ నేత, మాజీ ఎంపి నందిగం సురేష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో హైదరాబాద్‌లో ఉన్న సురేష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం మంగళగిరికి ఆయన తరలించారు.

Central Govt Committee: ఏపీలో వ‌ర‌ద‌ల‌పై సాయానికి సిద్ధ‌మైన కేంద్ర ప్ర‌భుత్వం, రేపు వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్న కేంద్ర క‌మిటీ, అమిత్ షా ట్వీట్

VNS

విజయవాడలో దారుణ పరిస్థితులపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతంలో కేంద్ర నిపుణుల కమిటీ పర్యటిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amith Shah) తెలిపారు.

YS Jagan Comments on Chandrababu: క‌ర‌కట్ట ద‌గ్గ‌ర‌ ఇళ్లు మునిగింది కాబ‌ట్టే..చంద్ర‌బాబు క‌లెక్ట‌రేట్ లో ఉంటున్నారు! సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన వైఎస్ జ‌గ‌న్

VNS

విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు (Chandra Babu) ఘోరంగా విఫలమయ్యారని వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ (YS Jagan) ఆరోపించారు. బుధవారం విజయవాడలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.

Telangana: కేసీఆర్ కనబడుట లేదు, ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్ష నేత ఎక్కడంటూ పోస్టర్లు వైరల్

Hazarath Reddy

కేసీఆర్ కనబడుట లేదని తెలంగాణలో పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. రెండు సార్లు అధికారం ఇచ్చినా... ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే బయటకు రాని ప్రతిపక్ష నేత అంటూ పోస్టర్లు.రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Godavari Water Level Rises: వీడియో ఇదిగో, గోదావరిలో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీ వరద ఉధృతి

Hazarath Reddy

తుఫాను ప్రభావం వలన ఎగువ రాష్ట్రాల్లో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటిమట్టం బుధవారం సాయంత్రానికి పెరుగుతూ వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే ఎగువన 31.770 మీటర్ల నీటిమట్టం, స్పిల్ వే దిగువన 23.100 మీటర్ల నీటిమట్టం నమోదయింది.

Vijayawada Floods: అటు కృష్ణానది, ఇటు బుడమేరు కలిసి విజయవాడను ముంచేశాయి, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపిన సీఎం చంద్రబాబు

Hazarath Reddy

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వరదల పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా నదిలో అదనంగా 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండేదని అన్నారు.

Budameru River Flood: వీడియో ఇదిగో, విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద, గండి పడకుండా పరివాహక గట్లకు మట్టి కట్టలు వేస్తున్న ప్రజలు

Hazarath Reddy

విజయవాడను వణికించిన బుడమేరుకు మళ్లీ వరద పెరుగుతోంది. నిన్న బుడమేరులో వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. కానీ, ఈరోజు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతం నుంచి 8 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు తెలిపారు.

Andhra Pradesh Rains: వరదలకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 20 మంది మృతి, 6,44,536 మందిపై తీవ్ర ప్రభావం చూపిన భారీ వర్షాలు, 2.34 లక్షల మంది రైతులకు తీవ్ర నష్టం

Hazarath Reddy

ఏపీలో భారీ వర్షాలు విలయం సృష్టించాయి. ముఖ్యంగా బెజవాడ వాసులను బెంబేలెత్తించాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారని ఏపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

IMD Weather Alert: విజయవాడకు పొంచి ఉన్న మరో ముప్పు, బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, తుపానుగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు అలర్ట్

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశాలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతరం ఇది తుపానుగా మారే ఛాన్స్‌ ఉన్నట్లు (IMD Weather Alert) అంచనా వేస్తోంది.

Air India Plane Bomb Scare: విమానాలకు ఆగని బాంబు బెదిరింపు కాల్స్, విశాఖకు వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో బాంబు ఉందంటూ ఫోన్ కాల్, తీరా చూస్తే..

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీ నుంచి 107 మంది ప్రయాణికులతో విశాఖపట్నం (Delhi To izag flight) వెళ్తున్న ఎయిర్‌ ఇండియా (Air India) విమానానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.మంగళవారం అర్ధరాత్రి ఎయిర్‌ ఇండియా సంస్థకు చెందిన విమానం ఢిల్లీ నుంచి విశాఖపట్నం బయల్దేరింది.

Explosion In Srisailam Power House: శ్రీశైలం పవర్‌ హౌస్‌లో భారీ పేలుడు, నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి..వీడియో

Arun Charagonda

శ్రీశైలం పవర్‌ హౌస్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో ఏడో నంబర్‌ యూనిట్‌లో నిలిచిపోయింది విద్యుత్‌ ఉత్పత్తి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

TDP Office Destroyed Case: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు, వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. వైసీపీ నేతలు దేవినేని అవినాశ్‌, నందిగాం సురేశ్‌, అప్పిరెడ్డి సహా పలువురు పిటిషన్లను కొట్టివేసింది. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ జోగి రమేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

Advertisement
Advertisement