తెలంగాణ
Hyderabad: వీడియో ఇదిగో, తన ఆటోలో మందు తాగవద్దు అన్నందుకు డ్రైవర్‌పై బీర్ బాటిల్‌తో దాడి, పోలీసులపై రాళ్లు విసిరిన మందుబాబులు
Hazarath Reddyకొండాపూర్ రాఘవేంద్ర కాలనీ గుడ్ టైం లిక్కర్ స్టోర్ వైన్స్ వద్ద మద్యం మత్తులో యువకుల హల్ చల్.తన ఆటో లో మందు తాగకూడదు అన్నందుకు ఆటో డ్రైవర్ పై దాడి చేసిన మందుబాబులు.మద్యం మత్తులో ఆటో ఓనర్ పై బీర్ బాటిల్ తో దాడి
Telangana: అసలు ఏంటీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 ? పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 29 వల్ల కలిగే నష్టాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే జీవో 29 రద్దు పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది.
Telangana: అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు, ఎగ్జామ్స్ వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
Hazarath Reddyగ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో అక్టోబరు 21న నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మార్గం సుగమమైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించడంతో షెడ్యూల్ ప్రకారమే ఈ పరీక్షలు జరగనున్నాయి
Gautam Adani Meets CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ ఆదానీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ. 100 కోట్ల విరాళం అందజేత
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ ఆదానీ. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి భారీ విరాళాన్ని అందజేశారు. రూ. 100 కోట్ల విరాళాన్ని చెక్కు రూపంలో సీఎంకు అందజేశారు అదానీ.
KTR on Musi River: మూసి బ్యూటిఫికేషన్ కాదు లూసిఫికేషన్, గ్రాఫిక్స్ మాయాజాలంతో నానా తంటాలు పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మూసీ రివర్ ప్రాజెక్టుపై కేటీఆర్ పవన్ పాయింట్ ప్రజెంటేషన్
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అని ప్రజలకు తెలిసిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మూసి రివర్ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో, ఏం చేయాలో తెలియక, గ్రాఫిక్స్ మాయాజాలంతో సీఎం రేవంత్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారన్నారు.
KA Paul: తెలంగాణలోని కొందరు ఎమ్మెల్యేలపై కేసు వేశా, చంపుతామని బెదిరిస్తున్నారు కేఏ పాల్ సంచలన కామెంట్
Arun Charagondaప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణాలో కొందరు ఎమ్మెల్యేలపై కేసు వేశాను...నేను వేసిన కేసులు విత్‌డ్రా చేసుకోవాలని లేదంటే చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. గతంలోనూ ఇలానే బెదిరింపులు వచ్చాయని... తనని తాను తగ్గించుకున్న వాడు ధన్యుడు.. పవన్‌కళ్యాణ్ అదే అంటాడు కానీ తగ్గడు అన్నారు.
Hyderabad: అశోక్‌నగర్‌లో గ్రూప్ 1 అభ్యర్థుల అరెస్ట్, జీవో 29 రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న వారిపై లాఠీ ఝుళిపించిన పోలీసులు, మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్
Arun Charagondaహైదరాబాద్, అశోక్ నగర్‌లో గ్రూప్ 1 అభ్యర్థులను అరెస్ట్ చేశారు పోలీసులు. జీవో 29 రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నవారిపై లాఠీలు ఝుళిపించారు పోలీసులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా మెయిన్స్ పరీక్ష వాయిదా వేయకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Dalit Bandhu: ప్రజాభవన్ ముందు దళిత బంధు లబ్దిదారుల ఆందోళన, రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్..
Arun Charagondaహైదరాబాద్ ప్రజా భవన్ ముందు ధర్నా చేపట్టారు దళిత బంధు లబ్ధిదారులు. రెండవ విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని...ఈనెల 23 నా జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దళిత బంధు నిధుల'పై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల లోపు దళిత బంధు నిధులను విడుదల చేయాలని నినాదాలు చేపట్టారు.
Supreme Court: సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్ 1 అభ్యర్థులు, సోమవారం మొదటి కేసుగా విచారణ చేపడతామని తెలిపిన జస్టిస్ డీవై చంద్రచూడ్..
Arun Charagondaతెలంగాణ గ్రూప్ 1 పరీక్ష పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరింది. గ్రూప్ 1 అభ్యర్థుల తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అడ్వకేట్ మోహిత్‌రావు. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని చిఫ్ జస్టిస్ కోర్టులో స్పెషల్ మోషన్ దాఖలు చేయగా గ్రూప్ 1 కేసు పిటిషన్‌ను సోమవారం విచరాణ చేపడుతామని చెప్పారు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్. మొదటి కేసుగా సోమవారం ఉదయం 11.30 కి విచారణ చేపడతామని చెప్పారు.
Harishrao On CM Revanth Reddy: రేవంత్..నీది నోరా మోరా?, మూసీ సుందరీకరణ కోసం లక్షా యాభై వేల కోట్లు అని చెప్పలేదా?,దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసీ బాధితుల దగ్గరికి వెళ్దామని ఛాలెంజ్
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీశ్ రావు. సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్. పోదాం పదా...డేట్, టైం మీరే చెప్పండి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరమే పోదాం. లేదంటే రేపు ఉదయం 9 గంటలకు నేను సిద్దం అని తేల్చిచెప్పారు.
Telangana: వీడియో ఇదిగో, బండరాయి మధ్యలో ఇరుక్కుపోయిన తల్లి కుక్క, పిల్లల ఏడుపు శబ్దం విని షూటింగ్ వదిలేసి పరిగెత్తుకొచ్చి కాపాడిన ఫైటర్లు, పిల్లల చెంతకు చేర్చి..
Hazarath Reddyమొయినాబాద్ లోని అజీజ్ నగర్‌లో ఓ సినిమా షూటింగ్ షూట్ జరుగుతుండగా కుక్కల ఏడుపు శబ్దం విని పరిగెతుకొని రెస్క్యూ చేసి తల్లిని కాపాడి దాని పది కుక్క పిల్లల చెంతకు చేర్చారు.
Group 4 Candidates Protest: గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత, గ్రూప్ 4 ఉద్యోగ అభ్యర్థుల ఆందోళన..బ్యాక్‌లాగ్ పోస్టులు ఉంచవద్దని డిమాండ్
Arun Charagondaహైదరాబాద్ కాంగ్రెస్ ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గాంధీ భవన్ వద్ద గ్రూప్ -4 ఉద్యోగ అభ్యర్థులు ఇవాళ ఉదయం ఆందోళనకు దిగారు. కొందరు గ్రూప్ -2, గ్రూప్ -1 మెయిన్‌కు ఎంపిక అయిన వారిని గ్రూప్ 4 నుంచి వెంటనే అన్ లివింగ్ చేయాలని డిమాండ్ చేశారు. వారి పోస్ట్‌లు వచ్చి వెళ్లిన తర్వాత బ్యాక్ లాగ్‌లుగా ఉంచవద్దని డిమాండ్ చేయగా పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
CM Revanth Reddy On Musi River Project: మూసీ సుందరీకరణ కాదు పునరుజ్జీవం, డీపీఆరే పూర్తి కాలేదు...లక్షన్నర కోట్లు అంటూ అసత్య ప్రచారం చేస్తారా...సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
Arun Charagondaతెలంగాణ ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్ధేశించే కార్యాచరణలో భాగంగా మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై సచివాలయంలో మీడియాతో మాట్లాడిన రేవంత్... ఈ ప్రాజెక్టు కోసం అయిదు ప్రముఖ సంస్థలతో కలిసిన కన్సార్షియమ్ కు పనులు అప్పగించినట్టు తెలిపారు. ఈ కన్సార్షియమ్ వచ్చే 18 నెలల్లో డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (DPR), ప్రాజెక్టుకు కావలసిన నిధులు, నిధుల సమీకరణకు ఉన్న మార్గాలను అధ్యయనం చేసి నివేదిస్తుందని చెప్పారు.
Case Against Harish Rao Relatives: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు బంధువులపై పోలీసు కేసు నమోదు.. ఎందుకంటే??
Rudraమాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు బంధువులపై పోలీసు కేసు నమోదైంది. తన ఐదంతస్తుల భవనంలో హరీశ్ రావు బంధువులు తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజ్ కుమార్ గౌడ్, గారపడి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు అక్రమంగా ఉంటున్నారని బాధితుడు దండు లచ్చిరాజు అనే వ్యక్తి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Hyderabad: మెడికల్ మాఫియా, ఆస్పత్రిలో చికిత్ర పొందుతూ యువతి మృతి, బంధువుల ఆందోళన..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ ఈసీఎల్‌లోని ఓ ఆస్పత్రి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తుర్కపల్లి మండలం మాదాపూర్‌కు చెందిన ఎంటెక్ విద్యార్థిని నిఖిత(23) ఛాతి నొప్పితో ఈసీఐఎల్‌లోని శ్రీకర హాస్పిటల్‌లో చేరింది.
Pottel Movie Promotion in Plane: విమానంలో ‘పొట్టేల్’ మూవీ ప్రమోషన్.. పాల్గొన్న నటి అనన్య నాగళ్ల (వైరల్ వీడియో)
Rudraయువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ చేస్తున్న చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకుడు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మాతలు.
Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరం.. బైక్ పై నెమ్మదిగా వెళ్లమని చెప్పాడని వృద్ధున్ని చంపేశారు.. వీడియో ఇదిగో..!
Rudraహైదరాబాద్ లోని అల్వాల్ లో దారుణం చోటు చేసుకుంది. బైక్ పై నెమ్మదిగా వెళ్లమని చెప్పాడని ఓ వృద్ధుడిని ఓ యువకుడు దారుణంగా కొట్టాడు. దవాఖానలో చికిత్సపొందుతూ తాజాగా ఆ వృద్దుడు మరణించాడు. 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Weather Update in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్షాలు.. వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా
Rudraతెలుగు రాష్ట్రాలపై వరణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
Telangana: వారు 3 నెలలు అక్కడ ఉంటే మూసీ నది ప్రాజెక్ట్‌ను ఆపేస్తాం, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, కొందరు మెదడులో మూసీలో ఉన్న మురికికంటే ఎక్కువ విషం నింపుకున్నారని మండిపాటు
Hazarath Reddyమూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక కామెంట్స్ చేశారు. అసలు ప్రాజెక్టుకు ఎందుకు చేపట్టారో సీఎం వివరించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
Telangana: వీడియో ఇదిగో, ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి ప్రేమ వివాహాం, ప్రేమించాలంటూ సంవత్సరం పాటు ఆమె వెంట పడి చివరకు సక్సెస్
Hazarath Reddyజగిత్యాల జల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌కి చెందిన కుమార్, మ్యాడంపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ అయినా కరుణాంజలి కొంత కాలంగా ప్రేమిస్తున్నానని కుమార్ తెలిపాడు. కరుణాంజలి అంత త్వరగా ఒప్పుకోలేదు. కుమార్ తన ప్రేమని వ్యక్తం చేయడంతొ కరుణాంజలి ఒప్పుకున్నది.