తెలంగాణ

Notices To Konda Surekha: కొండా సురేఖకు షాక్..నోటీసులు జారీ చేసిన నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు, నాగార్జున దాఖలు చేసిన కేసులో నోటీసులు

Arun Charagonda

మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు. నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరుగగా కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. తదుపరి విచారణ 23కు వాయిదా వేసింది కోర్టు.

Vikarabad: మద్యం మత్తులో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల వీరంగం..ఇంటికి వెళ్లి చితకబాదిన మందుబాబులు

Arun Charagonda

వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ బెల్ట్ షాపు వద్ద మందుబాబులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసులనే రక్తం వచ్చేలా కొట్టారు. ఓ బెల్ట్ షాప్ వద్ద తాగుతున్న వారిని నివారించేదెందుకు అబ్కారీ కానిస్టేబుల్స్ రాజేందర్, కృష్ణ వెళ్ళగా వారితో వాగ్వాదం జరిగింది. అనంతరం అబ్కారీ కానిస్టేబుల్స్ ఇంటికి వెళ్లిపోగా వారి ఇంటికి వెళ్లి పోకిరీలు వారి ఇంటికి వెళ్లి రక్తం వచ్చేలా దాడి చేశారు.

Kodangal: తండ్రి కలను నిజం చేసిన కుమార్తెలు, ఇద్దరు కుమార్తెలకు ప్రభుత్వ ఉద్యోగం, ఆ తండ్రి ఆనందం వర్ణించలేం..

Arun Charagonda

కొడంగల్ మండలం హుస్నాబాద్ కు శ్రీశైలం గౌడ్ డీఎస్సీ నిరంతరం సాధించేందుకు శ్రమించి రైతుగా మిగిలిపోయాడు. తండ్రి కలను సాకారం చేసేందుకు ఆయన ఇద్దరు కుమార్తెలు సుధ, శ్రీకావ్యలు డీఎస్సీ కోసం రోజూ 14 నుంచి 18 గంటల పాటు కష్టపడ్డారు. సుధ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌లో రెండో ర్యాంకు, ఫిజికల్ సైన్స్‌లో మొదటి ర్యాంకు సాధించగా.. శ్రీకావ్య ఎస్‌జీటీగా ఎంపికైంది.

Ponnam Prabhakar: చెడుపై విజయమే దసరా, ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం..ప్రాణాలు కాపాడుకుందామని పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్

Arun Charagonda

బతుకమ్మ, దసరా సందర్భంగా వాహ‌న‌దారుల‌కు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో సందేశం ఇచ్చారు. సగటున దేశవ్యాప్తంగా ఏడాదికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మ‌ర‌ణిస్తున్నారు అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ ద‌స‌రా నాడు కుటుంబ సభ్యులందరం ఆయుధపూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దాం అన్నారు.ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం,హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందాం అని పిలుపునిచ్చారు.

Advertisement

Hyderabad Horror: చందానగర్‌లో దారుణం, మర్మాంగాలు కోసి ఓ వ్యక్తి దారుణ హత్య, రూంలో తాగి పడేసిన మందుబాటిళ్లు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ పాలవెల్లి తెలిపిన ప్రకారం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకామనిపాడు గ్రామానికి చెందిన తన్నీరు మాలాద్రి (36) భార్య మాధవితో కలిసి ఆరేళ్లుగా శేరిలింగంపల్లి తారానగర్‌లో ఉంటున్నాడు.

Accident Caught on Camera: వీడియో ఇదిగో, వరంగల్‌లో ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు, మూడు ముక్కలైన ట్రాక్టర్, డ్రైవరుకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

వరంగల్ - వర్ధన్నపేట మండలం కట్ర్యాల వద్ద ఇసుక ట్రాక్టరును ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ మూడు ముక్కలైంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవరుకు తీవ్ర గాయాలు కాగా.. బస్సు డ్రైవర్, ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.

Telangana Shocker: వీడియో ఇదిగో, ఎస్సై వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్‌లోనే మహిళా ఏఎస్సై ఆత్మహత్యయత్నం, మెదక్ చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్‌లో ఘటన

Hazarath Reddy

మెదక్ - చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఎస్సై యాదగిరి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఏఎస్సై సుధారాణి. విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా విధులకు హాజరు కానట్లు కానిస్టేబుల్స్ తో అబ్సెంట్లు వేయిస్తున్నట్లు తెలిపిన ఏఎస్సై సుధారాణి.

Hyderabad Shocker: వీడియో ఇదిగో, హైదరాబాద్ నడబొడ్డున దారుణ హత్య, డ్రైవర్‌ని కత్తులతో వెంటాడి నరికిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి

Hazarath Reddy

హైదరాబాద్ నడబొడ్డున దారుణ హత్య ఘటన కలకలం రేపింది. పాతబస్తీలోని వట్టేపల్లి ప్రాంతంలో సాజిద్(37) అనే టాటా ఏస్ డ్రైవర్‌పై కత్తులతో దుండగులు దాడి చేశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా సాజిద్ మృతి చెందారు.. కేసు నమోదు చేసిన ఫలక్‌నుమా పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Ratan Tata Dies: భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపార దిగ్గజం రతన్ టాటా, దిగ్గజ వ్యాపారవేత్త మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్

Hazarath Reddy

టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్‌ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ అధ్యక్షడు (BRS Chief), తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) సంతాపం (condolence) వ్యక్తం చేశారు.

Ratan Tata Dies: రతన్ టాటా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రతన్ టాటా అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వెల్లడి

Hazarath Reddy

టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్‌ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా, భారతదేశపు గొప్ప పారిశ్రామికవేత్తలలో ఒకరు.

Demolitions In Ramagundam: రామగుండంలో హైడ్రా తరహా కూల్చివేతలు, అనుమతి లేకుండా నిర్మించిన భవనాన్ని కూల్చేసిన కార్పొరేషన్ అధికారులు

Arun Charagonda

రామగుండంలో హైడ్రా తరహా కూల్చివేతలు చేపట్టారు అధికారులు.రామగుండం ఎఫ్సీఐ గౌతమి నగర్లో అనుమతి లేకుండా నిర్మించిన భవనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు.

Saddula bathukamma 2024: సద్దుల బతుకమ్మ విశిష్టత తెలుసా?, తొమ్మిది రోజులపాటు రోజుకోరూపంలో కొలిచిన బతుకమ్మ ఇవాళ గంగమ్మ ఒడికి, ఊరూరా అంబరాన్నంటనున్న పెద్ద బతుకమ్మ సంబరాలు

Arun Charagonda

తెలంగాణ పూలపండగ బతుకమ్మ సంబరాలు అంబరన్నంటాయి. మహిళలు వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మను ఘనంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. తొమ్మిది రోజులపాటు రోజుకోరూపంలో కొలిచిన బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో ఆడిపాడిన తర్వాత స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయనున్నారు.

Advertisement

CM Revanth Reddy Slams KCR: కేసీఆర్‌ని కొరివి దెయ్యంతో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని వ్యాఖ్యలు, డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలను అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి కొరివి దెయ్యంగా అభివర్ణించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ కొరివి దెయ్యాన్ని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేశారని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను ఆ కొరివి దెయ్యం పట్టించుకోలేదని మండిపడ్డారు.

HYDRA Demolition Row: అది అబద్దమని నిరూపిస్తే సూసైడ్ చేసుకుని చనిపోతా, రేవంత్ రెడ్డి సర్కారుకి బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి సవాల్

Hazarath Reddy

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేలాదిమంది ప్రజలు ఇళ్లను నిర్మించుకోవడానికి వివిధ బ్యాంకులు లోన్లు ఇచ్చాయని, అవి అవాస్తవమని నిరూపిస్తే తాను సూసైడ్ చేసుకొని చనిపోవడానికి సిద్ధమని కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ చేశారు

Adulterated Tea Racket Busted: హైదరాబాద్‌లో టీ తాగేవాళ్లు జాగ్రత్త, 300 కిలోల కల్తీ టీ పొడి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

Hazarath Reddy

హైదరాబాదీ జాగ్రత్తగా ఉండండి, బహుశా మీరు టీ స్టాల్స్‌లో కల్తీ టీ తాగుతున్నారేమో. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం టీ కల్తీ రాకెట్‌ను ఛేదించింది.హైదరాబాద్‌లో 300 కిలోల కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకుంది.

CM Revanth Reddy On SC Categorization: ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్‌మెన్ కమిషన్‌ రిపోర్టు సమర్పించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, మాదిగలను మోసం చేస్తున్న నయవంచకుడు సీఎం అని బీఆర్ఎస్ మండిపాటు

Arun Charagonda

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని...వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Advertisement

Tension At Kodangal: సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం, ఫార్మా కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన...అడ్డుకున్న పోలీసులు, వీడియో

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దుద్యాల మండలంలో ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలను అరెస్ట్ చేశారు పోలీసులు.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, మహిళపై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారయత్నం, 100కు కాల్ చేసిన మహిళతో పరిచయం పెంచుకుని అఘాయిత్యం

Hazarath Reddy

వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ తన ఇంటి పక్కన గొడవ జరగగా 100కు కాల్ చేసింది.. దీంతో కానిస్టేబుల్ జగన్ ఇంటికొచ్చి మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు.ఆ తర్వాత తన దగ్గర డబ్బులు తీసుకొని తిరిగివ్వలేదు. చివరకు ఇంజాపూర్ తీసుకెళ్లి అఘాయిత్యం చేయబోగా తప్పించుకొని వచ్చానని ఆ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది.

KTR On Bathukamma Celebrations: ఈసారి పండుగ..పండుగ లెక్క లేకుండా పోయింది...భయానక వాతావరణంలో తెలంగాణ ప్రజలు..మండిపడ్డ కేటీఆర్, నరేందర్ రెడ్డి అరెస్ట్ అక్రమం అని మండిపాటు

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకవేళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి రైతుబంధు పైసలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చేవి అని తెలిపారు. ఈ సారి పండుగ.. పండుగ లెక్క లేకుండా పోయిందని...రేవంత్ పాలనలో రాష్ట్రంలో పండుగ జరుపుకునే పరిస్థితి లేకుండా భయానక వాతావారణం సృష్టించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana: వీడియో ఇదిగో, మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి ఇంట్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు, అవినీతి బండారం బయటపెట్టిన ఆమె భర్త

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి అవినీతి బండారాన్ని కట్టుకున్న భర్తే అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. తన భార్య జ్యోతి ప్రతి రోజూ లంచం తీసుకుంటుందంటూ ఇంట్లో గుట్టలు గుట్టలుగా ఉన్న డబ్బుల వీడియోలను విడుదల చేశారు ఆమె భర్త.

Advertisement
Advertisement