తెలంగాణ

Telangana High Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ , సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్‌ బెంచ్‌ నిరాకరణ, ఈ నెల 24న వాదనలు వింటామన్న హైకోర్టు

Arun Charagonda

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు డివిజన్ బెంచ్ షాకిచ్చింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది. ఈనెల 24న వాదనలు వింటామని తెలిపింది డివిజన్‌ బెంచ్‌.సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేశారు అసెంబ్లీ కార్యదర్శి.

Konda Surekha On KTR Legal Notices: కేటీఆర్ లీగల్ నోటీసులపై కొండా సురేఖ , న్యాయపరంగానే ఎదుర్కొంటా...కేటీఆరే తనకు క్షమాపణ చెప్పాలన్న మంత్రి సురేఖ

Arun Charagonda

కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై స్పందించారు మంత్రి కొండా సురేఖ. కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అని తేల్చి చెప్పారు. కేటీఆరే తనకు క్షమాపణ చెప్పాలని...ఆయన పంపిన నోటీసులపై లీగల్‌గానే స్పందిస్తానని చెప్పారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు అని.... నటి సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అని తెలిపారు కొండా.

Demolition Of Illegal Buildings: మంచిర్యాలలో అక్రమ కట్టాడలపై కొరడాఝుళిపించిన అధికారులు, అక్రమంగా నిర్మించిన కట్టడాల కూల్చివేత...వీడియో

Arun Charagonda

మంచిర్యాల పట్టణంలో అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. మార్కెట్ సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు అధికారులు. భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు.

Konda Surekha Comments Row: కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం, లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్, ఫైర్ బ్రాండ్‌ని నిద్ర లేపి తన్నించుకుంటున్నారంటున్న కాంగ్రెస్, ఎవరేమన్నారంటే..

Vikas M

సినిమా హీరోయిన్లను ఉద్దేశిస్తూ తనపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనకు ఏ మాత్రం సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ తో పాటు, ఇతర అంశాలపై కొండా సురేఖ అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Naga Chaitanya: కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై నాగ‌చైత‌న్య ఘాటు కౌంట‌ర్, ఇంత‌కీ నాగ‌చైత‌న్య ఏమ‌న్నారంటే?

VNS

మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్య‌ల దుమారం కొన‌సాగుతోంది. దీనిపై ఇప్ప‌టికే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున రియాక్ష‌న్స్ వ‌స్తున్నాయి. తాజాగా కింగ్ నాగార్జున‌, న‌టి స‌మంత (Samantha) కూడా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. అయితే నాగ చైతన్య (Naga Chaithanya) ఎలా రియాక్ట్ అవుతార‌ని అంతా ఎదురుచూశారు. కా

Samantha Reacts on Surekha Comments: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన స‌మంత‌, ఇన్ స్టాగ్రామ్ లో భావోద్వేగ నోట్, కేటీఆర్ తో ప‌రిచయంపై ఏమ‌న్నారంటే?

VNS

మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్య‌ల‌తో రాజ‌కీయ రంగంతో పాటూ సినీ రంగం షేక్ అవుతోంది. ఏ ఇద్ద‌రిని క‌దిపినా అదే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై నాగార్జున స్పందించారు. తాజాగా స‌మంత (Samantha) కూడా ఈ కామెంట్స్ పై సోష‌ల్ మీడియా వేదిక‌గా రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆమె అభ్యంత‌రం తెలిపారు

Telangana Rain Alert: రాబోయే రెండు రోజుల పాటూ తెలంగాణ‌కు రెయిన్ అల‌ర్ట్, హైద‌రాబాద్ తో పాటూ ఈ జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసిన ఐఎండీ

VNS

తెలంగాణలో రాగల రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను (Yellow Alert) జారీ చేసింది. బుధవారం వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

Hyderabad Shocker: వీడియో ఇదిగో, బాలిక ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ ట్యూషన్ టీచర్ అసభ్య ప్రవర్తన, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

Hazarath Reddy

హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్లో పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ ట్యూషన్ టీచర్ రాములు అసభ్యకరంగా ప్రవర్తించారు. ట్యూషన్ టీచర్ గురించి బాలిక తన తల్లికి చెప్పింది. దీంతో ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది.

Advertisement

Nagarjuna on Konda Surekha Comments: నాగచైతన్య-సమంత విడాకులు, కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో నాగార్జున, మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ ట్వీట్

Hazarath Reddy

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ.. నాగచైతన్య-సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.

KTR on Konda Surekha Comments: కొండా సురేఖ ఏడిస్తే తమకు సంబంధం లేదని తెలిపిన కేటీఆర్, మాపై ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లు ఏడవరా అంటూ సూటి ప్రశ్న

Hazarath Reddy

హీరోయిన్లకు సంబంధించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని కొండా సురేఖ అనలేదా? నాకు కుటుంబం, భార్యాపిల్లలు లేరా? అని (KTR on Konda Surekha Comments) నిలదీశారు

Sabitha Indra Reddy on Konda Surekha Comments: కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? అంటూ సూటి ప్రశ్న

Hazarath Reddy

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తప్పుబట్టారు. కేటీఆర్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Prakash Raj on Konda Surekha Comments: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా? ఎక్స్ వేదికగా నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్

Hazarath Reddy

కేటీఆర్‌ను ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేస్తూ, "ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా?.. #justasking" అని ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Konda Surekha on KTR: హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్‌కు అలవాటే, కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు, సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం అతడే అంటూ..

Hazarath Reddy

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ కు అలవాటేనని ఆమె అన్నారు. కేటీఆర్ డ్రగ్స్ కు అలవాటు పడ్డారని... హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా ఆయనే అని మండిపడ్డారు

Heart Attack Caught on Camera: వీడియో ఇదిగో, బట్టలు కోసం వచ్చి గుండెపోటుతో కుప్పకూలిన కస్టమర్

Hazarath Reddy

హార్ట్ ఎటాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్ నెంబర్-1 లోని షోరూమ్‌లో బట్టలు తీసుకుంటూ ఉండగా హార్ట్ ఎటాక్ సమస్యతో కిందపడిపోయాడు ప్రవీణ్ గౌడ్ (37). వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు.సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

Telangana Horror: వరంగల్‌లో దారుణం, యువతికి బీర్లు తాగించి స్నేహితులు సామూహిక అత్యాచారం, బలవంతంగా కారులో ఎక్కించుకుని..

Hazarath Reddy

భూపాలపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువతి నగర శివారులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతోంది. గత నెల 15న ఆమె స్వస్థలానికి చెందిన తెలిసిన యువకుడొకరు ఆమె వసతి గృహం వద్దకు వెళ్లాడు. మాట్లాడే పని ఉందంటూ ఆమెను కారులో ఎక్కమన్నాడు.

Hyderabad Horror: వీడియో ఇదిగో, హైడ్రా కూల్చివేతల్లో ఎగిరి వచ్చి పోలీసుకు తగిలిన రాయి, కుప్పకూలిన అక్కడే పడిపోయిన తెలంగాణ పోలీస్

Vikas M

Advertisement

Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం, చెరువును తలపిస్తున్న పంజాగుట్ట-అమీర్‌పేట రహదారి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిక

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. పంజాగుట్ట, బేగంపేట, కూకట్‌పల్లి, మూసాపేట్, నిజాంపేట్ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది.

DJ Sound Systems Ban in Hyderabad: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం, కీలక ఉత్తర్వులు జారీ చేసిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

Hazarath Reddy

హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఊరేగింపులు, వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డీజేలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు డయల్ 100కు ఫిర్యాదులు పెరిగాయి.

Telangana Shocker: వీడియో ఇదిగో, గ్రామం నుండి బహిష్కరించారని దంపతులు ఆత్మహత్యాయత్నం

Hazarath Reddy

ఆస్తి పంపకాల్లో చెప్పినమాట వినలేదని పెద్దలు గ్రామ బహిష్కరణ విధించడంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా రామన్నపేట్ మండలం మునిపంపుల గ్రామంలో ఆస్తి పంపకాల్లో గ్రామపెద్దలు చెప్పినట్లు వినకపోవడంతో రమేష్, వసంత దంపతులను గ్రామ బహిష్కరణ చేశారు.

Hyderabad Road Accident: వీడియో ఇదిగో, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, మద్యం సేవించిన యువకులను చితకబాదిన స్థానికులు

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లాలో పుప్పాలగూడలో కారు బీభత్సం సృష్టించింది. నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టింది. కారులో ఉన్న నలుగురు యువకులను స్థానికులు చితకబాదారు. దీంతో కోప్రాదిక్తులైన స్థానికులు కారు అద్దాలు ధ్వంసం చేశారు. మద్యం సేవించి యువకులు కారు నడిపారంటూ వారిని స్థానికులు చితకబాదారు.

Advertisement
Advertisement